Amaravati quantum
ఆంధ్రప్రదేశ్

Chandrababu: ఇంట్రెస్టింగ్ విషయం చెప్పిన చంద్రబాబు.. నమ్మలేకపోతున్న జనం!

Chandrababu: అవును.. టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు నోట ఎప్పుడు ఎలాంటి మాటలు వస్తాయో తెలియని పరిస్థితి. కొన్ని సందర్భాల్లో ఆయన మాటలు నిజమే అనిపించినా.. మరికొన్ని సమయాలల్లో అవునా.. నిజమా? అని ఆశ్చర్యపోయే పరిస్థితి. ఇప్పటి వరకూ బాబు మాట్లాడిన మాటలు.. సర్వంతార్యామీ అని చెప్పుకునే సందర్భాలను కాసేపు అటుంచితే తాజాగా ఆయన మరో బాంబ్ పేల్చారు. ‘ భారతదేశంలో ఐటీ అంటే ఏంటో ఎవరికి తెలియనప్పుడు నేను అందరితో సమావేశం ఏర్పాటు చేసి ఐటీని ముందుకు తీసుకెళ్లాలని కోరాను. లోకేష్ చెప్పినట్టు నేను అతను 7వ తరగతిలో ఉన్నప్పుడు ఐటీ కోసం పనిచేయలేదు. 1983-84లో నేను ఐటీ కోసం అప్లై చేసినప్పుడే లోకేష్ జన్మించాడు. ఐటీ ప్రమోట్ చేసేందుకు హైదరాబాద్‌లో హైటెక్ సిటీ నిర్మించమని ఎల్ అండ్ టీ సంస్థను అడిగాను. ఐటీ పరిశ్రమలో అదే మొదటి అడుగు’ అని చంద్రబాబు వెల్లడించారు. అవునా.. అంటూ ఈ మాట విన్న జనాలు అస్సలు నమ్మలేకపోతున్నారు. అసలు ఈ మాట ఎప్పుడు.. ఎక్కడ అన్నారు? అనే విషయాలు తెలుసుకుందాం వచ్చేయండి.

Read Also- BJP: తెలంగాణ బీజేపీలో చంద్రబాబు చక్రం తిప్పారా..?

నేనే చెప్పా.. చర్చించా!
అమెరికాలో సిలికాన్ వ్యాలీ ఉంటే.. అమరావతిలో క్వాంటం వ్యాలీ (Quantum Valley Amaravati) ఏర్పాటు చేయాలన్నది చంద్రబాబు లక్ష్యం. 2026 జనవరి 1 నాటికి క్వాంటం వ్యాలీ ప్రారంభించడానికి సీబీఎన్ చేస్తున్న ప్రయత్నాలు అన్నీ ఇన్నీ కావు. విజయవాడలో నిర్వహించిన నేషనల్ వర్క్ షాప్‌కు ఐటీ, ఫార్మా, వాణిజ్య, నిర్మాణ రంగాలకు చెందిన ప్రముఖ బహుళ జాతి సంస్థల ప్రతినిధులు, కేంద్ర ప్రభుత్వంలోని ఉన్నతాధికారులు సోమవారం హాజరయ్యారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్‌ను క్వాంటం టెక్నాలజీ కేంద్రంగా తీర్చిదిద్దే లక్ష్యంతో పనిచేస్తున్నట్టు వివరించారు. ఐబీఎం, టీసీఎస్, ఎల్ అండ్ టీ భాగస్వామ్యంతో ఈ క్వాంటం వ్యాలీ పార్క్‌ను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తోందని తెలిపారు. క్వాంటం కంప్యూటింగ్‌ను భారత్ అందిపుచ్చుకోవాలని పిలుపునిచ్చారు. ‘ నేను తొలిసారి సీఎం అయినప్పుడు ఐటీ పరిశ్రమ విస్తరిస్తోంది. మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్‌ను కలిసి ఐటీ విస్తరణపై చర్చించాను. పీపీపీ విధానంలో హైటెక్ సిటీ కట్టాలని ఎల్ అండ్ టీని కోరాను. ఆ తర్వాత ఆ సంస్థ బెంగుళూరు, గురుగాంవ్‌లోనూ ఐటీ భవనాలు కట్టింది. భవిష్యత్‌లో భారత్ అతిపెద్ద ఐటీ హబ్‌గా మారుతుందని అప్పుడే చెప్పాను. ఉమ్మడి ఏపీలో ఇంజనీరింగ్ కళాశాలలు ఏర్పాటు చేశాను. రాజధాని అమరావతికి అనేక ఐటీ సంస్థలు వస్తున్నాయి. అధునాతన సాంకేతిక కేంద్రంగా అమరావతిని మారుస్తాం. అమరావతికి రావాలని స్టార్టప్ కంపెనీలను ఆహ్వానిస్తున్నాం’ అని చంద్రబాబు వివరించారు.

CBN Speech

Read Also- YSRCP: వైసీపీలోకి జేసీ ఫ్యామిలీ.. అధికారిక ప్రకటన

ఏపీలో సానుకూలతలు..
‘ నేషనల్ క్వాంటం మిషన్‌ను కేంద్రం ప్రకటించిన వెంటనే అమరావతిలో క్వాంటం వ్యాలీని ఏర్పాటు చేయాలని నిర్ణయించాం. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టును ఐబీఎం, టీసీఎస్, ఎల్ అండ్ టీ లాంటి దిగ్గజ సంస్థల భాగస్వామ్యంతో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. క్వాంటం వ్యాలీ పార్క్‌కు అనుబంధంగా పూర్తిస్థాయి ఎకో సిస్టమ్ ఏర్పాటు చేసి, వందకు పైగా యూజ్ కేసెస్‌ను పరీక్షిస్తాం. ఓ మిషన్ తీసుకొచ్చి అమరావతికి క్వాంటం కంప్యూటర్ వచ్చేసింది అనుకోవటం లేదు. వివిధ ఉపకరణాల నుంచి రియల్ టైమ్ డేటా విశ్లేషణకు, వ్యవసాయంలో మట్టి తేమ వంటి అంశాలను పర్యవేక్షించడానికి క్వాంటం కంప్యూటింగ్ అవసరం. క్వాంటం టెక్నాలజీ, డీప్ టెక్నాలజీ, ఏఐలు ఇప్పుడు సరికొత్త సాంకేతిక విప్లవం. ఈ రంగాల్లో ఏపీకి కొన్ని సానుకూలతలు ఉన్నాయి. ఏపీలో స్పేస్ సిటీ, స్పేస్ టెక్నాలజీ, డిఫెన్స్, ఎరో స్పేస్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్ రంగాల్లో చాలా అవకాశాలు ఉన్నాయి. ఏపీలో ప్రభుత్వ సేవలను వాట్సప్ ద్వారా అందిస్తున్నాం. ఆగస్టు 15 నుంచి వందశాతం పౌరసేవలు వాట్సప్ ద్వారానే అందిస్తాం. డేటా లేక్‌పై ఏపీ ప్రస్తుతం పనిచేస్తోంది. పౌరుల నివాసాలు జియో ట్యాగింగ్, సర్వీస్ డెలివరీ, ఆన్ లైన్ పైల్స్, క్లౌడ్ డేటాలను పాలనలో వినియోగిస్తున్నాం. సీసీ కెమెరాలు, సెన్సార్లు, వేరబుల్స్ ద్వారా రియల్ టైమ్ డేటా వస్తోంది. వీటిని విశ్లేషించాలంటే క్వాంటం కంప్యూటింగ్ అవసరం’ అని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు.

Chandrababu

రండి.. విచ్చేయండి
వ్యవసాయ రంగంలో భూమిలో తేమ, ఎరువుల వినియోగం లాంటి అంశాలను కూడా క్వాంటం కంప్యూటింగ్‌తో అనుసంధానిస్తే అద్భుతాలు చేయొచ్చు. క్వాంటం టెక్నాలజీలో స్టార్టప్‌లు కూడా వస్తే అవకాశాలు విస్తృతం అవుతాయి. ఫార్మా రంగంలోనూ, వ్యక్తుల ఔషధ వినియోగం వంటి వాటిపై కూడా పరిశోధనలు సాగించవచ్చు. క్వాంటం కంప్యూటింగ్ సాంకేతికతను మరో స్థాయికి చేరుస్తుంది. క్వాంటం రంగంలో స్టార్టప్‌లు రావడానికి విస్తృత అవకాశాలు ఉన్నాయి.. ఆవిష్కరణకు ఆకాశమే హద్దు. అమరావతి సహా ఐదు ప్రాంతాల్లో రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్‌లను ఏర్పాటు చేస్తున్నాం. వాటిని పరిశ్రమలు, స్టార్టప్‌లు సద్వినియోగం చేసుకోవాలి. ఈ మూమెంటంలో బహుళజాతి కంపెనీలు భాగస్వాములు కావాలి. ఇప్పుడే పెట్టుబడులతో ముందుకు రావాల్సిన అవసరం ఉంది. భారత్‌లోనే ఉత్పత్తులు తయారు చేసి ఇక్కడి మార్కెట్‌ను వినియోగించుకోవాలి. ఏపీలోనూ వన్ ఫ్యామిలీ, వన్ ఎంటర్‌ప్రెన్యూర్‌ను తయారుచేయాలని లక్ష్యం నిర్దేశించుకున్నాం. పాలనలో పారదర్శకత, వేగం, జవాబుదారీతనం తీసుకురావడానికి ఐటీ ఒక్కటే మార్గమని బలంగా విశ్వసించాను. హైదరాబాద్‌లో హైటెక్ సిటీని నిర్మించడం ద్వారా ఒక బలమైన ఐటీ ఎకోసిస్టమ్‌ను సృష్టించాం. ఫలితంగా ఇప్పుడు సైబరాబాద్ ప్రపంచ ఐటీ కేంద్రంగా మారింది. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ఆదాయంలో 75 శాతం హైదరాబాద్ నుంచే వస్తోంది. అమరావతి క్వాంటం వ్యాలీ దేశానికి మార్గనిర్దేశనం చేయాలి అని చంద్రబాబు స్పష్టం చేశారు.

Quantum Valley

Read Also- Techie self Lock: తాళం వేసుకొని ఫ్లాట్‌లో మూడేళ్లు.. గుండె తరుక్కుపోయే కన్నీటి కథ

Just In

01

Minister Sridhar Babu: పరిశ్రమల ఏర్పాటుకు ఇక్కడ అన్నీ అనుకూలమే!

CBI Director Praveen Sood: హైదరాబాద్ వచ్చిన సీబీఐ డైరెక్టర్ ప్రవీణ్​ సూద్.. అందుకోసమేనా..?

Jajula Surender: సమీక్షలు కాదు సత్వర చర్యలు చేయండి: జాజుల సురేందర్

KTR: రాబోయే ఆరు నెలల్లో ఉప ఎన్నికలు ఖాయం.. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు

Expand Dog Squad: రాష్ట్రంలో నేరాలను తగ్గించేందుకు పోలీసులు సంచలన నిర్ణయం..?