Chiranjeevi | చిరంజీవి తాజాగా జనసేనపై సంచలన వ్యాఖ్యలు చేశారు. మెగాస్టార్ చిరంజీవి ఇన్ డైరెక్ట్ గా పవన్ కల్యాణ్ స్థాపించిన జనసేనకు సపోర్టు చేస్తున్నారనేది జగమెరిగిన సత్యం. ఆయన జనసేనకు నేరుగా ప్రచారం చేయలేకపోయినా.. ఇన్ డైరెక్ట్ గా ఆయన మద్దతు ఇస్తున్నారు. చిరంజీవి (Chiranjeevi) తాజాగా విశ్వక్ సేన్ నటించిన లైలా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు గెస్ట్ గా వచ్చారు. ఇందులో ఆయన మాట్లాడుతున్నప్పుడు కొందరు ఫ్యాన్స్ జై జనసేన అంటూ నినాదాలు చేశారు. అది విన్న చిరంజీవి కూడా జై జనసేన అన్నారు. ప్రజారాజ్యం పార్టీనే జనసేనగా రూపాంతరం చెందింది అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
దాంతో ఒక్కసారిగా ఈవెంట్ జనసేన నినాదాలతో మార్మోగిపోయింది. చిరంజీవి ఎన్నడూ ఇలా నేరుగా జై జనసేన అనలేదు. కానీ ఆయన మనసులో మాత్రం అది ఉంది. అదే ఇప్పుడు ఇలా బయటకు వచ్చిందంటున్నారు మెగా ఫ్యాన్స్. ఒకప్పుడు ప్రజారాజ్యం పార్టీ స్థాపించిన చిరంజీవి.. ఆ తర్వాత దాన్ని కాంగ్రెస్ లో కలిపేసిన సంగతి తెలిసిందే. అప్పుడు ప్రజారాజ్యం కోసం పవన్ కల్యాణ్ చాలా కష్టపడ్డాడు. ఆ తర్వాత సొంతంగా జనసేన పార్టీ పెట్టి ఇప్పుడు డిప్యూటీ సీఎం అయ్యాడు.
Also Read :అల్లు అరవింద్ కు కౌంటర్ ఇచ్చిన చిరంజీవి..!
జనసేనకు మెగా ఫ్యామిలీ ఎంత సపోర్టు చేసిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. పైగా ఒకప్పుడు ప్రజారాజ్యం పార్టీలో ఉన్న నేతలందరూ.. తిరిగి జనసేన గూటికి చేరుకున్నారు. అలా జనసేనకు బలం పెరిగింది. వాటన్నింటినీ ఉద్దేశించి చిరంజీవి ఇలా కామెంట్ చేశారని అంటున్నారు. ఇది ఒక రకంగా పవన్ కల్యాణ్ కు స్వీట్ షాక్ అని కూడా కామెంట్లు పెడుతునారు. ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో జనసేన బలమైన పార్టీగా ఎదిగేందుకు ప్రయత్నిస్తోంది.