Gold Price Today: గత రెండు రోజుల నుంచి తెలుగు రాష్ట్రాల్లో గోల్డ్ రేట్స్ తగ్గుతూ పెరుగుతున్నాయి. ఒక రోజు తగ్గితే.. ఇంకో రోజు పెరుగుతున్నాయి. గోల్డ్ రేట్స్ పెరిగినప్పుడు గోల్డ్ షాప్ కు వెళ్లాలన్న కూడా ఆలోచిస్తారు. అయితే, ఈ రోజు ధరలు పెరిగాయి. పెళ్లిళ్లు, పండుగలు, శుభకార్యాల్లో బంగారం ధరించడం మహిళలకు ఒక ప్రత్యేకమైన గౌరవం, సంతోషం కూడా. కానీ, ఇటీవలి ఆర్థిక ఒడిదొడుకులతో బంగారం ధరలు ఆకాశాన్ని అంటడం మొదలై, కొనుగోలుదారులను కంగారు పెడుతోంది. ధరలు దిగితే జనం షాపులకు ఉరకలేస్తారు, పెరిగితే మాత్రం ” ఇప్పుడు మేము కొనలేము బాబోయ్.. ” అంటూ వెనక్కి తగ్గుతారు.
గత కొన్ని రోజులుగా బంగారం ధరలు కాస్త తగ్గినట్లు కనిపించినా, మళ్లీ ఒక్కసారిగా ఊపందుకున్నాయి. నిపుణులు చెబుతున్న దాని ప్రకారం, అంతర్జాతీయ మార్కెట్‌లో డాలర్ విలువలో హెచ్చుతగ్గులు, సరఫరా- డిమాండ్ అసమతుల్యతలు ఈ ధరల ఒడుదొడుకులకు కారణమని అంటున్నారు. నవంబర్ 25, 2025 నాటికి తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు భారీగా పెరిగాయి. అయినప్పటికీ, నిపుణుల అంచనాల ప్రకారం రాబోయే రోజుల్లో ఈ ధరలు మరింత మార్పులకు లోనవ్చని, కొనుగోలుదారులకు ఇది ఒక్కసారి సంతోషాన్ని, మరోసారి ఆందోళనను తెప్పిస్తుంది.
ఈ రోజు బంగారం ధరలు ( నవంబర్ 25, 2025)
నవంబర్ 24 తో పోలిస్తే, ఈ రోజు గోల్డ్ రేట్స్ భారీగా పెరిగాయి. గత రెండు రోజుల నుంచి తగ్గిన గోల్డ్ రేట్స్ చూసి మహిళలు బంగారం షాపుకు వెళ్తున్నారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో 22 క్యారెట్, 24 క్యారెట్ బంగారం ధరలు ఇలా ఉన్నాయి..
హైదరాబాద్
24 క్యారెట్ (10 గ్రాములు): రూ.1,27,040
22 క్యారెట్ (10 గ్రాములు): రూ.1,16,450
వెండి (1 కిలో): రూ.1,74,000
Also Read: Alleti Maheshwar Reddy: రూ.6.29 లక్షల కోట్ల కుంభకోణం.. ప్రభుత్వంపై బీజేఎల్పీ నేత ఏలేటి సంచలన ఆరోపణలు
విశాఖపట్నం
24 క్యారెట్ (10 గ్రాములు): రూ.1,27,040
22 క్యారెట్ (10 గ్రాములు): రూ.1,16,450
వెండి (1 కిలో): రూ.1,74,000
విజయవాడ
24 క్యారెట్ (10 గ్రాములు): రూ.1,27,040
22 క్యారెట్ (10 గ్రాములు): రూ.1,16,450
వెండి (1 కిలో): రూ.1,74,000
వరంగల్
24 క్యారెట్ (10 గ్రాములు): రూ.1,27,040
22 క్యారెట్ (10 గ్రాములు): రూ.1,16,450
వెండి (1 కిలో): రూ.1,74,000
Also Read : Ayodhya: 100 టన్నుల పూలతో ముస్తాబైన అయోధ్య.. మంగళవారం రామ మందిరంలో జెండా ఆవిష్కరించనున్న ప్రధాని మోదీ
వెండి ధరలు
వెండి ధరలు కూడా ఇటీవల గణనీయంగా పెరిగాయి. రెండు రోజుల క్రితం కిలో వెండి ధర రూ.1,75,000 గా ఉండగా, రూ.1000 తగ్గి , ప్రస్తుతం రూ.1,74,000 కి చేరింది. అయితే, ఈ ధరలు కూడా రోజువారీ హెచ్చుతగ్గులకు లోనవుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో వెండి ధరలు ఈ విధంగా ఉన్నాయి.
విశాఖపట్టణం: రూ.1,74,000
వరంగల్: రూ.1,74,000
హైదరాబాద్: రూ.1,74,000
విజయవాడ: రూ.1,74,000

