ఎయిర్‌టెల్ కొత్త సూపర్ చీప్ ప్లాన్ – 84 రోజులు వాలిడిటీతో అన్‌లిమిటెడ్ 5G డేటా!
Airtel 5G: టెలికాం ప్రపంచంలో ఎప్పుడూ కస్టమర్ల కోసం కొత్త కొత్త ప్లాన్‌లు వస్తూనే ఉంటాయి. కానీ డేటా, సెక్యూరిటీ, టెక్నాలజీ అనే మూడు కీలక అంశాలన్నీ ఒకే ప్లాన్‌లో దొరకడం చాలా అరుదు. ఈ మూడింటినీ బ్యాలెన్స్ చేస్తూ ఎయిర్‌టెల్ ఇప్పుడు తన యూజర్ల కోసం అద్భుతమైన కొత్త ప్లాన్‌ను లాంచ్ చేసింది. ఇప్పుడు రూ. 859కి అందుబాటులో ఉన్న ఈ ప్లాన్, అన్‌లిమిటెడ్ 5G డేటాతో పాటు పలు స్మార్ట్ ఫీచర్లను అందిస్తోంది.
ఈ ప్లాన్‌లో యూజర్లకు 84 రోజుల పాటు రీచార్జ్ టెన్షన్ లేకుండా 2GB హై-స్పీడ్ డేటా రోజువారీ లభిస్తుంది. అంతేకాకుండా, ఎయిర్‌టెల్ 5G నెట్‌వర్క్ ఏరియాలో ఉన్న వారికి డేటా లిమిట్ పూర్తయిన తర్వాత కూడా అన్‌లిమిటెడ్ 5G డేటా కూడా ఉంటుంది. అంటే సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండేవారికీ, ఆన్‌లైన్ క్లాసులు లేదా గేమింగ్ లవర్స్ కి ఇది సూపర్ ఆఫర్ అని చెప్పాలి.
ఇంకా మరో ముఖ్యమైన ఫీచర్.. స్పామ్ కాల్స్‌కి గుడ్‌బై..!
ఎయిర్‌టెల్ నెట్‌వర్క్ ఇప్పుడు ఇన్‌కమింగ్ కాల్స్‌ను “SPAM ALERT”తో హెచ్చరిస్తుంది. దాంతో, యూజర్లు నకిలీ లేదా ఫ్రాడ్ కాల్స్‌కి బలవ్వకుండా ముందుగానే జాగ్రత్త పడొచ్చు.
Also Read: Women Harassment: యువతిని వేధింపులకు గురి చేసిన డాక్టర్, రియల్ ఎస్టేట్ వ్యాపారిపై కేసు నమోదు
ప్రతి నెలా క్యాష్‌బ్యాక్‌తో అదిరే రివార్డ్స్ ఆఫర్!
ఈ ప్లాన్‌లో మరో స్పెషల్ బెనిఫిట్ ఏంటంటే.. రివార్డ్స్ మినీ సబ్‌స్క్రిప్షన్. దీని వలన ప్రతి నెలా యూజర్లకు రూ.80 క్యాష్‌బ్యాక్ లభిస్తుంది, అది కూడా పూర్తిగా ఫ్రీగా.. మొబైల్ రీచార్జ్ ప్లాన్‌లో ఇంత అదనపు లాభం దొరకడం చాలా అరుదు. అంటే రీచార్జ్ చేసుకున్నా, దానిపైన తిరిగి క్యాష్ వస్తుంది. అలాగే, పెట్టిన డబ్బు తిరిగి తెచ్చే ప్లాన్ అని చెప్పుకోవచ్చు.
ఒకే ప్లాన్ – ఎన్నో బెనిఫిట్స్..
ఎయిర్‌టెల్ రూ.859 ప్లాన్ అంటే నిజంగా ఒక స్మార్ట్ డిజిటల్ ప్యాక్‌నే చెప్పాలి. ఇందులో 84 రోజుల వాలిడిటీ, రోజుకు 2GB హై స్పీడ్ డేటా, అన్‌లిమిటెడ్ 5G సదుపాయం, స్పామ్ కాల్ ప్రొటెక్షన్, ఫ్రీ హెలోట్యూన్, క్యాష్‌బ్యాక్ రివార్డ్స్, ఇంకా AI అసిస్టెంట్ సపోర్ట్ – అన్నీ ఒకే ప్లాన్‌లో లభిస్తున్నాయి. డేటా, టెక్నాలజీ, సెక్యూరిటీ అన్నీ ఒకే చోట కావాలనుకునే వారికి ఇది బెస్ట్ చాయిస్. మనకు విలువైన డబ్బుకు పూర్తి విలువ దక్కే ప్లాన్‌గా ఎయిర్‌టెల్ రూ.859 ప్లాన్ ఇప్పుడు టెలికాం మార్కెట్లో ప్రత్యేక స్థానం సంపాదించుకుంది.
