Actress Mamta Mohandas About Dating Rumours
Cinema

Acrtess Comments: డేటింగ్‌పై నటి ఇంట్రెస్టింగ్‌ కామెంట్స్

Actress Mamta Mohandas About Dating Rumours: టాలీవుడ్‌ హీరో జూనియర్‌ ఎన్టీఆర్‌ నటించిన యమదొంగ మూవీలో స్పెషల్ రోల్‌తో మంచి ఐడెంటీటీని తెచ్చుకుంది నటి మమతా మోహన్‌దాస్‌. ఆ మూవీ తర్వాత ఈ మలయాళీ కుట్టి వరుస ఛాన్సులు అందుకొని దక్షిణాది భాషలన్నిటిలోనూ యాక్ట్ చేసింది. ప్రస్తుతం విజయ్‌ సేతుపతితో కలిసి మహారాజాతో సందడి చేసేందుకు రెడీ అయ్యారు.

తాజాగా ఓ ఇంటర్వ్యూలో డేటింగ్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది ఈ ముద్దుగుమ్మ. లాస్‌ ఏంజెలెస్‌లో ఉన్నప్పుడు ఒకరిని ప్రేమించాను. కానీ, మా బంధం ఎక్కువ రోజులు నిలవలేదు. జీవితంలో రిలేషన్‌ ఉండాలి. కానీ ఒత్తిడితో కూడిన బంధాన్ని నేను కోరుకోవడం లేదు. జీవితానికి కచ్చితంగా ఒకతోడు అవసరం అని భావించడం లేదు. ప్రస్తుతానికి చాలా సంతోషంగా ఉన్నాను. భవిష్యత్తు ఎలా ఉంటుందో చెప్పలేం. మంచి జీవిత భాగస్వామి కోసం వెతుకుతున్నా.. సమయం వచ్చినప్పుడు అన్ని బయటకు వస్తాయన్నారు.

తన కెరీర్‌ గురించి మాట్లాడుతూ..మలయాళీ చిత్ర పరిశ్రమలోనూ నాకు మంచి ఐడెంటీటీ వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది. నేను పోషించిన ఎన్నో రోల్స్‌కు అగ్ర నటీనటుల నుంచి ప్రశంసలు వచ్చాయి. తెలుగు, తమిళ బాషల్లోనూ స్టార్స్‌తో మూవీస్ చేసే ఛాన్స్ వచ్చింది. బాలీవుడ్‌ నటుడు పంకజ్‌ త్రిపాఠి, గౌరీ ఖాన్‌ ప్రశంసలను ఎప్పటికీ నేను మర్చిపోలేనని మమతా మోహన్‌ దాస్ చెప్పారు. గతేడాది ఐదు మూవీస్‌తో సందడి చేసిన మమతా ప్రస్తుతం మహారాజా మూవీ ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్నారు.

Just In

01

Telangana Jagruthi: తెలంగాణ జాగృతి సంస్థ నాయకులు ఫైర్.. కారణం అదేనా..?

Crime News: తీరుమారని గంజాయి పెడ్లర్ పై పీడీ యాక్ట్.. ఉత్తర్వులు జారీ!

Crime News: హైదరాబాద్‌లో దారుణం.. మార్ఫింగ్ ఫోటోలతో యవతికి బెదిరింపులు

Teja Sajja: టాలీవుడ్ హీరోల గురించి ఎవరికీ తెలియని విషయం చెప్పిన తేజ సజ్జా.. ఇలా కూడా ఉంటుందా?

Balapur Laddu Auction 2025: బాలాపూర్ లడ్డు సరికొత్త రికార్డ్.. ఈసారి ఎన్ని రూ.లక్షలు పలికిందంటే?