Love Affair: ఈ రోజుల్లో ప్రేమ పేరు చెప్పుకుని యూత్ చేయకూడని పనులు కూడా చేస్తున్నారు. ఇప్పుడు దీనికి అర్థమే పూర్తిగా మారిపోయింది. ప్రేమ పేరుతో అబ్బాయిలు, అమ్మాయిలను వాడుకోవడం, అబ్బాయిలకు మాయ మాటలు చెప్పి డబ్బు వసూలు చేయడం లాంటివి అమ్మాయిలకు కామన్ అయిపోయింది. ఇక ఆన్‌లైన్ ప్రేమలైతే మరి, హద్దులు దాటి చాటింగ్,మీటింగ్, డేటింగ్ చేస్తూ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు.
బంగ్లాదేశ్‌కు చెందిన ఓ యువతి ఒకేసారి ఆరుగురు బాయ్‌ఫ్రెండ్స్‌ను మెయింటెన్ చేసింది. చూస్తే మహానటికి మించి ఒకరికి తెలియకుండా ఇంకోకరితో ఎఫైర్ నడిపింది అది కూడా ఆన్లైన్ లో. మళ్లీ ఓకే ఐడి తో అందరితో మాట్లాడింది. కాగా, ఈ విషయం ఈ ఆరుగురిలో ఒకరికి తెలిసింది. తనతో పాటు మరో ఐదుగురిని కూడా వాడుకుంటోందని వాళ్ళు గుర్తించారు. దీంతో మిగతా వాళ్ల వివరాలను కూడా తెలుసుకుని తన ప్రేమతో పాటు వారి లవ్ స్టోరీలను వివరించాడు. దీంతో, అందరూ కలిసి ఆమెకు బిగ్ షాక్ ఇవ్వాలని అనుకున్నారు.
ఒకరోజు ఆ యువతిని ఓ హోటల్ కి రమ్మని ఇన్వైట్ చేయగా.. ఆమె అక్కడకు వెళ్తుంది. ఆమెకు సర్‌ప్రైజ్ ఇస్తానని కళ్లు మూశాడు వారిలో ఓ ప్రియుడు. ఈ లోపు మిగిలిన ఐదుగురు కూడా ఒక్కసారిగా రూమ్‌లోకి ఎంటర్ బిగ్ షాక్ ఇచ్చారు. ఆ అమ్మాయికి మాటలు కూడా రాలేదు. వారికి ముఖం ఎలా చూపించాలో తెలియక తల దించుకుంది. సోషల్ మీడియాలో దీనికి సంబందించిన ఓ వార్త బాగా వైరల్ అవుతుంది.