Gold Rates (23-07-2025): గోల్డ్ రేట్స్ మళ్లీ పెరిగాయ్..
Gold Rates (23-07-2025) ( Image Source: Twitter)
బిజినెస్

Gold Rates (23-07-2025): గోల్డ్ రేట్స్ మళ్లీ పెరిగాయ్.. వరుసగా రెండో రోజు బాదుడు..

Gold Rates (23-07-2025): తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో బంగారం అనేది కేవలం ఆభరణం మాత్రమే కాదు, సంస్కృతి సంప్రదాయంలో ఒక భాగం కూడా.. శుభకార్యాలు, పెళ్లిళ్లు, పండుగల సమయంలో మహిళలు బంగారు ఆభరణాలను ధరించడానికి ఎంతో ఆసక్తి చూపుతారు. అయితే, ఇటీవలి ఆర్థిక పరిస్థితుల కారణంగా బంగారం ధరలు తగ్గుతూ పెరుగుతూ ఉన్నాయి.

ధరలు పెరిగితే కొనుగోలుదారులు వెనక్కి తగ్గుతారు, కానీ ధరలు తగ్గినప్పుడు బంగారం కొనేందుకు జనం షాపుల వైపు పరుగులు పెడుతున్నారు.పెళ్లిళ్ల సీజన్ కారణంగా బంగారం ధరలు గణనీయంగా పెరిగాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. సాధారణంగా, వివాహ సీజన్‌లో బంగారం ధరలు కొంతమేర పెరగడం సర్వసాధారణం, కానీ ఈ సారి ధరలు అసాధారణంగా ఎక్కువగా పెరిగాయి. అయినప్పటికీ, జులై 23, 2025 నాటికి బంగారం ధరలు భారీగా పెరిగాయి. దీంతో మహిళలు  ఆభరణాల దుకాణాలకు వెళ్లాలన్న కూడా షాక్ అవుతున్నారు. అంతర్జాతీయ మార్కెట్ పరిస్థితుల కారణంగా, పెళ్లిళ్ల  సీజన్ ముగిసిన తర్వాత ధరలు మరింత తగ్గే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

Also Read: Doctors Prescription: డాక్టర్లు రాసే ప్రిస్క్రిప్షన్ ఎందుకు అర్థం కాదు? దాని వెనుక ఉన్న రహస్యం ఇదే!

24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.1050 కి పెరిగి రూ.1,02,290 కి ఉండగా, 22 క్యారెట్ల బంగారం ధర రూ.950 కి పెరిగి పెరిగి రూ.93,800 కి చేరింది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణం, వరంగల్‌లో బంగారం ధరలు ఈ క్రింది విధంగా ఉన్నాయి.

24 క్యారెట్ల బంగారం (10 గ్రాములు)

విశాఖపట్టణం: రూ.1,02,290
వరంగల్: రూ.1,02,290
హైదరాబాద్: రూ.1,02,290
విజయవాడ: రూ.1,02,290

Also Read: Pawan Kalyan: దేవుడి దయ ఉంటే ఆ సినిమా చేస్తానంటూ సంచలన కామెంట్స్ చేసిన పవన్ కళ్యాణ్

22 క్యారెట్ల బంగారం (10 గ్రాములు)

విశాఖపట్టణం: రూ.93,800
వరంగల్: రూ.93,800
హైదరాబాద్: రూ.93,800
విజయవాడ: రూ.93,800

Also Read: Shilpa Shirodkar: తను టెన్త్ ఫెయిల్.. భర్త డబుల్ ఎంబీఏ.. నమ్రత చెల్లి గురించి ఈ విషయాలు తెలుసా?

వెండి ధరలు

వెండి ధరలు కూడా ఇటీవల గణనీయంగా పెరిగాయి. నాలుగు రోజుల క్రితం కిలో వెండి ధర రూ.1,24,000 గా ఉండగా, రూ.5,000 పెరిగి ప్రస్తుతం రూ.1,29,000 కి చేరింది. అయితే, ఈ ధరలు కూడా రోజువారీ హెచ్చుతగ్గులకు లోనవుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో వెండి ధరలు ఈ విధంగా ఉన్నాయి..

విశాఖపట్టణం: రూ.1,29,000
వరంగల్: రూ.1,29,000
హైదరాబాద్: రూ.1,29,000
విజయవాడ: రూ.1,29,000

Just In

01

BiggBoss9 Prize Money: బిగ్ బాస్ సీజన్ 9 విన్నర్‌కు వచ్చే ప్రైజ్ మనీ ఎంతో తెలుసా.. సర్‌ప్రైజ్ గెస్ట్ ఎవరంటే?

Kerala News: కేరళ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ హవా.. పంచాయతీ ఎన్నికల్లో యూటీఎఫ్ సత్తా

Brown University: అమెరికాలో కాల్పులు.. ఇద్దరు మృతి, ఎనిమిది మంది పరిస్థితి విషమం

Etela Rajender: నేను ఏ పార్టీలో ఉన్నానో వారే చెప్పాలి: ఈటల రాజేందర్

Overdraft vs Personal Loan: ఓవర్‌డ్రాఫ్ట్ vs పర్సనల్ లోన్.. మీ డబ్బు అవసరంలో ఏది సరైన ఎంపిక?