JC Family YSRCP
ఆంధ్రప్రదేశ్

YSRCP: వైసీపీలోకి జేసీ ఫ్యామిలీ.. అధికారిక ప్రకటన

YSRCP: అవును.. మీరు వింటున్నది అక్షరాలా నిజమే. జేసీ ఫ్యామిలీ వైసీపీలో (YSR Congress) చేరడానికి రంగం సిద్ధం చేసుకున్నది. ఈ విషయాన్ని అధికారికంగా టీడీపీ సీనియర్ నేత, తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డే ప్రకటించారు. తాడిపత్రి నియోజకవర్గంలో వైసీపీ వర్సెస్ టీడీపీ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో ఎదురుపడితే మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి.. జేసీ బ్రదర్స్ కొట్టుకునేంత పరిస్థితి ఉన్నది. వైసీపీ అధికారంలో ఉన్నన్ని రోజులు జేసీ ఫ్యామిలీని (JC Family) పెద్దారెడ్డి బంతాట ఆడుకున్నారు. ఇప్పుడు వైసీపీ ఓడిపోవడం.. తానూ ఎమ్మెల్యేగా పరాజయం పాలవ్వడంతో సీన్ మొత్తం రివర్స్ అయ్యింది. ఎంతలా అంటే.. ఏడాదిగా తన సొంత నియోజకవర్గానికి రావడానికి పెద్దారెడ్డి సాహసించలేకపోతున్న పరిస్థితి. అడుగుపెడితే చాలు రప్పా.. రప్పా అంటూ కేతిరెడ్డికి స్వయంగా జేసీ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. అటు పెద్దారెడ్డి (Kethireddy Peddareddy) సైతం అస్సలు తగ్గట్లేదు. తేల్చుకుందాం అన్నట్లుగానే ఇరువురూ వ్యవహరిస్తున్నారు. సరిగ్గా ఈ క్రమంలోనే మీడియా ముందుకొచ్చిన జేసీ ప్రభాకర్ రెడ్డి (JC Prabhakar Reddy) సంచలన ప్రకటన చేశారు.

Read Also- Tadipatri: తాడిపత్రిలో అసలేం జరుగుతోంది.. ఏడాది కాలంగా ఎందుకిలా?

Pedda Reddy

త్వరలోనే..!
సోమవారం మీడియా ముందుకొచ్చిన ప్రభాకర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఇప్పుడీ కామెంట్స్ అటు టీడీపీ, ఇటు వైసీపీలోనే కాదు.. రాష్ట్ర రాజకీయాల్లో మరీ ముఖ్యంగా రాయలసీమలో తీవ్ర చర్చనీయాంశం అయ్యింది. ‘ నా ఆస్తులు అన్ని పోయినా నేను బాధపడలేదు. ఆఖరికి నా కొడుకును జైల్లో వేయించినా నేనెప్పుడూ బాధపడలేదు. మాజీ ఎమ్మెల్యే నా ఇంట్లోకి వచ్చి వెళ్ళాడే.. అదే చాలా బాధగా ఉంది. మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇల్లు అక్రమ రిజిస్ట్రేషన్ అయ్యింది. కలెక్టర్ డీవియేషన్ చేయమని లెటర్ కూడా ఇచ్చారు. తాడిపత్రి (Tadipatri) అభివృద్ధి గురించే 24 గంటలు ఆలోచిస్తాం.. కాబట్టే మున్సిపాలిటీలో మేము గెలిచాం. వైసీపీ నాయకుల జోలికి మేం పనిగట్టుకొని వెళ్లట్లేదు.. లీగల్ గానే వెళ్తున్నాం. వైసీపీ కార్యకర్తల జోలికి ఎప్పటికీ రాం. అంతేకాదు.. మేము కూడా త్వరలోనే వైసీపీలోకి రావచ్చు. ఎందుకంటే వైఎస్ ఫ్యామిలీతో మాకు చాలా అనుబంధం ఉంది. మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డిపై నాకు కక్ష ఉంది. అయినా నేను అతనిపైకి లీగల్‌గానే వెళ్తాను’ అని జేసీ తేల్చి చెప్పేశారు. రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, మిత్రులు ఉంటారనే నానుడి ఉంది.. సరిగ్గా జేసీ మాటలు చూస్తే అక్షరాలా అదే నిజమవుతున్నది. ఒకవేళ జేసీ ఫ్యామిలీ రావడానికి సిద్ధమైతే వైఎస్ జగన్ కూడా పెద్దగా అడ్డు చెప్పడానికి ఏమీ ఉండదనే చెప్పుకోవాలి. కాకపోతే పెద్ద టాస్క్‌ను పూర్తి చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే జీవితకాలం కేతిరెడ్డి-జేసీ కుటుంబాల (Kethireddy Vs JC Family) మధ్య వైరం ఉన్నది. అలాంటిది ఇంత సడన్‌గా ఇరు కుటుంబాలను కలపాలన్నా.. ఒక్కటి చేయాలన్నా అంత ఆషామాషీ కానే కాదు. పైగా వైసీపీలో చేరితే మాత్రం తప్పకుండా కేతిరెడ్డి మాత్రం తాడిపత్రిని మరిచిపోవాల్సి ఉంటుంది. అంతేకాదు.. ఇంకో పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గాన్ని కూడా వదులుకోవాల్సి ఉంటుంది కూడా. అప్పుడిక పరిస్థితి ఎలా ఉంటుందో.. అసలు కేతిరెడ్డి వైసీపీలో కొనసాగుతారో లేదో వేచి చూడాలి. మరీ ముఖ్యంగా ఈ ప్రకటనతో టీడీపీ నుంచి ఎలాంటి రియాక్షన్ వస్తుందో చూడాలి.

JC Family

Read Also- Anchor Swetcha: తట్టుకోలేకపోతున్నా.. పచ్చి నిజాలు చెప్పిన పూర్ణచందర్ భార్య

మంచి సంబంధాలే..
వాస్తవానికి వైఎస్ కుటుంబంతో జేసీ ఫ్యామిలీకి మంచి అనుబంధం ఉంది. ఒకప్పుడు చాలా సన్నిహితంగా ఉన్న ఈ రెండు కుటుంబాల మధ్య ఇప్పుడు తీవ్రమైన వైరం నెలకొని ఉంది. ఒకప్పుడు జేసీ దివాకర్ రెడ్డి, వైఎస్ రాజశేఖర్ రెడ్డి (YS Rajasekhar Reddy) ఇద్దరూ కాంగ్రెస్‌లో సుదీర్ఘకాలం పనిచేశారు. వైఎస్ ముఖ్యమంత్రి కాకముందు నుంచే జేసీ కుటుంబానికి, వైఎస్ కుటుంబానికి మంచి సంబంధాలు ఉన్నాయి. వైఎస్సార్ ముఖ్యమంత్రి అయ్యాక తన కేబినెట్‌లో జేసీ దివాకర్ రెడ్డికి పంచాయతీ రాజ్, దేవాదాయ శాఖ మంత్రిగా పదవిచ్చారు. ఇది వారి మధ్య ఉన్న సాన్నిహిత్యానికి నిదర్శనమని చెప్పుకోవచ్చు. వైఎస్‌ను జేసీ దివాకర్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి పలు సందర్భాల్లో ప్రశంసించారు కూడా. ముఖ్యంగా ‘మాట తప్పని, మడమ తిప్పని మహానేత’ అని అభివర్ణించిన రోజులు చాలానే ఉన్నాయి. వైఎస్ మరణానంతరం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రాజకీయంగా ఎదిగారు. అయితే ఆ తర్వాత జేసీ కుటుంబానికి, వైఎస్ కుటుంబానికి మధ్య దూరం పెరిగింది. జేసీ దివాకర్ కుమారుడు పవన్.. వైఎస్ జగన్‌ ఇద్దరూ మంచి స్నేహితులు. ఇద్దరూ క్లాస్‌మేట్స్ కూడా. జగన్ సొంతంగా వైసీపీని స్థాపించడంతో, జేసీ కుటుంబం కొన్నిరోజులపాటు కాంగ్రెస్‌లోనే కొనసాగింది. ఆ తర్వాత 2014లో ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత, జేసీ సోదరులు కాంగ్రెస్‌ను వీడి టీడీపీలో చేరారు. అప్పట్నుంచీ వైసీపీకి వ్యతిరేకంగా టీడీపీలో కీలక పాత్ర పోషించడం ప్రారంభించారు. టీడీపీలో చేరిన తర్వాత మాత్రమే ఈ రెండు కుటుంబాల మధ్య గ్యాప్ వచ్చిందే కానీ.. పెద్ద శత్రుత్వం ఏమీలేదు. ఏమో.. రాజకీయాల్లో ఎప్పుడేం జరుగుతోందో ఊహించడం, అంచనాలు వేయడం కష్టమే గురూ!

JC Prabhakar Reddy

Read Also- Raja Singh: బీజేపీకి రాజాసింగ్ రాజీనామా.. లవ్ లెటర్ ఇచ్చి..

Just In

01

Bhatti Vikramarka: విద్యారంగం పై ఊహించని రీతిలో సర్కారు పెట్టుబడులు

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ గురించి బ్లాక్ బస్టర్ న్యూస్ చెప్పిన దేవీ శ్రీ ప్రసాద్..

Telangana Politics: కాంగ్రెస్‌లో ఉత్కంఠం.. ఏఐసీసీలో కవిత ఎపిసోడ్..?

Harish Rao: పాలకులే నెగిటివ్ మైండ్ సెట్.. అభివృద్ధి ఎలా సాధ్యం..?

Ashish Warang death: ప్రముఖ నటుడు కన్నుమూత.. సోకసంద్రంలో ఇండస్ట్రీ