Tata Curvv 2026: కొత్త లుక్‌తో రాబోతున్న టాటా కర్వ్ 2026
Tata Curvv 2026 ( Image Source: Twitter)
బిజినెస్

Tata Curvv 2026: టాటా కర్వ్ 2026 మోడల్ లీక్ .. ఫీచర్లు, అప్‌డేట్స్ వివరాలు ఇవే!

Tata Curvv 2026: టాటా మోటార్స్ తన ప్రముఖ SUV టాటా కర్వ్ 2026 అప్డేట్ తో మరోసారి ఆటో మార్కెట్‌లో రికార్డ్ క్రియోట్ చేయడానికి రెడీ అయింది. ఆధునిక డిజైన్, కొత్త టెక్నాలజీ ఫీచర్లు, ఫ్యూచరిస్టిక్ ఇంటీరియర్‌తో కొత్త కర్వ్ భారత మార్కెట్లో హ్యుందాయ్ క్రెటా, మారుతి గ్రాండ్ విటారా వంటి మోడళ్లకు గట్టి పోటీ ఇవ్వనుంది.

కొత్త 2026 టాటా కర్వ్‌లో ఏమి కొత్తగా ఉందంటే? 

తాజా కర్వ్ అప్డేట్ ల ఎక్స్‌టీరియర్ నుంచి ఇంటీరియర్ వరకు కొత్త మార్పులు చేసింది. ముందు భాగంలో స్లీక్ DRLs, కొత్త అలాయ్ వీల్ డిజైన్లు, షార్ప్ రియర్ ప్రొఫైల్ SUVకి మంచి లుక్ ఇస్తాయి. సాఫ్ట్-టచ్ మెటీరియల్స్, పానోరమిక్ సన్‌రూఫ్, వెంటిలేటెడ్ సీట్లు వంటి ఫీచర్లు ఉన్నాయి. ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌లో IRA 2.0 టెక్నాలజీని అప్‌డేట్ చేశారు. ఇది వాయిస్ కమాండ్స్, 360° కెమెరా, వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో / ఆపిల్ కార్‌ప్లే సపోర్ట్‌ను అందిస్తుంది. ఇది డ్రైవింగ్ అనుభవాన్ని మరింత స్మార్ట్‌గా, కనెక్టెడ్‌గా మార్చుతుంది.

మెరుగైన ఇంజిన్ పనితీరు

ఇంజిన్ విభాగంలో టాటా మోటార్స్ తన టర్బో పెట్రోల్, డీజిల్ ఇంజిన్ ఆప్షన్లను కొనసాగిస్తూ, వీటిని మరింత స్మూత్ పనితీరు, ఫ్యూయల్ ఎఫిషెన్సీ కోసం ట్యూన్ చేసింది. రాబోయే కర్వ్ EV వేరియంట్ ఒకసారి చార్జ్‌తో 450 కిమీ వరకు రేంజ్ అందించగలదని అంచనా వేస్తున్నారు. సస్పెన్షన్ కూడా ఇండియన్ రోడ్ కండిషన్‌లకు అనుగుణంగా రిఫైన్ చేయబడింది.

ఇంటీరియర్ డిజైన్ 

కర్వ్ 2026 ఇంటీరియర్ ఇప్పుడు మరింత ప్రీమియమ్‌గా మారింది. డ్యూయల్ స్క్రీన్ సెటప్ (డిజిటల్ క్లస్టర్ + ఇన్ఫోటైన్‌మెంట్), అంబియంట్ లైటింగ్, టూ-టోన్ లెదర్ ఫినిష్ SUVకి ఫ్యూచరిస్టిక్ ఫీల్ ఇస్తున్నాయి. అదనంగా, అప్‌గ్రేడెడ్ సౌండ్ సిస్టమ్, రియర్ AC ప్రయాణాన్ని మరింత కంఫర్టబుల్‌గా మారుస్తున్నాయి.

Also Read: Free Gemini Pro Offer: భారీ గుడ్ న్యూస్.. జియో కస్టమర్లకు గూగుల్ జెమినీ ప్రో ఫ్రీ యాక్సెస్.. ఇలా యాక్టివేట్ చేసుకోండి

టాటా కర్వ్ EV

టాటా మోటార్స్ Gen 2 EV ఆర్కిటెక్చర్ ఆధారంగా కొత్త కర్వ్ EV వెర్షన్‌ను కూడా సిద్ధం చేస్తోంది. ఈ వెర్షన్‌లో ఫాస్ట్ చార్జింగ్, స్మార్ట్ డ్రైవ్ మోడ్‌లు, బ్యాటరీ లైఫ్ ఉండనున్నాయి. ఇది 2026లో MG ZS EV, Hyundai Creta EV వంటి ఎలక్ట్రిక్ SUV లకు నేరుగా పోటీ ఇవ్వనుంది.

2026 టాటా కర్వ్ స్పెసిఫికేషన్లు

టాటా మోటార్స్ తమ రాబోయే టాటా కర్వ్ 2026 మోడల్ కోసం కీలక వివరాలు బయటకు వచ్చాయి. తాజా సమాచారం ప్రకారం, ఈ కాంపాక్ట్ SUV కొత్త ఇంజిన్ ఆప్షన్లు, మెరుగైన ఫీచర్లు, ఆధునిక టెక్నాలజీతో మార్కెట్లోకి రానుంది.

Also Read: Free Gemini Pro Offer: భారీ గుడ్ న్యూస్.. జియో కస్టమర్లకు గూగుల్ జెమినీ ప్రో ఫ్రీ యాక్సెస్.. ఇలా యాక్టివేట్ చేసుకోండి

ఇంజిన్, ట్రాన్స్‌మిషన్ –  టాటా కొత్త కర్వ్ రెండు ఇంజిన్ ఆప్షన్లలో మనకి అందుబాటులో ఉండనుంది. 1.2 లీటర్ టర్బో పెట్రోల్, 1.5 లీటర్ డీజిల్. ఈ ఇంజిన్లు 6-స్పీడ్ మాన్యువల్. AMT (ఆటోమేటెడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్) గేర్‌బాక్స్‌లతో రానుంది. పెట్రోల్ వెర్షన్ 120–125 bhp పవర్ అవుట్‌పుట్ అందించనుంది.

ఎలక్ట్రిక్ వెర్షన్ (EV) పరిధి  – టాటా కర్వ్ EV వేరియంట్ కూడా లైన్‌లో ఉంది. ఇదొక ఒకసారి ఛార్జ్ చేస్తే 450–500 కిలోమీటర్ల వరకు రేంజ్ ఇవ్వగలదని చెబుతున్నారు.

ఇంటీరియర్, టెక్ ఫీచర్లు –  ఇన్ఫోటైన్‌మెంట్ విభాగంలో 12.3-అంగుళాల టచ్‌స్క్రీన్ డిస్‌ప్లే, IRA 2.0 కనెక్టెడ్ కారు టెక్నాలజీ అందుబాటులో ఉంటాయి. కేబిన్ 5 సీటర్‌గా డిజైన్ చేశారు. ప్రీమియమ్ లుక్‌తో పాటు కొత్త మెటీరియల్ ఫినిష్‌ను కలిగి ఉంటుంది.

సేఫ్టీ ఫీచర్లు –  సేఫ్టీ పరంగా టాటా కర్వ్ టాప్ ట్రిమ్‌లో 6 ఎయిర్‌బ్యాగ్స్, 360° కెమెరా, ADAS (అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్) వంటి ఫీచర్లు ఉండనున్నాయి.

లాంచ్ టైమ్‌లైన్, ధర –  టాటా కర్వ్ 2026 నాటికి భారత మార్కెట్లో విడుదల కానుంది. అంచనా ప్రకారం, ఈ SUV ధర రూ.12 లక్షల నుంచి రూ.22 లక్షల వరకు (ఎక్స్-షోరూమ్) ఉండే అవకాశం ఉంది.

Just In

01

Sleeping Pods: రైల్వే గుడ్ న్యూస్.. రైలు వచ్చే వరకు ఎంచక్క అక్కడ పడుకోవచ్చు!

YouTuber Controversy: అన్వేష్ దెబ్బకు వీడియో డిలేట్ చేసిన ‘ఏయ్ జూడ్’.. రీ అప్లోడ్ వీడియోలో వేరే లెవెల్ వార్నింగ్..

US Strikes Venezuela: పెనుసంచలనం.. వెనిజులాలో అమెరికా మిలిటరీ ఆపరేషన్.. రాజధానిపై భీకర దాడులు

Ticket Bookings Offer: సంక్రాంతి వేళ ధమాకా ఆఫర్.. రైళ్లల్లో ప్రయాణిస్తే డబ్బు వాపస్.. భలే ఛాన్సులే!

Municipal Elections: మున్సిపోల్‌ ఎన్నికలకు రంగం సిద్ధం.. వార్డుల వారీగా ఓటర్ల జాబితా విడుదల!