Jio New Year offers: ప్రతి నూతన సంవత్సరం సందర్భంగా కస్టమర్లకు ఆకర్షణీయమైన ఆఫర్లు ప్రకటించే భారత టెలికం దిగ్గజం రిలయన్స్ జియో (Reliance jio) మరోసారి యూజర్లను సర్‌ప్రైజ్ చేసింది. ‘రియలన్స్ జియో హ్యాపీ న్యూఇయర్’ (Jio New Year offers) పేరిట మూడు సరికొత్త ప్లాన్లను ప్రకటించింది. హీరో యాన్యూవల్ రిఛార్చ్, సూపర్ సెలబ్రేషన్ మంత్లీ ప్లాన్, ఫ్లెక్సి ప్యాక్ పేరిట ఈ ఆఫర్లను వెల్లడించింది. వాటికి సంబంధించిన ఫీచర్ల వివరాలు చూసేద్దాం..
హీరో యాన్యూవల్ రీఛార్జ్
హీరో యాన్యూవల్ రీఛార్చ్ పేరిట రూ.3,599 వార్షిక ప్లాన్‌ను జియో ప్రకటించింది. ఈ ప్లాన్ కింద యూజర్లు అపరిమిత 5జీ, రోజుకు 2.5 GB డేటా, అపరిమిత వాయిస్ కాల్స్‌తో పాటు రోజుకు 100 ఎస్ఎంఎస్‌లను పొందవచ్చు. ఈ ప్లాన్ వ్యాలిడిటీ 365 రోజులుగా ఉంది. అంతేకాకుండా, రూ.35,100 విలువైన గూగుల్ జెమినీ (Google Gemini) 18 నెలల ప్రో ప్లాన్‌ను ఉచితంగా పొందవచ్చని తెలిపింది.
Read Also- Social Media Ban: ఆస్ట్రేలియా తర్వాత 16 ఏళ్లలోపు వారికి సోషల్ మీడియా నిషేధం విధించనున్న మరో దేశం
సూపర్ సెలబ్రేషన్ మంత్లీ ప్లాన్
సూపర్ సెలబ్రేషన్ మంత్లీ ప్లాన్‌ను రూ.500 రీఛార్జ్‌తో రిలయన్స్ జియో ప్రకటించింది. ఈ ప్లాన్ బెనిఫిట్స్ విషయానికి వస్తే, అపరిమిత 5జీ స్పీడ్, రోజుకు 2 డేటాను పొందవచ్చు. అంతేకాదు, అపరిమిత వాయిస్ కాల్స్, రోజుకు 100 ఎస్ఎంఎస్‌లను యూజర్లు పొందవచ్చు. ఈ ప్లాన్ కింద ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ల యాక్సెస్ పొందవచ్చు. ఈ జాబితాలో యూట్యూట్ ప్రీమియం, జియోహాట్‌స్టార్, అమెజాన్ పీవీఎంఈ, సోనీ లివ్, జీ5, లయన్స్‌గేట్ ప్లే, డిస్కవరీ ప్లస్, సన్ నెక్స్ట్, ప్లానెట్ మరాథి, చౌపల్, ఫ్యాన్ కోడ్, హొయ్‌చొయ్ ప్లాట్‌ఫామ్‌ల సబ్‌స్క్రిప్షన్ లభిస్తుంది. అయితే, ఈ ప్లాన్ కేవలం 28 రోజులు మాత్రమే చెల్లుబాటు అవుతుంది. దీనిలో ప్రత్యేక ఆఫర్ కింద రూ.35,100 విలువైన గూగుల్ జెమినీ ప్రో ప్లాన్‌ను 18 నెలలపాటు ఉచితంగా పొందవచ్చు.
ఫ్లెక్సి ప్యాక్
మూడవ ప్లాన్ కింద ఫ్లెక్సి ప్యాక్‌ను ప్రకటించింది. ఈ ప్లాన్ రీఛార్జ్ రూ.103గా ఉంది. 5 జీబీ 5జీ డేటా లభిస్తుంది. ఎంటర్‌టైన్‌మెంట్ ప్యాక్‌లను యూజర్లు ఒకదాన్ని ఎంచుకోవచ్చు. హిందీ ప్యాక్‌లో జియోహాట్‌స్టార్, జీ5, సోనీ లివ్ ఉన్నాయి. ఇంటర్నేషనల్ ప్యాక్ విషయానికి వస్తే, జియోహాట్‌స్టార్, ఫ్యాన్‌కోడ్, లయన్‌గేట్, డిస్కవరీ ప్లస్ ఆప్షన్లు ఉంటాయి. రీజినల్ ప్యాక్‌లో కొన్ని ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లు ఉంటాయి. ఈ ప్లాన్ వ్యాలిడిటీ 28 రోజులుగా ఉంటుంది.
Read Also- Vikarabad Crime: ప్రియుడిని కలవకుండా అడ్డొస్తున్నాడని.. ట్రాక్టర్‌తో గుద్ది భర్తను చంపించిన భార్య!

