Artificial Intelligence: ఎన్వీడియా మూడో త్రైమాసిక ఫలితాల ముందు మార్కెట్‌లో ఒక్క సందేహమే ఎక్కువగా వినిపిస్తుంది. “ ఈ AI బబుల్ అయితే ఎప్పుడు పగులుతుందో?” అనే ప్రశ్న. భారీగా డేటా సెంటర్ల నిర్మాణం, కంపెనీలు టెన్స్ ఆఫ్ బిలియన్లు పెట్టుబడులు పెట్టడం.. ఇవన్నీ చూసి కొన్ని వాల్ స్ట్రీట్ విశ్లేషకులు రాబడి అంత రాదని అనుమానపడ్డారు. అయితే.. ఫలితాల కాల్ మొదలుపెట్టిన వెంటనే ఎన్వీడియా CEO జెన్సెన్ హువాంగ్ ఆ అనుమానాలన్నింటినీ ఒక్కసారిగా కొట్టిపారేశారు.
హువాంగ్ ఏం చెప్పారంటే.. “ ఇది బబుల్ కాదు…మేము పూర్తిగా వేరే దశలో ఉన్నాం.. మా ప్లానింగ్ కూడా వేరుగా ఉంది” అని అన్నారు. ఎందుకంటే, ఈ రోజున్న AI ప్రపంచానికి వెన్నెముక ఎన్వీడియానే. అమెజాన్, మైక్రోసాఫ్ట్, గూగుల్, ఒరాకిల్ వంటి అతిపెద్ద క్లౌడ్ కంపెనీలు ఎన్వీడియా GPUలపైనే నడుస్తున్నాయి . OpenAI, Anthropic, xAI, Meta లాంటి టాప్ AI మోడల్ డెవలపర్లు కూడా వీరి పెద్ద కస్టమర్లే. ప్రపంచ GPU డిమాండ్‌పై ఇంత క్లియర్ వ్యూ ఇంకెవరికీ లేదు.
జెన్సెన్ హువాంగ్ చెప్పిన మూడు కారణాలు ఇక్కడ తెలుసుకుందాం..
1. CPUలతో కాలం ముగిసింది.. GPUల కోసం పెద్ద మార్పు జరుగుతోంది
డేటా ప్రాసెసింగ్, యాడ్స్ రికమెండేషన్స్, సెర్చ్, ఇంజనీరింగ్ వర్క్‌లో cpu లు సరిపోరని ఆయన చెప్పారు. అందుకే, పెద్ద ఎత్తున GPUలకు మార్పు జరుగుతోంది. ఈ మార్పు రాబోయే సంవత్సరాల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అప్ గ్రేడ్ కోసం పెద్ద అవకాశం.
Also Read: Banakacherla Project: బనకచర్ల నిర్మాణానికి కేంద్రం అనుమతించొద్దు.. మంత్రి ఉత్తమ్ డిమాండ్
2. AI కొత్త యాప్స్ కి దారి తీయబోతుంది
ఏఐ AI కేవలం ఇప్పటి యాప్స్‌ను మెరుగుపరచకుండా, అత్యాధునిక, కొత్త సాఫ్ట్‌వేర్ కేటగిరీలను క్రియోట్ చేయనుంది. ఇవి ఎక్కువ compute శక్తిని కోరతాయి, డిమాండ్ తగ్గదు, ఎప్పటికప్పుడు పెరుగుతూనే ఉంటుంది.
Also Read: Divya Bharathi: ‘గోట్’ దర్శకుడిపై సంచలన ఆరోపణలు చేసిన హీరోయిన్.. సుడిగాలి సుధీర్ ఏం చేశాడంటే?
3. ఏజెంటిక్ ఏఐ (AI) – స్వయంగా పని చేయగల (AI )సిస్టమ్‌లు
ఏజెంటిక్ ఏఐ AI అంటే.. పని మొదలుపెట్టి, ఆలోచించి, ప్లాన్ చేసి, చివరి వరకు పూర్తిచేసే AI. ఇవి CPU–GPU పైన అత్యధిక compute శక్తిని ఉపయోగిస్తాయి. అంటే, భారీ జీపియూ (GPU) ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవసరం.
