Gold Rates (03-07-2025): ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో మహిళలు బంగారానికి అధిక ప్రాధాన్యత ఇస్తారు. అయితే, దేశంలో ఆర్థిక సమస్యల పెరుగుదలతో కొన్ని రోజుల నుంచి బంగారం ధరలు తగ్గుతూ, పెరుగుతూ ఉన్నాయి. ధరలు పెరిగితే కొనుగోలు చేయడానికి ఎవరూ ముందుకు రారు. కానీ ధరలు తగ్గితే మాత్రం బంగారం కొనేందుకు జనం ఆసక్తి చూపుతారు. ఎందుకంటే, ఏ చిన్న శుభకార్యం జరిగినా బంగారం కొనుగోలు తప్పనిసరి. శుభకార్యాల్లో మహిళలు బంగారు ఆభరణాలు ధరించి సంతోష పడతారు.
పెళ్లిళ్ల సీజన్ కారణంగా బంగారం ధరలు పెరుగుతున్నాయని నిపుణులు చెబుతున్నారు. సాధారణంగా పెళ్లి సీజన్‌లో బంగారం ధరలు కొంతమేర పెరగడం సర్వసాధారణం, కానీ ఇంత భారీగా పెరగడం ఇదే మొదటిసారి. ప్రస్తుతం 24 క్యారెట్ల బంగారం ధర రూ.98,890 గా ఉంది. పెళ్లి సీజన్ ముగిసిన తర్వాత బంగారం ధరలు తగ్గే అవకాశం ఉందని, అంతర్జాతీయ మార్కెట్ పరిణామాల కారణంగా ధరలు తగ్గవచ్చునని నిపుణులు అంచనా వేస్తున్నారు.
Also Read: Swetcha Effect: నకిలీలపై ఫోకస్ జిల్లాలకు స్పెషల్ టీమ్స్.. ఆత్మలకు చేయూత పేరుతో స్వేచ్ఛ కథనాలు!
గత రెండు రోజులుగా బంగారం ధరలు తగ్గుతూ, పెరుగుతూ ఉన్నప్పటికీ, నేడు భారీగా పెరగడంతో మహిళలు గోల్డ్ కొనాలన్న కూడా ఆలోచిస్తున్నారు. 24 క్యారెట్ల బంగారం ధర రూ.440 కి పెరిగి రూ.99,330 గా, 22 క్యారెట్ల బంగారం ధర రూ.400 కి పెరిగి రూ.91,050 గా ఉంది. కిలో వెండి ధర రూ.1,21,000 గా ఉంది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణం, వరంగల్‌లో బంగారం, వెండి ధరలు ఈ క్రింది విధంగా ఉన్నాయి.
22 క్యారెట్ల బంగారం ధర
హైదరాబాద్ ( Hyderabad ) – రూ.99,330
విజయవాడ ( Vijayawada) – రూ.99,330
విశాఖపట్టణం ( visakhapatnam ) – రూ.99,330
వరంగల్ ( warangal ) – రూ.99,330
Also Read: China Robo Football League: మైదానంలో తలపడ్డ రోబోలు.. బంతితో విరోచిత పోరాటం.. విజేత ఎవరంటే?
24 క్యారెట్లు బంగారం ధర
విశాఖపట్టణం ( visakhapatnam ) – రూ.91,050
వరంగల్ ( warangal ) – రూ.91,050
హైదరాబాద్ ( Hyderabad ) – రూ.91,050
విజయవాడ – రూ.91,050
Also Read: Love Affair: ఒకేసారి ఆరుగురితో లవ్ ఎఫైర్.. యువతికి లైఫ్ లో గుర్తిండిపోయే ఝలక్ ఇచ్చిన అబ్బాయిలు!
వెండి ధరలు
గత కొన్ని రోజులుగా వెండి ధరలు కూడా గణనీయంగా పెరిగాయి. నాలుగు రోజుల క్రితం కిలో వెండి ధర మార్కెట్లో రూ.1,06,000 వద్ద ఉండగా.. మరో రూ.15,000 కు పెరిగింది. ప్రస్తుతం, కిలో వెండి రూ.1,21,000 గా ఉంది. ఒక్కో రోజు ఈ ధరలు తగ్గుతున్నాయి, మళ్లీ అకస్మాత్తుగా ధరలు వేగంగా పెరుగుతున్నాయి.
విజయవాడ – రూ.1,21,000
విశాఖపట్టణం – రూ.1,21,000
హైదరాబాద్ – రూ.1,21,000
వరంగల్ – రూ.1,21,000
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు.