Gold Rates: తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలు బంగారానికి (Gold Rate ) అధిక ప్రాధాన్యతను ఇస్తారు. మన ఇళ్ళలో ఏ చిన్న శుభకార్యం జరిగినా గోల్డ్ తప్పకుండా కొనుగోలు చేస్తారు. ఏదైనా ఫంక్షన్ లో మహిళలు బంగారు ఆభరణాలు పెట్టుకుని మురిసిపోతుంటారు.
అయితే, గత కొద్దీ రోజుల నుంచి పసిడి ధరల్లో హెచ్చు తగ్గులు కనిపిస్తున్నాయి. ఇక, గోల్డ్ ధరలు తగ్గితే మాత్రం కొనుగోలు చేసేందుకు జనాలు ఎగబడుతుంటారు. కొత్త ఏడాది లోనైనా ధరలు తగ్గుతాయని అనుకున్నారు. కానీ, అందనంత ఎత్తుకి చేరుకున్నాయి.
ఈ నెలలో పెళ్లిళ్లు ఎక్కువ ఉండటంతో ధరలు ఇలా అమాంతం పెరుగుతున్నాయని నిపుణులు చెబుతున్నారు. సాధారణంగా పెళ్లిళ్ల సీజన్లో ఎంతో కొంతో బంగారం రేటు పెరగడం సహజం. మరి, ఇంతలా పెరగడం ఇదే మొదటి సారి. ప్రస్తుతం, రూ. 98,210 గా ఉంది. ఈ నెల చివర్లో బంగారం ధరలు తగ్గే ఛాన్స్ ఉందని నిపుణులు చెబుతున్నారు. అంతర్జాతీయంగా చోటు చేసుకుంటున్న పరిణామాల క్రమంలో బంగారం ధరలు తగ్గుతాయని అంటున్నారు.
ప్రస్తుతం, ఎక్కడా చూసిన బంగారం ధరలు ఆకాశాన్ని తాకాయి. ఈ ధరలు రోజు రోజుకి పెరుగుతున్నాయి తప్ప తగ్గడం లేదు. మన దేశంలో అయితే 10 గ్రాముల పసిడి ధర ఏకంగా రూ.లక్ష దాటింది. ఈ క్రమంలోనే పెరుగుతున్న బంగారం ధరలతో భయపడుతున్న వారికి గుడ్ న్యూస్ ఒకటి బయటకు వచ్చింది. రానున్న 12 నెలల్లో బంగారం ధర భారీగా పడిపోతుందని కజకిస్థాన్ గోల్డ్ మైనింగ్ సంస్థ చెబుతోంది.
12 నెలల్లో గోల్డ్ రేట్స్ (ఒక ఔన్స్) 2,500 డాలర్లకు చేరుకుంటుందని చెబుతున్నారు. నేసిస్ చెబుతున్నదాని ప్రకారం.. ఒక ఔన్స్ అంటే 28.3495 గ్రాముల గోల్డ్ ధర రూ.2,500 డాలర్ల వరకు తగ్గుతుంది. అంటే 10 గ్రాముల ధర రూ. 75,000 వరకు తగ్గుతుందని అంటున్నారు.