Spotify Premium Plans: ప్రముఖ మ్యూజిక్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫార్మ్ స్పాటిఫై భారత్‌లో తన ప్రీమియం సేవల్లో కొత్త మార్పులు చేసింది. కంపెనీ లైట్, స్టాండర్డ్, స్టూడెంట్, ప్లాటినమ్ ( Lite, Standard, Student, Platinum) అనే నాలుగు కొత్త ప్రీమియం ప్లాన్‌లను విడుదల చేసింది. యూజర్లు ఇప్పుడు మరింత యాడ్స్ లేకుండా సంగీతాన్ని వినగలుగుతున్నారు. ఆడియో క్వాలిటీ మాత్రం యూజర్ ఎంచుకున్న ప్లాన్‌పై ఆధారపడి ఉంటుంది.
స్పాటిఫైకి సంబంధించి అన్ని ఫీచర్లు పొందాలంటే వినియోగదారులు ఇంతకుముందు కంటే కొంచెం ఎక్కువ చెల్లించాల్సి ఉంటుంది. అయితే, కంపెనీ ప్రకటన ప్రకారం ఇప్పటికే ఉన్న సబ్‌స్క్రైబర్లు తమ ప్రస్తుత ప్లాన్‌లు, ధరలను కొనసాగించవచ్చు, అవసరమైతే కొత్త ప్లాన్‌లకు అప్‌గ్రేడ్ అవ్వచ్చని తెలిపింది.
కొత్త స్పాటిఫై ప్రీమియం ప్లాన్స్
ప్రీమియం లైట్ ( Premium Lite) – రూ. 139/నెల
ఒక అకౌంట్ సపోర్ట్,
యాడ్స్ లేని మ్యూజిక్,
ఆడియో క్వాలిటీ: 160 kbps.
స్టాండర్డ్ (Standard) – రూ. 199/నెల
రెండు నెలల యాడ్స్-ఫ్రీ లిసనింగ్,
మ్యూజిక్ & ఆడియోబుక్స్ ఆఫ్లైన్ డౌన్‌లోడ్,
ఆడియో క్వాలిటీ: 320 kbps.
స్టూడెంట్ ప్లాన్ (Student Plan) – రూ. 99/నెల
స్టాండర్డ్ ప్లాన్ ప్రత్యేకంగా విద్యార్థుల కోసం మాత్రమే.
ప్రీమియం ప్లాటినమ్ ( Premium Platinum) – రూ. 299/నెల
మూడు అకౌంట్లు వరకు సపోర్ట్,
ఆఫ్లైన్ లిసనింగ్ కూడా ఉంటుంది.
లాస్‌లెస్ ఆడియో (44.1 kHz),
అదనపు ఫీచర్లలో మిక్స్ యువర్ ప్లే లిస్ట్స్ (Mix Your Playlists), ఏఐ డీజే (AI DJ) , ఏఐ ప్లే లిస్ట్ క్రియోషన్ ( AI Playlist Creation) ఉన్నాయి.
కొత్త ప్లాన్‌లు ఇకపై ఎవరికి వర్తిస్తాయి?
స్పాటిఫై తెలిపిన వివరాల ప్రకారం, ఇప్పటి వరకు సబ్‌స్క్రైబ్ అయిన యూజర్లు తమ ప్రస్తుత ధరలు, ప్లాన్‌లు కొనసాగించవచ్చు. మార్పులు ప్రధానంగా కొత్తగా సబ్‌స్క్రైబ్ అయ్యే యూజర్లకు మాత్రమే వర్తిస్తాయి. ఈ కొత్త స్ట్రక్చర్ భారత్ సహా ఇండోనేషియా, సౌదీ అరేబియా, దక్షిణ ఆఫ్రికా, యుఎఈ దేశాలకు వర్తిస్తుంది.
