Vennupotu Dinam Hit Or Fut
ఆంధ్రప్రదేశ్, లేటెస్ట్ న్యూస్

Vennupotu Dinam: వైసీపీ చేపట్టిన ‘వెన్నుపోటు దినం’ హిట్టా.. ఫట్టా?

Vennupotu Dinam: సూపర్‌ సిక్స్‌ (Super Six) సహా 143 హామీలతో ప్రజలను నమ్మించి, ఎన్నికల్లో విజయం సాధించి, అధికారంలోకి వచ్చి ఏడాది అవుతున్నా కూటమి ప్రభుత్వం(Kutami Prabhutvam) ఏడాదిగా ఆ హామీలను అమలు చేయట్లేదన్నది వైసీపీ ప్రధాన ఆరోపణ. ఈ క్రమంలోనే చంద్రబాబు చేసిన ఈ మోశారంటూ ప్రజల తరఫున వైసీపీ ఉద్యమబాట పట్టింది. ఆ పార్టీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పిలుపు మేరకు ఏపీ ఎన్నికల ఫలితాలు వెలువడిన రోజైన ఇవాళ (జూన్‌ 4)ను ‘వెన్నుపోటు దినం’గా పాటించాలని నిర్ణయించి రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలతో నిరసనలకు దిగింది. దీంతో కూటమి ప్రభుత్వత్వానికి వ్యతిరేకంగా వైసీపీ ఆందోళన చేపట్టింది. వెన్నుపోటు దినంలో పెద్ద ఎత్తున వైసీపీ శ్రేణులు, సాధారణ ప్రజలు పాల్గొన్నారు. కూటమి సర్కార్‌ ఇచ్చిన హామీలు గాలికి వదిలేసిందని ప్రజాగ్రహం కట్టలు తెచ్చుకుంది. చంద్రబాబు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవాలని నినాదాలు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా నిరసన ర్యాలీలో ప్రజలు పాల్గొన్నారు. ఈ ప్రభుత్వంపై ప్రజలు పూరించిన మొదటి శంఖారావం అని వైసీపీ శ్రేణులు చెప్పాయి. చంద్రబాబు ప్రభుత్వం చేస్తున్న మోసాలకు వ్యతిరేకంగా పోరాటాలు చేస్తూనే ఉంటామని, తప్పుడు కేసులు పెట్టినా ప్రజలు పక్షాన పోరాటాలు చేస్తూనే ఉంటామని వైసీపీ తేల్చి చెప్పింది. ప్రజలకు ఇచ్చిన హామీలు గాలికి వదిలేశారని, అమ్మకు వందనం, నిరుద్యోగులకు రూ.3వేలు ఎందుకు ఇవ్వలేదని వైసీపీ నేతలు ప్రశ్నించారు.

Read Also- RCB Parade Stampede: ఆర్సీబీ విజయోత్సవాల్లో పెనువిషాదం.. 11 మంది కన్నుమూత

వెన్నుపోటు దినం సక్సెస్..
కూటమి ప్రభుత్వ మోసాలను ప్రశ్నిస్తూ వైసీపీ నిర్వహించిన ‘వెన్నుపోటు దినం’ విజయవంతం అయ్యిందని వైసీపీ రాష్ట్ర సమన్వయకర్త సజ్జల రామకృష్ణారెడ్డి వెల్లడించారు. తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల హామీలను నెరవేర్చకుండా కూటమి ప్రభుత్వం ఏడాది కాలంగా ప్రజలకు చేసిన మోసాన్ని ప్రశ్నిస్తూ వైఎస్ జగన్ ‘వెన్నుపోటు దినం’కు పిలుపునిస్తే, అందులో అన్ని వర్గాలు భాగస్వాములయ్యాయని తెలిపారు. ప్రజలు స్వచ్ఛందంగా తరలివచ్చి ర్యాలీల్లో పాల్గొని ఈ ప్రభుత్వ మోసపూరిత వైఖరిపై తమ ఆగ్రహాన్ని ప్రదర్శించారని అన్నారు. ఈ శాంతియుత ర్యాలీలను అడ్డుకునేందుకు కూటమి ప్రభుత్వం కుట్రలు చేసి పలువురు నాయకులను హౌస్ అరెస్ట్‌ల పేరుతో వేధించిందని మండిపడ్డారు. ‘ చంద్రబాబు మూడు పార్టీలను కూడగట్టుకుని కూటమి పేరుతో అమలు చేయలేనని ముందే తెలిసినా కూడా పలు హామీలను ప్రజల ముందు పెట్టి, అన్ని శక్తులను కూడగట్టుకుని అధికారంలోకి వచ్చారు. ప్రజలను భ్రమల్లో పెట్టి అధికారంలోకి వచ్చి ఏడాది కాలం అయ్యింది. ఏడాదిలోనే కూటమి ప్రభుత్వం, ముఖ్యంగా చంద్రబాబు ప్రజల్లో విపరీతమైన వ్యతిరేకతను మూటగట్టుకున్నారు. దీనికి నిదర్శనే వైసీపీ ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు, ప్రజలు పాల్గొన్న నిరసన ర్యాలీలు. 2019లో ఇదే పరిస్థితిని తెలుగుదేశం ప్రభుత్వం ఎదుర్కొంది. ఆనాడు వైయస్ఆర్‌సీపీ ఒంటరిగా పోటీ చేసి 151 సీట్లు గెలుచుకుంది. తరువాత వచ్చిన స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. కానీ కూటమి ప్రభుత్వ ఏడాది పాలనలో ప్రజల నుంచి వచ్చిన ఈ తాజా నిరనసనలు దేనికి సంకేతమో చంద్రబాబు గుర్తించాలి’ అని సజ్జల వ్యాఖ్యానించారు.

Sajjala Ramakrishna Reddy

హెచ్చరిస్తున్నాం..
కూటమి ఇచ్చిన హామీలన్నీ అమలు చేయాలని మాజీ మంత్రి రోజా డిమాండ్ చేశారు. బుధవారం ‘వెన్నుపోటు దినం’ కార్యక్రమంలో పాల్గొన్న ఆమె.. ప్రజలకు ఇచ్చిన మోసాలపై ఆర్డీవోకు అర్జీ ఇచ్చారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. రెడ్‌బుక్‌ రాజ్యాంగాన్ని వదిలి ప్రజలకు సంక్షేమ కోసం పనిచెయ్యాలని హితవు పలికారు. ‘ కూటమి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. కూటమి ప్రభుత్వం సంవత్సర కాలంలో గంజాయి, మద్యం, ఇసుక అక్రమ రవాణా, మహిళలపై పైశాచికాలు తప్ప సురక్ష పాలన కరువైంది. విద్యార్థులను, మహిళలను కూటమి ప్రభుత్వం వెన్నుపోటు పొడిచింది. ఆంధ్రప్రదేశ్‌ను అప్పుల ఆంద్రప్రదేశ్‌గా మార్చింది ఈ కూటమి ప్రభుత్వం. ఎన్నికల ముందు ఊగిపోయినా పవన్ కళ్యాణ్ నేడు మహిళలపై దారుణాలు జరుగుతున్న మాట రావడం లేదు. పవన్ తన సినిమా ప్రమోషన్ కోసం చూపిస్తున్న చొరవ ప్రజలపై లేదు. పదవ తరగతి పరీక్షలు కూడా సక్రమంగా నెరవేర్చలేని నారా లోకేష్ పప్పు. రెడ్ బుక్ రాజ్యాన్ని పక్కన పెట్టి ఇచ్చిన హామీలు అమలు చేయాలి. కూటమి ప్రభుత్వాన్ని రోడ్డుకు లాగుతాం’ అని రోజా హెచ్చరించారు.

Read Also- Kodali Nani: వంశీని చూసి కొడాలి నాని భయపడ్డారా.. వైద్యులే చెప్పారా?

ఒక్కరూ నోరు మెదపరేం..?
ఎమ్మార్వో ఆఫీస్ ముందు బైఠాయించి మాజీ మంత్రి పేర్ని నాని నిరసన తెలిపారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ముగ్గురు కలిసి ప్రజలను మోసం చేశారని మండిపడ్డారు. ‘ జగన్ కంటే ఒక్క రూపాయి ఎక్కువ ఇస్తామని చెప్పారు. జగన్ చెప్పిన అప్పులు కూడా తానే తీర్చుతానని చెప్పాడు. 12 నెలల కాలంలో లక్ష 51వేల కోట్లు అప్పు చేశారు. ఉచిత బస్సు తుస్సుమన్నది. సంక్రాంతిలోపు రోడ్లు పూర్తి చేస్తామని చెప్పారు. రోడ్ల మీద తిరిగితే నడుం నొప్పులు వస్తున్నాయి. పనులు పూర్తయినవి బిల్లులు ఇంకా రాలేదు. పథకాలు అడిగితే ఖజానా ఖాళీగా ఉంది. రూపాయి లేదని చెబుతారు. నారా లోకేష్, పవన్ కళ్యాణ్, చంద్రబాబు ప్రత్యేక విమానాల్లో తిరుగుతారు. లోకేష్ భార్య పిల్లలను చూడటానికి, చంద్రబాబు సొంత ఇల్లు చూడనైకి ప్రజల సొమ్ముతో తిరుగుతారు. తల్లికి వందనం డబ్బులు ఇంతవరకూ ఇవ్వలేదు. అడిగితే ఒక్కరంటే ఒక్కరూ నోరు మెదపరు. దోచుకున్న డబ్బు దాచుకోవడానికి ప్రత్యేక విమానంలో తిరుగుతారు. చికెన్‌లో కూడా కమిషన్ అడుగుతారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు బ్రాందీ వ్యాపారంలో మునిగి తేలుతున్నారు. ప్రజలనే కాదు దేవుడిని కూడా మోసం చేస్తున్నారు. రాష్ట్రంలో ఉన్న దేవుడి ఆలయాలను దోచేస్తున్నారు. గన్నవరంలో తప్పుడు కేసులు లేవని చర్చకు సిద్ధమన్న నేత చర్చకు రమ్మంటే పారిపోయాడు. వంశీపై తప్పుడు కేసులు పెడుతున్నారు. 2019లో పట్టాలు దొంగపట్టాలను ఇప్పుడు చంద్రబాబుకి గుర్తుకొచ్చింది. తప్పు ఉంటే ఎమ్మార్వోను జైల్లో వేయాలని వంశీపై తప్పుడు కేసు పెట్టారు. ఆస్తి తగదాలో ఇప్పుడు వంశీపై కేసు పెట్టారు. వంశీపై ఇప్పటి వరకూ 11 కేసులు పెట్టారు. మైనింగ్ కేసులో అధికారులను ఎందుకు సస్పెండ్ చేయలేదు. వంశీపై పెట్టిన ప్రతి కేసు తప్పుడు కేసు.. దొంగ కేసు. కూటమి తక్షణమే హామీలు అమలు చేయకపోతే పోరాటం చేస్తాం. కూటమి పతనానికి గన్నవరంలో నాంది పడింది. ప్రజలు ఆగ్రహావేశాల్లో కూటమి ప్రభుత్వం కొట్టుకుపోతుంది’ అని నాని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

Vennupotu

ఆ డబ్బులు ఏమయ్యాయి?
పులివెందులలో వైసీపీ ఆధ్వర్యంలో వెన్నుపోటు దినం కార్యక్రమం జరిగింది. కూటమి వైఫల్యాలకు నిరసనగా పెద్ద ఎత్తున ర్యాలీలో ప్రజలు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి మాట్లాడుతూ ఎన్నికలప్పుడు బాబు షూరిటీ -భవిష్యత్తు గ్యారెంటీ అని చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. ‘ బాబు షూరిటీ-మోసం గ్యారెంటీ అనిపించుకున్నారు. గత ఐదు సంవత్సరాలలో వైసీపీ ప్రభుత్వం మూడు లక్షల కోట్లు పైగా అప్పు చేసింది. బాబు ప్రభుత్వం ఏడాదిలోనే రూ. లక్షా 55వేల కోట్లు అప్పు చేసింది. ఇంత అప్పు చేసినా ప్రజలకు మాత్రం ఒక్క పథకం కూడా ఇవ్వలేదు. మహిళలకు ఉచిత బస్సు, నెలకు రూ.1500, రైతన్నలకు ఏడాదికి రూ.20 వేలు, అమ్మ ఒడి, ఫీజు రీయింబర్స్‌మెంట్, ఆరోగ్యశ్రీ పథకాలను నిర్వీర్యం చేశారు. పులివెందుల మెడికల్ కాలేజీకి 50 సీట్లు వస్తే వెనక్కు పంపిన నీచ చరిత్ర చంద్రబాబుది. పులివెందుల నియోజకవర్గంలో గత ప్రభుత్వంలో 90 శాతం పనులు అయితే మిగిలిన 10% పనులను కూడా ఈ ప్రభుత్వం చేయలేదు’ అని రాష్ట్ర ప్రభుత్వంపై అవినాష్ విమర్శలు కురిపించారు.

Read Also-Savitri: షాకింగ్.. సావిత్రి బంగారు నగలు కొట్టేసిన ‘నటుడు’ ఎవరు?

ఏడాదిగా చేసిందేంటి?
మాజీ మంత్రి, పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ర్యాలీకి ప్రజలు, వైసీపీ కార్యకర్తలు తరలివచ్చారు. ఈ సందర్భంగా పెద్దిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ మోసపు హామీలతో ప్రజలను కూటమి నాయకులు వెన్నుపోటు పొడిచి నేటికి ఏడాది అని వ్యాఖ్యానించారు. ‘ ఈ ఏడాది కాలంలో లా అండ్ ఆర్డర్ దిగజారింది. 390 మంది హత్యకు గురయ్యారు. వైసీపీ నాయకులపై 2466 అక్రమ కేసులు బనాయించి 500 మందిని జైలుకు పంపారు. మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, వారి కుటుంబసభ్యులపై అక్రమ కేసులు పెట్టారు. ఎన్నడూ లేని విధంగా ఐపీఎస్ అధికారులపై కూడా కేసులు పెడుతున్న పరిస్థితి. ఇదంతా రెడ్ బుక్ రాజ్యాంగం ఆధారంగా నడుస్తున్నది. అవినీతి విషయంలో ఇసుక, మద్యం, మైనింగ్ అంటూ అన్ని విధాలా దోచుకుంటున్నారు. వైఎస్ జగన్ హయాంలో పారదర్శకంగా ప్రభుత్వానికి ఆదాయం వచ్చింది. ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలు ఏమయ్యాయో కూటమి నాయకులకే తెలియాలి. రాష్ట్రంలో వేల కోట్లు అప్పులు చేస్తూ ఆ డబ్బులు ఎక్కడ ఖర్చు చేశారు? అనేది కూడా చెప్పలేకపోతున్నారు. వీరికి మాత్రం ముఖ్యమంత్రికి, ఉప ముఖ్యమంత్రికి, లోకేష్‌కు తలా ఒక హెలికాఫ్టర్, విమానం ఏర్పాటు చేసుకున్నారు. విద్యా రంగం పరిస్థితి అయోమయంగా మారింది. లోకేష్ వారంలో టెన్త్ ఫలితాలు అని చెప్పి విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడారు. ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ముద్దుకృష్ణమ నాయుడు చిన్న తప్పు చేస్తే చంద్రబాబు ఒత్తిడి చేసి ఆయన్ను రాజీనామా చేయించారు. మరి ఈరోజు అనేక మంది విద్యార్థుల జీవితాలతో ఆడుకున్న లోకేష్‌ను చంద్రబాబు ఎందుకు రాజీనామా చేయించలేదు?’ అని పెద్దిరెడ్డి ప్రశ్నించారు.

Vidadala Rajani

సుద్ద దండగ.. – తిరుపతి ఎంపీ
సర్వేపల్లి నియోజకవర్గం వెన్నుపోటు దినోత్సవ కార్యక్రమంలో ఎంపీలు మిథున్ రెడ్డి, మద్దిల గురుమూర్తి పాల్గొన్నారు. వెంకటాచలం సర్వేపల్లి రోడ్డు నుంచి ఎమ్మార్వో కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమ అనంతరం ఎంపీ గురుమూర్తి మాట్లాడుతూ.. ప్రజలకు మోస పూరిత హామీలు ఇచ్చి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని, ఈరోజు ప్రజలకు పండగ దినమని కూటమి నాయకులు మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందని ఎద్దేవా చేశారు. ఇది పండగ చేసే ప్రభుత్వం కాదని సుద్ద దండగ ప్రభుత్వం అని ప్రజలు అనుకొంటున్నారని తెలిపారు. కూటమి ఇచ్చిన మోసపూరిత హామీలు రానున్న రోజుల్లో కూటమి ప్రభుత్వాన్ని దావానంలా దహిస్తాయని పేర్కొన్నారు. ఎన్నికల హామీల నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకు అక్రమ కేసులతో వైసీపీ కార్యకర్తలని, నాయకులని వేదిస్తున్నారని, ఇలాంటి ఉడత ఊపులకు భయపడే ప్రసక్తే లేదని హెచ్చరించారు. భవిష్యత్తులో ప్రభుత్వ వైఫల్యలపై ఇలాంటి నిరసన కార్యక్రమాలు మరిన్ని నిర్వహిస్తామని ఈ సందర్బంగా తెలిపారు.

Read Also- Naga Babu: ఏడాది పూర్తి సరే.. మంత్రి పదవి సంగతేంటి?

Just In

01

Telangana Jagruthi: తెలంగాణ జాగృతి సంస్థ నాయకులు ఫైర్.. కారణం అదేనా..?

Crime News: తీరుమారని గంజాయి పెడ్లర్ పై పీడీ యాక్ట్.. ఉత్తర్వులు జారీ!

Crime News: హైదరాబాద్‌లో దారుణం.. మార్ఫింగ్ ఫోటోలతో యవతికి బెదిరింపులు

Teja Sajja: టాలీవుడ్ హీరోల గురించి ఎవరికీ తెలియని విషయం చెప్పిన తేజ సజ్జా.. ఇలా కూడా ఉంటుందా?

Balapur Laddu Auction 2025: బాలాపూర్ లడ్డు సరికొత్త రికార్డ్.. ఈసారి ఎన్ని రూ.లక్షలు పలికిందంటే?