A Rowdy Hero Entry In A Double Role: టాలీవుడ్ రౌడీ విజయ్ దేవరకొండ ఒకేసారి రెండు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఈ రెండు సినిమాలు రెండు ప్రాంతాల నేపథ్యంలో తెరకెక్కనున్నాయి. ఒకటి గోదారి నేపథ్యం అయితే మరొకటి రాయలసీమ బ్యాక్‌డ్రాప్‌లో రాబోతున్నాయి. ఈ మ్యాటర్‌ని మేకర్స్ అఫీషియల్స్‌గా అనౌన్స్ చేయలేదు. కానీ ఈ మూవీ కాస్టింగ్ కాల్స్ చూస్తే క్లారిటీ వస్తోంది.
కొన్నిరోజుల కిందట ప్రొడ్యూసర్ దిల్‌రాజు కాస్టింగ్ కాల్‌కు పిలుపునిచ్చాడు. విజయ్ దేవరకొండ మూవీలో యాక్ట్ చేయడానికి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్లు ముందుకురావాలని సూచించారు. అయితే గోదారి యాస వచ్చేవాళ్లకు ఎక్కువ ప్రాధాన్యం ఉంటుందనే విషయాన్ని అందులో పొందుపరిచారు. అలా రవికిరణ్ కోలా మూవీ గోదావరి బ్యాక్ డ్రాప్‌తో రాబోతోందనే విషయం రివీల్ అయ్యింది. ఇక ఈ మూవీని మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై రాబోతుండగా ఈ మూవీకి హీరో విజయ్ ఓకే చెప్పాడు. రాహుల్ సంకృత్యాన్ డైరెక్షన్‌లో తెరకెక్కనున్న ఈ మూవీ కంప్లీట్‌గా రాయలసీమ నేపథ్యంగా తీసుకున్నారు. ఈ మూవీ కంప్లీట్‌గా సీమలోనే ఉండనుందని మూవీ మేకర్స్ క్లారిటీ ఇచ్చారు.
Also Read: ఊహించని స్థాయిలో కల్కి టికెట్స్‌కి భారీ క్రేజ్
రాయలసీమలోని పలు జిల్లాల్లో వచ్చెనెల 1 నుంచి 9 వరకు ఆడిషన్స్ జరగనున్నాయి. ఇక మరోవైపు తెలంగాణ యాసలో విజయ్ దేవరకొండ ఇట్టే ఆకట్టుకుంటాడు. గతంలో గీతాగోవిందం, తాజాగా వచ్చిన ఫ్యామిలీ స్టార్‌లో ఆంధ్రా స్టైల్లో డైలాగ్స్ చెప్పి అందరిని ఆకట్టుకున్నాడు. త్వరలోనే రాబోతున్న ఈ రెండు సినిమాల్లో అతడు గోదారి యాస, సీమ యాసలో ఆడియెన్స్‌ని అలరించనున్నాడు ఈ రౌడీ హీరో.