Nov 04 ( Image Source: Twitter)
బిజినెస్

Gold Price Today: గోల్డ్ కొనాలనుకునేవారికీ ఇదే మంచి ఛాన్స్.. భారీగా తగ్గిన రేట్స్?

Gold Price Today: తెలుగు రాష్ట్రాల్లో గోల్డ్ రేట్స్ గత రెండు రోజులుగా పెరగడంతో బంగారం దుకాణాల వద్దకు వెళ్లాలా? లేదా అని అయోమయంలో పడ్డారు. అయితే, ఈ రోజు ధరలు తగ్గాయి. బంగారం అంటే కేవలం ఆభరణం మాత్రమే కాదు, అది మన సంస్కృతి, సంప్రదాయాల్లో ఓ ముఖ్యమైన భాగం.

పెళ్లిళ్లు, పండుగలు, శుభకార్యాల్లో బంగారం ధరించడం మహిళలకు ఒక ప్రత్యేకమైన గౌరవం, సంతోషం. కానీ, ఇటీవలి ఆర్థిక ఒడిదొడుకులతో బంగారం ధరలు ఆకాశాన్ని అంటడం మొదలై, కొనుగోలుదారులను కంగారు పెడుతోంది. ధరలు దిగితే జనం షాపులకు ఉరకలేస్తారు, పెరిగితే మాత్రం ” అబ్బా, ఇప్పుడేం కొంటాము.. వద్దు!” అంటూ వెనక్కి తగ్గుతారు.

గత కొన్ని రోజులుగా బంగారం ధరలు కాస్త తగ్గినట్లు కనిపించినా, మళ్లీ ఒక్కసారిగా ఊపందుకున్నాయి. నిపుణులు చెబుతున్న దాని ప్రకారం, అంతర్జాతీయ మార్కెట్‌లో డాలర్ విలువలో హెచ్చుతగ్గులు, సరఫరా- డిమాండ్ అసమతుల్యతలు ఈ ధరల ఒడుదొడుకులకు కారణమని అంటున్నారు. నవంబర్ 03, 2025 నాటికి తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు భారీగా తగ్గాయి. అయినప్పటికీ, నిపుణుల అంచనాల ప్రకారం రాబోయే రోజుల్లో ఈ ధరలు మరింత మార్పులకు లోనవ్చని, కొనుగోలుదారులకు ఇది ఒక్కసారి సంతోషాన్ని, మరోసారి ఆందోళనను తెప్పిస్తుంది.

ఈ రోజు బంగారం ధరలు ( నవంబర్ 04, 2025)

నవంబర్ 03 తో పోలిస్తే, ఈ రోజు గోల్డ్ రేట్స్ మళ్ళీ తగ్గాయి. గత రెండు రోజుల నుంచి తగ్గిన గోల్డ్ రేట్స్ చూసి మహిళలు బంగారం షాపుకు వెళ్తున్నారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో 22 క్యారెట్, 24 క్యారెట్ బంగారం ధరలు ఇలా ఉన్నాయి..

హైదరాబాద్

22 క్యారెట్ (10 గ్రాములు): రూ.1,12,250
24 క్యారెట్ (10 గ్రాములు): రూ.1,22,460
వెండి (1 కిలో): రూ.1,65,000

Also Read: Ponguleti Srinivasa Reddy: జూబ్లీహిల్స్ ఎన్నిక‌ల్లో కాళేశ్వ‌రం అవినీతి సొమ్ముతోనే విచ్చలవిడి ప్రచారం.. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి

విశాఖపట్నం

22 క్యారెట్ (10 గ్రాములు): రూ.1,12,250
24 క్యారెట్ (10 గ్రాములు): రూ.1,22,460
వెండి (1 కిలో): రూ.1,65,000

Also Read: Medchal Municipality: మున్సిపాలిటీల్లో పన్నులు ఉన్నా అభివృద్ధి మాత్రం సున్నా.. పట్టించుకోని అధికారులు

విజయవాడ

22 క్యారెట్ (10 గ్రాములు): రూ.1,12,250
24 క్యారెట్ (10 గ్రాములు): రూ.1,22,460
వెండి (1 కిలో): రూ.1,65,000

వరంగల్

22 క్యారెట్ (10 గ్రాములు): రూ.1,12,250
24 క్యారెట్ (10 గ్రాములు): రూ.1,22,460
వెండి (1 కిలో): రూ.1,65,000

Also Read: Crime News: బిగ్ బ్రేకింగ్ న్యూస్.. బస్సు ప్రమాదం మరువకముందే మరో బీభత్సం.. ఇంట్లోకి దూసుకుపోయిన..!

వెండి ధరలు

వెండి ధరలు కూడా ఇటీవల గణనీయంగా పెరిగాయి. నాలుగు రోజుల క్రితం కిలో వెండి ధర రూ.1,68,000 గా ఉండగా, రూ.3000 తగ్గి ప్రస్తుతం రూ.1,65,000 కి చేరింది. అయితే, ఈ ధరలు కూడా రోజువారీ హెచ్చుతగ్గులకు లోనవుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో వెండి ధరలు ఈ విధంగా ఉన్నాయి.

విశాఖపట్టణం: రూ.1,65,000
వరంగల్: రూ.1,65,000
హైదరాబాద్: రూ.1,65,000
విజయవాడ: రూ.1,65,000

Just In

01

CM Revanth Reddy: జర్మనీ టీచర్లను నియమిస్తాం.. విద్యార్థులకు భాష నేర్పిస్తాం.. సీఎం రేవంత్ రెడ్డి

Viral Video: ఒరేయ్ ఇలా ఉన్నారేంట్రా.. రైల్వే ప్లాట్ ఫామ్‌పైనే కాపురాలు పెట్టేశారు.. మీకో దండంరా అయ్యా!

Free ChatGPT: ఉచితంగా చాట్‌జీపీటీ సబ్‌స్క్రిప్షన్.. ఆశ్చర్యపరిచే నిర్ణయం వెనుక అసలు కారణం ఇదే!

Kishan Reddy: ఖైరతాబాద్‌లో ఉప ఎన్నిక రావాలని కోరుకుంటున్నా: కిషన్ రెడ్డి

The RajaSaab: ‘రాజాసాబ్’పై వస్తున్న వదంతులకు చెక్ పెట్టిన నిర్మాణ సంస్థ.. అది మాత్రం పక్కా..