Gold Rate Today: గత శుక్రవారం (జులై 25, 2025) నుంచి తగ్గుముఖం పడుతూ వచ్చిన బంగారం ధరలు.. బుధవారం (జులై 30, 2025) మరోమారు పెరిగాయి. ఇండియా బులియన్ అసోసియేషన్ ప్రకారం మంగళవారం 22 క్యారెట్ల బంగారం ధర రూ. 98,040 ఉండగా.. ఇవాళ రూ.98,780కు చేరింది. గత వారం ప్రారంభంలో ఉన్న రూ.1,00,820 ఉన్న ధరతో పోలిస్తే.. పసిడి ధరలు పడిపోవడం గమనార్హం.
గత ఆరు నెలల్లో బంగారం ధర అత్యధికంగా జూలై 22న రూ. 1,00,820 చేరింది. గ్లోబల్ మార్కెట్లో ఏప్రిల్ 22న ఔన్స్‌కు 3,500 డాలర్ల రికార్డు స్థాయికి చేరింది. ఏప్రిల్ 7న దేశీయ మార్కెట్లో బంగారం ధర రూ. 87,100 వరకు పడిపోయింది. జూలై మొదటి వారంలో ట్రంప్ కొత్త సుంకాల ప్రకటన, సేఫ్ హేవన్ డిమాండ్ కారణంగా జూలై 7న 10 గ్రాముల గోల్డ్ రూ. 97,580కు చేరింది. జూలై 9న ధర రూ. 96,790కు పడిపోయింది.
జులై చివరి వారాల్లో పసిడి ధరల్లో హెచ్చుతగ్గులు చోటుచేసుకుంటున్నాయి. ట్రంప్ సుంకాల గడువు సమీపిస్తున్న కొద్ది అంతర్జాతీయంగా బంగారం ధరల్లో అస్థిరత చోటుచేసుకుంటోంది. గతవారం దేశంలో బంగారం ధర 0.21% మేర తగ్గి రూ. 97,819 మేరకు చేరింది. స్పాట్ మార్కెట్లో ఇది 3,438 డాలర్ల గరిష్ట స్థాయికి చేరుకొని ఆ తర్వాత 0.40% మేర తగ్గి చివరకూ 3,326 డాలర్లకు పడిపోయింది. అమెరికా-జపాన్ వాణిజ్య ఒప్పందం, మరిన్ని ఒప్పందాలపై ఆశావహత పెరగడంతో రిస్కీ ఇన్వెస్ట్మెంట్లకు డిమాండ్ పెరిగి విలువైన లోహాల ధరలు కొన్ని రోజులుగా కాస్త తగ్గుముఖం పట్టాయి. ఇదిలా ఉంటే ప్రపంచ బంగారం మండలి ప్రకారం (World Gold Council) ప్రకారం అమెరికాలో బంగారం ఔన్స్ కు 3,305.50 డాలర్ల వద్ద ప్రస్తుతం ట్రేడవుతోంది.
Also Read: Tsunami Alert: రష్యాలో సునామీ ఎఫెక్ట్.. అమెరికాలోని భారతీయులకు హెచ్చరికలు జారీ!
మరోవైపు దేశంలో సిల్వర్ ధరలు సైతం పెరిగాయి. నిన్నటితో పోలిస్తే కేజీ వెండిపై రూ.1000 మేర పెరిగింది. తద్వారా వెండి ధర కేజీకి రూ. 1,27,000 చేరింది. తెలుగు రాష్ట్రాల్లోని హైదరాబాద్, వరంగల్, విజయవాడ, వైజాగ్ వంటి ప్రధాన నగరాల్లో కిలో వెండిని రూ.1,27,000 కు విక్రయిస్తున్నారు.