Xiaomi 14 Ultra: యూజర్లకు నవంబర్‌లో HyperOS 3 అప్‌డేట్..
Xiaomi 14 Ultra ( Image Source: Twitter)
బిజినెస్

Xiaomi 14 Ultra: Xiaomi 14 Ultra యూజర్లకు నవంబర్‌లో HyperOS 3 అప్‌డేట్.. కొత్త ఫీచర్లు ఇవే!

Xiaomi 14 Ultra: Xiaomi 14 Ultra యూజర్లకు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న HyperOS 3 గ్లోబల్ అప్డేట్ ఈ నెలాఖరులోపే రానున్నట్లు సమాచారం.  Xiaomi టెస్ట్ సర్వర్లలో కనిపించిన తాజా డేటా ప్రకారం, ఈ అప్డేట్ కు సంబంధించిన పనులు కూడా పూర్తయ్యాయి. అలాగే, ఇది ఇప్పుడు స్టేబుల్ రోల్‌అవుట్‌కు సిద్ధంగా ఉందని Xiaomitime పేర్కొంది. ఇప్పటికే చైనా యూజర్లు ఈ అప్డేట్ ను పొందగా, గ్లోబల్ మోడల్‌కి త్వరలోనే విడుదల చేయనున్నారు.

HyperOS 3 గ్లోబల్ వెర్షన్‌కు OS3.0.3.0.WNAMIXM అనే బిల్డ్ నంబర్ కేటాయించబడింది. “Aurora” కోడ్‌నేమ్‌తో ఉన్న Xiaomi 14 Ultra ప్రస్తుతం కంపెనీ సర్వర్లలో “ready for stable rollout” గా కనిపిస్తోంది. కాగా, చైనా వెర్షన్ వినియోగదారులకు ఇప్పటికే OS3.0.4.0.WNACNXM బిల్డ్ విడుదలైన విషయం తెలిసిందే. గ్లోబల్ బిల్డ్ OS3.0.3.0.WNACNXM పేరుతో అందుబాటులోకి రానుంది.

Also Read: Bandi Sanjay: ప్రభుత్వ ఆసుపత్రిలో కోటి 50 లక్షల వైద్య పరికరాలు ప్రారంభం : కేంద్ర మంత్రి బండి సంజయ్

HyperOS 3లో వచ్చే కొత్త ఫీచర్లు

Android 16 ఆధారంగా రూపొందించిన HyperOS 3, యూజర్ ఇంటర్‌ఫేస్‌లో కొన్ని సున్నితమైన మార్పులు, కొత్త యానిమేషన్స్, సిస్టమ్ ఆప్టిమైజేషన్స్‌ను తెచ్చే అవకాశం ఉంది. ఫోన్‌లో వచ్చే స్టట్టరింగ్ తగ్గించి, బ్యాటరీ పనితీరును మెరుగుపర్చే విధంగా ఈ అప్డేట్ ఉండబోతోందని అంచనా. తాజా సెక్యూరిటీ ప్యాచెస్‌తో పాటు, ప్రైవసీ సెంట్రిక్ టూల్స్‌, AI ఆధారిత ఫీచర్లు కూడా ఈ అప్డేట్ లో కీలకంగా చేరే అవకాశముంది.

Also Read: Dharmendra Death: బాలీవుడ్ సినీ దిగ్గజం ధర్మేంద్ర మృతితో షోలే రోజులు గుర్తుచేసుకున్న అమితాబ్.. పోస్ట్ వైరల్..

అప్డేట్ ఇన్‌స్టాల్ చేయడానికి ముందు యూజర్లు చేయాల్సినవి

సెట్టింగ్స్ లోని System Update సెక్షన్‌లో HyperOS 3 అప్‌డేట్ అందుబాటులో ఉందేమో చెక్ చేయాలి.
అప్‌డేట్‌కు ముందు ముఖ్యమైన డేటా బ్యాకప్ తీసుకోవాలి.

Also Read: Dharmendra Death: బాలీవుడ్ సినీ దిగ్గజం ధర్మేంద్ర మృతితో షోలే రోజులు గుర్తుచేసుకున్న అమితాబ్.. పోస్ట్ వైరల్..
ఫోన్ బ్యాటరీ సరిపడా ఉండాలి లేదా చార్జింగ్‌కు కనెక్ట్ చేసి అప్డేట్ చేయాలి.
డౌన్‌లోడ్, ఇన్‌స్టాలేషన్ సమయంలో స్టేబుల్ Wi-Fi కనెక్షన్ ఉపయోగించాలి.

HyperOS 3‌తో Xiaomi 14 Ultra యూజర్లకు మెరుగైన పనితీరు, సాఫ్ట్ అనుభవం, కొత్త ఫీచర్లు లభించే అవకాశం ఉండటంతో ఈ అప్డేట్ పై ఇప్పటికే మంచి అంచనాలున్నాయి.

Just In

01

CM Revanth Reddy: యంగ్ ఇండియా స్కూల్స్.. రూ.30 వేల కోట్ల వ్య‌యం.. కేంద్ర ఆర్థిక మంత్రితో సీఎం కీలక భేటి

Rowdy Janardhan: విజయ్ దేవరకొండ ఫ్యాన్స్‌కు ట్రీట్ రెడీ.. టీజర్ ఎప్పుడంటే?

Hyderabad Crime: పహాడీషరీఫ్‌లో మైనర్‌పై అత్యాచారం.. బాలిక ఫిర్యాదుతో వెలుగులోకి!

India Mexico Trade: టారిఫ్ పెంపులకు కౌంటర్‌గా మెక్సికోతో పరిమిత వాణిజ్య ఒప్పందం దిశగా భారత్ అడుగులు

Hyderabad Crime: భర్తతో గొడవ.. ఏడేళ్ల కూతుర్ని హత్య చేసిన కన్నతల్లి