Tsunami Hits Russia (Image Source: AI)
అంతర్జాతీయం, లేటెస్ట్ న్యూస్

Tsunami Hits Russia: భారీ భూకంపం.. తీరాన్ని తాకిన సునామీ.. పరిస్థితులు అల్లకల్లోలం!

Tsunami Hits Russia: రష్యాలోని తూర్పు కమ్చట్కా ద్వీపకల్పంలో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 8.7 తీవ్రతతో వచ్చిన ప్రకంపనల ధాటికి రష్యా తీరంలో సునామీ ఏర్పడింది. దీంతో పసిఫిక్ మహాసముద్రంలో సునామీ హెచ్చరికలు జారీ చేశారు. రాబోయే 2, 3 గంటల్లో రష్యా, జపాన్ తీరాల వెంబడి విధ్వంసక అలలు సంభవచ్చని యూఎస్ జియోలాజికల్ సర్వే (యూఎస్‌జీఎస్) హెచ్చరించింది. యూఎస్‌జీఎస్ ప్రకటన వెలువడిన నిమిషాల వ్యవధిలోని రాకాసి అలలు తీరాన్నితాకాయి.

5 మీటర్ల ఎత్తుతో అలలు
రష్యాలోని సెవెరో-కురిల్స్ ప్రాంతాన్ని సునామీ అలలు బలంగా ఢీకొట్టింది. అలల తాకిడికి ఈ ప్రాంతంలోని ఓ ఫ్యాక్టరీ బిల్డింగ్ కొట్టుకుపోయింది. చాలా వీధులు, భవనాలు తీవ్రంగా దెబ్బతిన్న దృశ్యాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. కొన్ని చోట్ల రహదారులపై భారీ పగుళ్లు ఏర్పడ్డాయి. మరికొన్ని చోట్ల సముద్రపు అలలు 5 మీటర్ల ఎత్తు మేర ఎగిసిపడుతున్నాయి. మెుత్తంగా రష్యాలో రాకసి అలలు సృష్టిస్తున్న విధ్వంసం తాలుకూ వీడియోలు నెట్టింట పెద్ద ఎత్తున చక్కర్లు కొడుతున్నాయి.

19 కి.మీ లోతులో భూకంప కేంద్రం
భూ ప్రకంపనల విషయానికి వస్తే భూకంప కేంద్రం 19.3 కిలోమీటర్ల (12 మైళ్లు) లోతులో కేంద్రీకృతమైనట్లు యూఎస్‌జీఎస్ తెలిపింది. కమ్చట్కా ద్వీపకల్పంలోని పెట్రోపావ్లోవ్స్క్‌కు 125 కి.మీ (80 మైళ్ళు) దూరంలో అవాచా బే తీరం వెంబడి భూకంప కేంద్రం ఉన్నట్లు స్పష్టం చేసింది. తొలుత ప్రకంపనల తీవ్రతను 8.0 గా యూఎస్‌జీఎస్ భావించింది. అయితే ఆ తర్వాత దానిని 8.7 గా నిర్ధారించింది. మరోవైపు అలస్కా అలూటియన్‌ దీవులలోని కొన్ని ప్రాంతాల్లో సునామీ ప్రభావం ఉంటుందని అలస్కా జాతీయ సునామీ కేంద్రం హెచ్చరించింది. కాలిఫోర్నియా, ఒరెగాన్‌, వాషింగ్టన్‌, హవాయితో సహా పలు ప్రాంతాలను అప్రమత్తం చేసింది. అటు జపాన్ వాతావరణ శాఖ సైతం సునామీ హెచ్చరికలను మరింత తీవ్రతరం చేసింది.

భయం గుప్పిట్లో ప్రజలు
అయితే భారీ భూకంపం, సునామీ ఘటనల నేపథ్యంలో ప్రాణ, ఆస్తి నష్టానికి సంబంధించి ఇప్పటివరకూ ఎలాంటి సమాచారం అధికారికంగా వెల్లడి కాలేదు. భూప్రకంపనల నేపథ్యంలో పెట్రోపావ్లోవ్స్క్‌-కామ్చాట్కా నగరంలోని భవనాలు కంపించాయని రష్యా మీడియా తెలిపింది. దీంతో భయభ్రాంతులకు గురైన ప్రజలు ఇళ్ల నుంచి పరుగులు తీసినట్లు తెలిపింది. కమ్చాట్కా ప్రాంతంలో విద్యుత్‌, సెల్‌ఫోన్‌ సేవల్లో అంతరాయాలు ఏర్పడినట్లు తెలిపింది. మరోవైపు అత్యవసర సేవల కోసం ఒక టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటుచేసినట్లు జపాన్‌ ప్రభుత్వం పేర్కొంది.

Also Read: Minister Ponnam Prabhakar: ఉప ఎన్నికపై మంత్రి సంచలన కామెంట్స్!

వరల్డ్‌లో రెండో అతిపెద్ద భూకంపం ఇదే!
ఈశాన్య జపాన్ లో 2011 మార్చిలో భారీ తీవ్రతతో భూకంపం సంభవించిన సంగతి తెలిసిందే. భూ ప్రకంపనల తీవ్రత రిక్టర్ స్కేలుపై 9.0 నమోదైంది. ఇప్పటివరకూ ప్రపంచంలో అత్యంత బలమైన భూకంపంగా ఇది ఉంది. దాని తర్వాత రష్యా దీవుల్లో తాజాగా సంభవించిన భూకంపం (8.7 తీవ్రత).. ప్రపంచంలోనే రెండో అత్యంత బలమైనదిగా అధికారులు చెబుతున్నారు. మరోవైపు 1952 తర్వాత కమ్చట్కా ద్వీపకల్పంలో సంభవించి అతి భారీ భూకంపం ఇదేనని రష్యన్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ యొక్క జియోఫిజికల్ సర్వే వెల్లడించింది. జులై ప్రారంభంలో కమ్చట్కా తీరంలో ఐదు భూకంపాలు వచ్చాయని అందులో అతిపెద్దది 7.4 తీవ్రతతో నమోదైందని పేర్కొంది.

Also Read This: Rajinikanth: ఆ హీరోయిన్ హగ్ ఇవ్వలేదని సెట్ నుంచి వెళ్ళిపోయిన రజినీకాంత్?

Just In

01

Coolie: ‘కూలీ’ మూవీ ‘చికిటు’ ఫుల్ వీడియో సాంగ్.. యూట్యూబ్‌లో రచ్చ రచ్చ!

JD Chakravarthy: ‘జాతస్య మరణం ధ్రువం’ టైటిల్ క్రెడిట్ నాదే..

Malkaajgiri Excise: డిఫెన్స్ మద్యం స్వాధీనం.. వ్యక్తి అరెస్ట్

Chiranjeevi Team: ‘స్పిరిట్’, ‘ది ప్యారడైజ్‌’ చిత్రాలలో చిరు.. క్లారిటీ ఇచ్చిన టీమ్!

GHMC: ఎంటమాలజీలో ఇష్టారాజ్యంగా జీతాల చెల్లింపులు.. చార్మినార్ జోన్ లో వెలుగు చూసిన అక్రమం