Swiggy New Features: పండుగ సీజన్‌లో రైల్వే ప్రయాణాలు చేసే ప్యాసింజర్లకు ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫామ్ స్విగ్గీ గుడ్‌న్యూస్ చెప్పింది. ‘ఫుడ్ ఆన్ ట్రైన్’ సర్వీసులో పలు కొత్త ఫీచర్లను (Swiggy New Features) ప్రకటించింది. పండుగ సీజన్‌లో ప్రయాణికులకు మెరుగైన భోజన అనుభూతిని అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యంగా ఈ ఫీచర్లను తీసుకొచ్చింది. సిటీ బెస్ట్, ఈజీ ఈట్స్, ప్యూర్ వెజ్, ఆఫర్ జోన్ వంటి ప్రత్యేక సెక్షన్లను రైల్వే ప్యాసింజర్లకు అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ ఫీచర్ల ద్వారా ప్రయాణికులు దేశవ్యాప్తంగా 115కిపైగా రైల్వే స్టేషన్లలో ఎంపిక చేసిన వివిధ రకాలు ఆహార పదార్థాలు ఎంపిక చేసుకొని ఆర్డర్ ఇవ్వవచ్చు. కొత్తగా ప్రవేశపెట్టిన ‘ఆఫర్ జోన్’ ద్వారా మొత్తం 30 డీల్స్‌ను స్విగ్గీ అందుబాటులో ఉంచింది.
Read Also- Local Body Elections: స్థానిక ఎన్నికల కోసం ప్రభుత్వం జీవో పై కసరత్తు.. మరోవైపు అధికారులకు ట్రైనింగ్!
ఫీచర్ల వివరాలు ఇవే
సిటీ బెస్ట్ ఫీచర్ ద్వారా ప్రముఖ స్టేషన్లు ఉండే నగరాలు లేదా, పట్టణాల్లో స్థానికంగా లభ్యమయ్యే ప్రసిద్ధ భోజనాలు, వంటకాలు అందుబాటులో ఉంటాయి. ప్యాసింజర్లు జాగ్రత్తగా పరిశీలించి ఆర్డర్ పెట్టుకోవచ్చు. తద్వారా స్థానిక లభించే ప్రత్యేక ఫుడ్‌ను రైలులో ఉండి రుచి చూసే అవకాశం దక్కుతుంది. ఇక, ఈజీ ఈట్స్ ఫీచర్ ద్వారా అన్నీ ప్యాకింగ్ చేసిన ఆహార పదార్థాలు లభ్యమవుతాయి. ఈ ఫీచర్ కింద ఆర్డర్ చేసే పార్శిళ్లను చాలా జాగ్రత్తగా కట్టుదిట్టమైన పద్ధతిలో తయారు చేస్తారు. తినడానికి ఉపయోగించే స్ఫూన్స్ కూడా ప్యాకింగ్‌లో లభిస్తాయి. ‘ప్యూర్ వెజ్’ విభాగం ప్రత్యేకంగా శాకాహారుల కోసం స్విగ్గీ రూపొందించింది. నవరాత్రి, పండుగ సీజన్‌లో పూజలు, ఉపవాసాలు ఉండే వారి కోసం ఈ విభాగాన్ని స్విగ్గీ అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇక, కొత్తగా ప్రవేశపెట్టిన ‘ఆఫర్ జోన్’లో 60 శాతం వరకు తగ్గింపు ఆఫర్లు లభిస్తాయి. మొత్తం 30కిపైగా డీల్స్ రైల్వే ప్రయాణికులకు అందుబాటులో ఉంటాయి.
Read Also- Harish Rao: సీఎం రేవంత్ కరెక్టా?.. మంత్రి ఉత్తమ్ కరెక్టా?.. హరీశ్ రావు సూటి ప్రశ్నలు!
స్విగ్గీ అధికారి స్పందన ఇదే
ఈ కొత్త ఫీచర్లపై స్విగ్గీ ఫుడ్ స్ట్రాటజీ, కస్టమర్ ఎక్స్‌పీరియన్స్, న్యూ ఇనిషియేటివ్స్ వైస్ ప్రెసిడెంట్ దీపక్ మలూ స్పందించారు. తమ కస్టమర్ల ఏం కోరుకుంటున్నారో తెలుసుకున్నామని, సరికొత్త విధానాలను ప్రకటించడం పట్ల సంతోషంగా ఉన్నామని ఆయన తెలిపారు. వ్యక్తిగతంగా ఎంచుకునే మరిన్ని ఫీచర్లు అందుబాటులోకి రావడంతో ప్రతీ ప్రయాణం మరింత అందమైన అనుభూతిని అందిస్తుందని, సౌకర్యవంతంగా, ప్రత్యేకంగా నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. సిటీ బెస్ట్, ఈజీ ఈట్స్, ప్యూర్ వెజ్ లాంటి ఫీచర్లను ఉపయోగించుకొని ప్రతి ప్యాసింజర్ తాను ఇష్టపడే భోజనాన్ని సులభంగా పొందవచ్చునని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. స్విగ్గీ తన ‘ఫుడ్ ఆన్ ట్రైన్ పేజీ’ని స్లో ఇంటర్నెట్ ఉన్న ప్రదేశాల్లో కూడా వేగంగా ఆర్డర్ చేయగలిగేలా మెరుగుపరిచినట్లు దీపక్ మలూ వివరించారు.