Gold Rate Today ( Image Source: Twitter)
బిజినెస్

Gold Rate Today : షాకిస్తున్న గోల్డ్.. నేడు రికార్డు స్థాయిలో పెరిగిన బంగారం ధరలు?

Gold Rate Today : తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలు బంగారానికి (Gold Rate ) అధిక ప్రాధాన్యతను ఇస్తారు. మన ఇళ్ళలో ఏ చిన్న శుభకార్యం జరిగినా గోల్డ్ తప్పకుండా కొనుగోలు చేస్తారు. ఏదైనా ఫంక్షన్ లో మహిళలు బంగారు ఆభరణాలు పెట్టుకుని మురిసిపోతుంటారు.

అయితే, గత కొద్దీ రోజుల నుంచి పసిడి ధరల్లో హెచ్చు తగ్గులు కనిపిస్తున్నాయి. ఇక, గోల్డ్ ధరలు తగ్గితే మాత్రం కొనుగోలు చేసేందుకు జనాలు ఎగబడుతుంటారు. కొత్త ఏడాది లోనైనా ధరలు తగ్గుతాయని అనుకున్నారు. కానీ, అందనంత ఎత్తుకి చేరుకున్నాయి.

నెలలో పెళ్లిళ్లు ఎక్కువ ఉండటంతో ధరలు ఇలా అమాంతం పెరుగుతున్నాయని నిపుణులు చెబుతున్నారు. సాధారణంగా పెళ్లిళ్ల సీజన్లో ఎంతో కొంతో బంగారం రేటు పెరగడం సహజం. మరి, ఇంతలా పెరగడం ఇదే మొదటి సారి. ప్రస్తుతం, రూ. 96,180 గా ఉంది. త్వరలో లక్ష వరకు వెళ్లినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదని నిపుణులు పేర్కొన్నారు.ఈ నెల చివర్లో బంగారం ధరలు తగ్గే ఛాన్స్ ఉందని నిపుణులు చెబుతున్నారు. అంతర్జాతీయంగా చోటు చేసుకుంటున్న పరిణామాల క్రమంలో బంగారం ధరలు తగ్గుతాయని అంటున్నారు.

Also Read: Investments in TG: తెలంగాణలో రూ.29 వేల కోట్ల పెట్టుబడులు.. న్యూ ఎనర్జీ పాలసీ ఆర్థికాభివృద్ధికి దారి.. భట్టి

అయితే, గత రెండు రోజుల నుంచి తగ్గిన గోల్డ్ ధరలు ( Gold Rates ) ఈ రోజు పెరగడంతో కొనుగోలు దారులు షాక్ అయి గోల్డ్ కొనకుండా వెనుదిరుగుతున్నారు. 22 క్యారెట్స్ బంగారం ధర పై రూ.1050 కు పెరిగి రూ. 89,200 గా ఉంది. ఇక 24 క్యారెట్ల బంగారంపై రూ.1140 కు పెరిగి రూ. 97,310 గా విక్రయిస్తున్నారు. కిలో వెండి ధర రూ.1,10,00 గా ఉంది. తెలుగు రాష్ట్రాల్లో ప్రధాన నగరాలైన హైదరాబాద్ ( Hyderabad ) , విజయవాడలో గోల్డ్ రేట్లు ఎలా ఉన్నాయో ఇక్కడ చూద్దాం..

22 క్యారెట్ల బంగారం ధర

హైదరాబాద్ ( Hyderabad ) – రూ. 87,550

విజయవాడ ( Vijayawada) – రూ. 87,550

విశాఖపట్టణం ( visakhapatnam ) – రూ. 87,550

వరంగల్ ( warangal ) – రూ. 87,550

Also Read: Cricket Stadium Amaravati: దేశంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియం.. ఇక్కడే అన్నీ మ్యాచ్ లు.. మీరు సిద్ధమా!

24 క్యారెట్లు బంగారం ధర

హైదరాబాద్ ( Hyderabad )  – రూ. 95,510

విజయవాడ – రూ. 95,510

విశాఖపట్టణం ( visakhapatnam ) – రూ. 95,510

Also Read: Gold Rates: రానున్నది పెళ్లిళ్ల సీజన్ .. బంగారం ఇప్పుడు కొనకుండా మరెప్పుడు?

వెండి ధరలు

గత కొద్దీ రోజుల నుంచి బంగారంతో పాటు వెండి ధరలు కూడా భారీగా పెరుగుతున్నాయి. నాలుగు రోజుల క్రితం కిలో వెండి ధర మార్కెట్లో రూ.1,06,000 వద్ద ఉండగా.. మరో రూ.4000 కు పెరిగింది. ప్రస్తుతం, కిలో వెండి రూ.1,10,000 గా ఉంది. ఒక్కో రోజు ఈ ధరలు తగ్గుతున్నాయి, మళ్లీ అకస్మాత్తుగా ధరలు వేగంగా పెరుగుతున్నాయి.

హైదరాబాద్ – రూ. 1,10,000

విజయవాడ – రూ. 1,10,000

విశాఖపట్టణం – రూ. 1,10,000

వరంగల్ – రూ. 1,10,000

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

BRS Party: గులాబీ పార్టీకి డ్యామేజ్.. కంట్రోల్ చేసేందుకు ప్రయత్నం?.. సాధ్యపడేనా..?

Ganesh Nimajjanam 2025: అయ్యో గణపయ్య ఎంత ఘోరం.. నిమజ్జనం చేస్తుండగా.. కింద పడ్డ విగ్రహాలు

Bhatti Vikramarka: విద్యారంగం పై ఊహించని రీతిలో సర్కారు పెట్టుబడులు

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ గురించి బ్లాక్ బస్టర్ న్యూస్ చెప్పిన దేవీ శ్రీ ప్రసాద్..

Telangana Politics: కాంగ్రెస్‌లో ఉత్కంఠం.. ఏఐసీసీలో కవిత ఎపిసోడ్..?