Vallabhaneni Vamsi: వైసీపీ కీలక నేత, మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్ ఇటీవల విజయవాడ సెంట్రల్ జైలు నుంచి రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పటి వరకూ అంతా ప్రశాంతమే అనుకుంటే ఆయనకు కూటమి సర్కార్ మళ్లీ సినిమా షురూ చేసినట్లుగా తెలుస్తున్నది. ఇందుకు తాజా పరిణామాలే బలాన్ని చేకూరుస్తున్నాయి. ఎందుకంటే.. శనివారం నాడు గన్నవరం పోలీస్ స్టేషన్‌లో సుమారు మూడు గంటల పాటు విచారణ అధికారి కోసం వేచి చూడాల్సి వచ్చింది. ఈ ఘటన రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగమేనని వైసీపీ తీవ్రంగా మండిపడుతోంది. తీరా చూస్తే.. మూడు గంటల నిరీక్షణ తర్వాత ఈరోజు విచారణ లేదని పోలీసులు చెప్పడం గమనార్హం. మూడు గంటలపాటు పోలీస్ స్టేషన్‌లోనే మాజీ ఎమ్మెల్యే నిరీక్షించారు. కోర్టు ఆదేశాలు మేరకు మైనింగ్ కేసుకు సంబంధించిన క్రైమ్ నంబర్ 142/25 మైనింగ్ కేసులో వంశీ విచారణకు హాజరయ్యారు.
Read Also- YSRCP: వైసీపీలోకి కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి.. ముహూర్తం ఫిక్స్?
వేచి చూసి.. చూసి!
విచారణ అధికారి స్టేషన్‌కు రాకపోవడంతో ఎప్పుడెప్పుడు వస్తారా? అని మూడు గంటలుగా వేచివుండాల్సి వచ్చింది. మధ్యాహ్నం 12 గంటల సమయంలో వంశీ పోలీస్ స్టేషన్‌కు చేరుకుని, విచారణ కోసం సంతకాలు చేశారు. అయితే, ఆ సమయంలో విచారణ అధికారి స్టేషన్‌లో లేరు. ఆయన ఎప్పుడెప్పుడు వస్తారా? అని మూడు గంటలపాటు వేచి చూశారు. తీరా చూస్తే.. విచారణ ఎప్పుడు అనేది లేఖ ద్వారా తెలియజేస్తామని పోలీసుల నుంచి సమాచారం వచ్చింది. చివరికి గన్నవరం ఎయిర్‌పోర్ట్ నుంచి విజయవాడ హాస్పిటల్‌కు బయల్దేరి వెళ్లారు. కాగా, వంశీ మళ్లీ అస్వస్థతకు గురవ్వడంతో గత నాలుగు రోజులుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అనారోగ్యంతో ఉన్నప్పటికీ స్టేషన్ లోపల బెంచీపై మూడు గంటలుగా వేచి చూసి వంశీ ఇబ్బంది పడ్డారు. వంశీ అనుచరులు, ఆయన ఆరోగ్యం దృష్ట్యా త్వరగా విచారణ పూర్తి చేసి పంపాలని కిందిస్థాయి పోలీసు సిబ్బందిని అభ్యర్థించారు. అయితే, విచారణ అధికారి లేకపోవడంతో తామేమీ చేయలేమని పోలీసులు తెలిపారు.
Read Also- Chandrababu: రెండ్రోజుల ఢిల్లీ పర్యటనకు చంద్రబాబు.. ఏం చేయబోతున్నారు?
అసహనం!
సుమారు మూడు గంటల పాటు వంశీ అనారోగ్యంతో బెంచీపైనే కూర్చుండిపోయారు. చివరకు, విచారణ అధికారి ఈరోజు రారని, విచారణ ఎప్పుడనేది లేఖ ద్వారా తెలియజేస్తామని పోలీసులు తెలిపారు. దీంతో వంశీ, ఆయన అనుచరులు అసహనానికి గురయ్యారు. పోలీసులను అడ్డుపెట్టుకుని కూటమి ప్రభుత్వం వంశీని ఉద్దేశపూర్వకంగానే ఇబ్బంది పెడుతోందని వైసీపీ ఆరోపిస్తున్నది. ఈ సంఘటనతో వల్లభనేనిపై రాజకీయ వేధింపులు కొనసాగుతున్నాయని వైసీపీ శ్రేణులు మండిపడుతున్నాయి. వంశీ అనారోగ్యంతో ఉన్నా.. అన్ని కేసుల్లో బెయిల్ వచ్చినా ప్రభుత్వం, పోలీసుల నుంచి మాత్రం వేధింపులు ఆగడం లేదని వైసీపీ నేతలు మండిపడుతున్నారు. జైలు నుంచి బయటకు వచ్చాక కూడా పోలీసులను అడ్డపెట్టుకొని కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలను కొనసాగిస్తోందని అనుచరులు కన్నెర్రజేస్తున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఇక ప్రత్యర్థుల నుంచి ఎలాంటి కామెంట్స్ వస్తాయో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. వంశీకి సినిమా మళ్లీ మొదలు అని కొందరు అంటుంటే.. చేసిన పాపం అంత ఈజీగా పోతుందా? మరికొందరు ఇలా ఎవరికి తోచినట్లుగా వాళ్లు కామెంట్స్ చేస్తున్నారు.
Read Also- YSRCP: ‘స్వేచ్ఛ’ ఎఫెక్ట్.. వైసీపీని వీడటంపై ధర్మాన ఫుల్ క్లారిటీ.. మనసులో మాట బయటికొచ్చిందే!