YSRCP: కోట్ల ఫ్యామిలీ టీడీపీకి గుడ్ బై చెప్పేసి వైసీపీ తీర్థం పుచ్చుకోవడానికి సిద్ధమైందా? ముహూర్తం కూడా ఫిక్స్ చేసుకుందా? అంటే ఈ మాటలన్నింటికీ వైసీపీ శ్రేణులు ఔననే సమాధానం ఇస్తున్నాయి. అంతేకాదు.. అటు కోట్ల కుటుంబానికి అత్యంత సన్నిహితులుగా ఉన్న వ్యక్తులు సైతం వంద శాతం నిజమేనని చెబుతున్న పరిస్థితి. కోట్ల ఫ్యామిలీ గురించి తెలుగు రాష్ట్రాల ప్రజలకు ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దివంగత కోట్ల విజయభాస్కర రెడ్డి కుమారుడే జయసూర్యప్రకాశ్ రెడ్డి (Kotla Suryaprakash Reddy) . కోట్ల కుటుంబానికి కర్నూలు జిల్లా రాజకీయాల్లో మంచి పట్టుంది. నాటి నుంచి నేటి వరకూ కోట్ల ఫ్యామిలీ లెగసీ కంటిన్యూ అవుతూనే ఉంది. కాస్త ప్రభావం తగ్గిందేమో కానీ, తక్కువలో తక్కువ ఒక పార్లమెంట్‌లోని అన్ని నియోజకవర్గాలను ప్రభావితం చేసే రేంజ్ ఉంది. కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి తన రాజకీయ జీవితాన్ని ఎక్కువగా భారత జాతీయ కాంగ్రెస్ పార్టీతోనే గడిపారు.
Read Also- Chandrababu: రెండ్రోజుల ఢిల్లీ పర్యటనకు చంద్రబాబు.. ఏం చేయబోతున్నారు?
నాడు.. నేడు..
1991లో మొదటిసారి పార్లమెంట్‌కు ఎన్నికయ్యారు. ఆ తర్వాత 2004, 2009 ఎన్నికల్లో కూడా కర్నూలు లోక్‌సభ నియోజకవర్గం నుంచి ఎంపీగా గెలిచి 14, 15వ లోక్‌సభలకు ప్రాతినిధ్యం వహించారు. మన్మోహన్ సింగ్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వంలో రైల్వేశాఖ సహాయ మంత్రిగా (అక్టోబర్ 2012- జూన్ 2014) పనిచేశారు. ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో బలహీనపడటంతో, 2019 సార్వత్రిక ఎన్నికలకు ముందు కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి తెలుగుదేశం పార్టీలో చేరారు. 2019 ఎన్నికల్లో కర్నూలు లోక్‌సభ స్థానం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. 2024 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన డోన్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి.. వైసీపీ కీలక నేత, మంత్రిగా పనిచేసిన బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డిపై 6,049 ఓట్ల మెజార్టీతో గెలిచారు. ప్రస్తుతం ఆయన డోన్ టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన భార్య కోట్ల సుజాతమ్మ కూడా రాజకీయాల్లో ఉన్నారు. ఎమ్మెల్యేగా పనిచేసిన అనుభవం ఉన్నది. వీరికి ఒక కొడుకు కోట్ల రాఘవేంద్ర రెడ్డి, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. 2024 ఎన్నికలకు ముందు టీడీపీ నుండి పలువురు నాయకులు వైసీపీలో చేరారు. అయితే, ఇందులో కోట్ల హరిచక్రపాణి రెడ్డి (కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డికి బంధువు) ఉన్నారు. అప్పట్లోనే సూర్య కూడా చేరుతారని ప్రచారం జరిగిందో.. ఎందుకో ఆచరణలోకి రాలేదు.
Read Also- YSRCP: ‘స్వేచ్ఛ’ ఎఫెక్ట్.. వైసీపీని వీడటంపై ధర్మాన ఫుల్ క్లారిటీ.. మనసులో మాట బయటికొచ్చిందే!
టీడీపీకి దూరంగా..?
కొంతకాలంగా కోట్ల టీడీపీ అధిష్టానానికి దూరంగా ఉన్నారనే వార్తలు వస్తూనే ఉన్నాయి. మంత్రి పదవి ఆశించినా దక్కకపోవడంతో అసంతృప్తిగా ఉన్నారని ప్రచారం పెద్ద ఎత్తునే జరుగుతోంది. అయితే, కోట్ల ఫ్యామిలీ అంటేనే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ముఖ్యంగా కర్నూలు జిల్లాలో ఒక బలమైన, సుపరిచితమైన కుటుంబం. అలాంటిది మంత్రి పదవి దక్కకపోవడంతో అభిమానులు, క్యాడర్, అనుచరులు ఒక్కసారిగా నిరూత్సాహానికి గురయ్యారు. దీంతో నాటి నుంచి నేటి వరకూ అదే కంటిన్యూ అవుతున్నది. సూర్య కూడా పెద్దగా టీడీపీ కార్యక్రమాల్లో పాల్గొన్నది లేదు. దీంతో అప్పట్నుంచే టీడీపీకి గుడ్ బై చెప్పి వైసీపీలో చేరబోతున్నారనే ప్రచారం నడుస్తున్నది. ఆ మధ్య ఈ వార్తలను స్వయంగా ఖండించారు కూడా. అయితే తాజాగా మరోసారి పెద్ద ఎత్తునే ప్రచారం జోరందుకున్నది. అది కూడా కోట్ల కాంపౌండ్ నుంచి కావడంతో ఈ వార్తలకు ప్రాధాన్యత సంతరించుకున్నది. రెడ్డి సామాజిక వర్గంలో సీనియర్ పొలిటీషియన్ అయిన తనను అవమానిస్తున్నారనే భావనలో కోట్ల ఉన్నారట. అందుకే తన సోదరుడు కోట్ల హరిచక్రపాణిరెడ్డి ద్వారా వైసీపీలో చేరడానికి మంతనాలు జరుపుతున్నట్లుగా తెలుస్తున్నది. ఎమ్మెల్యే, అందులోనూ కోట్ల ఫ్యామిలీ నుంచి రావడం అంటే మామూలు విషయేమీ కాదు. వారసత్వాన్ని కంటిన్యూ చేయడానికి, తమకు ప్రాధాన్యత ఇచ్చే, తన సామాజిక వర్గానికి చెందిన వైసీపీలో చేరితే మంచిదని కోట్ల ఫ్యామిలీ భావిస్తున్నట్లుగా తెలిసింది. మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జిల్లాల పర్యటనలో కండువా కప్పుకోవడానికి సిద్ధమవుతున్నట్లుగా సన్నాహాలు జరుగుతున్నట్లుగా సమాచారం. ఇందులో నిజానిజాలెంతో తెలియడానికి కొన్నిరోజులు వేచి చూడాల్సిందే మరి.
Read Also- Crime News: జన్మనిచ్చి అల్లారుముద్దుగా పెంచారు.. కానీ చివరికి!
సోషల్ మీడియా వైరల్ అవుతున్నది ఇదే..
