Rupee Fall: దేశీయ కరెన్సీ రూపాయి పతనం (Rupee Fall) కొనసాగుతోంది. అమెరికన్ డాలర్‌తో పోలిస్తే శుక్రవారం ఒక్కనాడే 11 పైసలు మేర క్షీణించి 86.52 వద్ద ముగిసింది. గురువారం 86.41 వద్ద ముగియగా శుక్రవారం మరింత దిగజారింది. గ్లోబల్ మార్కెట్లు, దేశీయ ఆర్థిక పరిణామాల ఒత్తిళ్లు రూపాయిపై ప్రభావం చూపినట్లు మార్కెట్ నిపుణులు విశ్లేషించారు. అమెరికన్ డాలర్ బలపడడం, బ్రెంట్ క్రూడాయిల్ ధరలు పెరగడం, విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు పెట్టుబడులు ఉపసంహరించుకోవడం ప్రధానంగా మూడు కారణాలని చెబుతున్నారు.
Read Also- Parliament: పార్లమెంట్‌లో ‘ఆపరేషన్ సిందూర్’పై చర్చ.. ముహూర్తం ఫిక్స్
పెరిగిన క్రూడాయిల్ ధర
క్రూడాయిల్ ధరలు పెరిగాయి. ఆసియా మార్కెట్ల ప్రారంభంలో బ్యారెల్ క్రూడాయిల్ ధర 69.53 డాలర్లకు చేరింది. అంతర్జాతీయంగా రాజకీయ ఉద్రిక్త పరిస్థితులు కాస్త తగ్గడం, నూతన వాణిజ్య ఒప్పందాలు జరగడం ఇందుకు దోహదపడ్డాయి. రష్యా ఆయిల్‌పై యూరోపియన్ యూనియన్ ఆంక్షలు విధించడం, రష్యా తాత్కాలికంగా ఎగుమతులు నిలిపివేయడంతో ప్రపంచ వ్యాప్తంగా ఆయిల్ సరఫరా తగ్గిందని ఫిన్‌రెక్స్ ట్రెజరీ అడ్వైజర్స్ ట్రెజరీ హెడ్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అనిల్ కుమార్ భన్సాలీ విశ్లేషించారు. సెప్టెంబర్ చివరినాటికి బ్రెంట్ ధరలు బారెల్‌కు 70.70 డాలర్ల స్థాయికి చేరుకునే అవకాశం ఉందని అంచనా వేశారు. ఇదే సమయంలో అమెరికా డాలర్ బలపడడం కూడా కారణమైందని పేర్కొన్నారు. అమెరికా ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన గణాంకాలు బలంగా ఉన్నాయని, నిరుద్యోగ రేటులో కూడా వరుసగా ఆరవ వారం తగ్గుదల నమోదు కావడంతో ఆ దేశ ఆర్థిక వ్యవస్థ పటిష్టతకు ప్రతిబింబమని భన్సాలీ పేర్కొన్నారు.
Read Also- Viral News: టీనేజర్‌పై అన్నదముళ్ల అఘాయిత్యం.. ప్రెగ్నెంట్ అని తెలియగానే..
ప్రపంచంలో ఇతర ప్రధాన దేశాల కరెన్సీలతో పోల్చితే డాలర్ స్థిరంగా కొనసాగుతోంది. యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ (ECB) వడ్డీ రేట్లు 2 శాతంగానే కొనసాగిస్తుండడం దీనికి కారణమంటూ విశ్లేషణలు వ్యక్తమవుతున్నాయి. 2024 తర్వాత ఈసీబీ ఏకంగా ఏడుసార్లు వరుసగా వడ్డీ రేట్లను తగ్గించిన తర్వాత, తగ్గింపునకు బ్రేక్ ఇవ్వడం ఇదే మొదటిసారి. ఇక, ఈయూ-యూఎస్ మధ్య ఇంకా అపరిష్కృతంగా ఉన్న వాణిజ్య చర్చలు, మిగిలిన టారిఫ్ సవాళ్లు ఈసీబీ ఆచితూచి జాగ్రత్తగానే వ్యవహరించేందుకు కారణమవుతున్నాయని అనిల్ కుమార్ భన్సాలీ వివరించారు.
Read Also- Sad News: ఘోరవిషాదం.. స్కూల్లో ఏడుగురు విద్యార్థుల మృతి