IPO
బిజినెస్, లేటెస్ట్ న్యూస్

Business News: ఐపీవోకి వచ్చిన ఆకర్షణీయ కంపెనీ.. ప్రైస్ బ్యాండ్ ఎంతంటే?

Business News: ఆకర్షణీయమైన కంపెనీల ఐపీవోల (Initial Public Offering) కోసం ఎదురుచూసే స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు కీలకమైన అప్‌డేట్ (Business News: ) వచ్చింది. గృహవినియోగ ప్లాస్టిక్ వస్తువులను తయారు చేసే ‘ఆల్ టైమ్ ప్లాస్టిక్స్’ (All Time Plastics) స్టాక్ మార్కెట్‌లో అడుగుపెట్టబోతోంది. ఇందుకు సంబంధించిన ఐపీవో వివరాలను సోమవారం ప్రకటించింది. ఒక్కో షేర్ ధర కనిష్ఠంగా రూ.260 నుంచి గరిష్ఠంగా రూ.275 మధ్య నిర్ణయించినట్టు తెలిపింది. ఐపీవో బిడ్డింగ్ ప్రక్రియ ఆగస్టు 7న ప్రారంభమై, ఆగస్టు 11న ముగుస్తుందని కంపెనీ తెలిపింది. అత్యధిక ధర రూ.275ను బట్టి చూస్తే కంపెనీ విలువ రూ.1,800 కోట్లకు పైగా ఉండొచ్చని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

ఈ ఐపీవోలో రూ.280 కోట్ల విలువైన కొత్త ఈక్విటీ షేర్లను విడుదల చేయనున్నట్టు కంపెనీ తెలిపింది. ఇక, కంపెనీ ప్రమోటర్లు రూ.120.6 కోట్ల విలువైన 43.8 లక్షల షేర్లను విక్రయించనున్నారు. మొత్తం రూ.401 కోట్ల విలువైన షేర్లను కంపెనీ ఇష్యూ చేస్తోంది. ఐపీవో ద్వారా సేకరించనున్న నిధులను గుజరాత్‌లోని మణెక్‌పూర్ ప్లాంట్ కోసం యంత్రాలు కొనుగోలు, రుణ చెల్లింపులకు, కార్పొరేట్ అవసరాలు, ఇతర విస్తరణకు ఉపయోగించాలని ‘ఆల్ టైమ్ ప్లాస్టిక్స్’ లక్ష్యంగా నిర్దేశించుకుంది. ఈ ఇష్యూలో 50 శాతం అర్హత గల సంస్థాగత ఇన్వెస్టర్లకు (QIBs), 35 శాతం రిటైల్ ఇన్వెస్టర్లకు, మిగతా 15 శాతం సంస్థేతర ఇన్వెస్టర్ల (Non-Institutional Investors) కోసం కేటాయించినట్టు కంపెనీ తెలిపింది.

Read also- India Win: మాంచెస్టర్ టెస్టులో టీమిండియా థ్రిల్లింగ్ విక్టరీ.. సిరీస్ సమం

కాగా, ‘ఆల్ టైమ్ ప్లాస్టిక్స్’ కంపెనీ గడచిన 14 ఏళ్లుగా గృహోపయోగ ప్లాస్టిక్ ఉత్పత్తులను తయారు చేస్తోంది. ఈ కంపెనీ ప్రధానంగా యూరోపియన్ యూనియన్, యూకే, అమెరికా దేశాల్లో ఉన్న రిటైలర్లకు ఉత్పత్తులు ఎగుమతి చేస్తోంది. భారత్‌లో ఇది మోడ్రన్ ట్రేడ్ రిటైలర్లు, సూపర్ డిస్ట్రిబ్యూటర్లు (డిస్ట్రిబ్యూటర్లకు సరఫరా చేసేవారు), సాధారణ ట్రేడ్ స్టోర్లకు సప్లయ్ చేసే డిస్ట్రిబ్యూటర్ల ద్వారా అమ్మకాలు చేపడుతోంది. ఈ పబ్లిక్ ఇష్యూకు ఇంటెన్సివ్ ఫిస్కల్ సర్వీసెస్, డీఏఎం క్యాపిటల్ అడ్వైజర్స్ మెర్చంట్ బ్యాంకర్లుగా వ్యవహరిస్తున్నాయి. కాగా, ‘ఆల్ టైమ్ ప్లాస్టిక్స్’ కంపెనీ ఆగస్టు 14న స్టాక్ ఎక్స్చేంజీలలో లిస్టింగ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.

Read Also- Khammam: ఈ వాహనం నేర పరిశోధనలో చాలా ముఖ్యం: కమిషనర్ సునీల్ దత్

ఐపీవో అంటే?
ఐపీవో అంటే ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్ (Initial Public Offering). అంటే, ఒక ప్రైవేటు కంపెనీ తొలిసారి పబ్లిక్‌గా షేర్లను విక్రయించే పక్రియ. తద్వారా స్టాక్ మార్కెట్‌లోకి అడుగుపెడుతుంది. ఇంకా అర్థమయ్యేలా చెప్పాలంటే, స్టాక్ మార్కెట్‌ ద్వారా ప్రజల నుంచి పెట్టుబడి (investment) పొందడానికి ప్రైవేటు కంపెనీ సిద్ధంగా ఉందని అర్థం. ఒక కంపెనీ అభివృద్ధి, విస్తరణ, రుణ చెల్లింపుల కోసం ఐపీవో మార్గం నిధులు సేకరిస్తుంటారు. ఈ ప్రక్రియ జరిగినప్పుడు దానిని ఐపీవో అంటారు.

Read Also- Viral Vayyari song: సోషల్ మీడియాలో ఓ ఊపు ఊపేసిన ‘వైరల్‌ వయ్యారి’ ఫుల్‌ వీడియో సాంగ్ వచ్చేసింది..

Just In

01

Kurnool Bus Accident: కర్నూలు బస్సు ప్రమాద ఘటనలో ట్విస్ట్.. చనిపోయిన వ్యక్తిపై కేసు.. ఏం జరగబోతోంది?

Drinking Culture: మందు బాబులు మద్యం సేవించిన తర్వాత ఎందుకు ఎక్కువగా తింటారో తెలుసా?

Bigg Boss Telugu 9: సంజన నోటికి లాక్.. క్లౌడ్ గేమ్ షురూ.. మేఘం వర్షిస్తేనే సేఫ్, లేదంటే?

Biggest Scams in India: భారతదేశాన్ని కుదిపేసిన అతిపెద్ద స్కామ్స్ ఇవే..

Napoleon Returns: జంతువు ఆత్మతో కథ.. ‘నెపోలియన్ రిటర్న్స్’ టైటిల్ గ్లింప్స్ అదిరింది