AP Viral Infection: ఏపీలో కొత్త పురుగు వ్యాధి కలకలం సృష్టిస్తుంది. ఓ పురుగు కుట్టడంతో ఓ మహిళ అనారోగ్యానికి గురై మృతి చెందింది. భూమిపై ఉన్న స్క్రబ్ టైఫస్(Scrub typhus) అనే కీటకం కుట్టడంతో మహిళ అనారోగ్యానికి గురై మృతి చెందింది. చనిపోయిన మృతురాలు విజయనగరం జిల్లాలోని చీపురుపల్లి మండలం మెట్టపల్లి గ్రామానికి చెందిన రాజేశ్వరి (36)గా అధికారుల గుర్తించారు. అయితే ఏపీలో 1317కు పైగా ఈ స్క్రబ్ టైఫస్(Scrub typhus) పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఎపిలో ఈ వ్యాది కలకలం రేపింది. అయితే సాధారణంగా ఇ వ్యాదిసోకిన వారు యాంటి బయాటిక్స్ తో ఈ వ్యాధి నయం అవుతుందని, ఎవరైనా అస్వస్థతకు గురవ్వగానే నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్య పరీక్షలు చేయించుకోవాలని వైద్యాదికారులు సూచిస్తున్నారు.
డీఎంహెచ్ఓ సుధారాణి
స్క్రబ్ టైఫస్ కీటకం గురించి చిత్తూరు జిల్లా డీఎంహెచ్ఓ సుధారాణి వివరణనిచ్చారు. రాష్ట్రంలో స్క్రబ్ టైఫస్ కేసులో ఇప్పటివరకు చిత్తూరు జిల్లాలో 149 కేసులు నమోదయ్యాయని సుదారాణి వెల్లడించారు. చిన్న నల్లిలాంటి ప్రాణి కుట్టడం వల్ల ఈ వ్యాధి సంక్రమిస్తుందిని ఆమే స్పష్టం చేశారు. ఈ కీటకం ఓరెన్షీయా సుసుగుముసీ అనే చిన్న నల్లీలాంటి చిన్న క్రిమివల్ల ఎర్పడుతుందని ఆమే అన్నారు. ఇది ఎక్కవగా భూమీపై పాకుతూ ఉంటుందని అన్నారు. ఎవరైతే కాళ్లకు చెప్పులు లేకుండా నడిచినప్పుడు, ఎక్కువగా పోలం పనులు చేసేటపుడు బురదలో ఇది కరుస్తుందని తెలిపారు.
Also Read: Harish Rao: కాంగ్రెస్ పాలనలో రైతుల పరిస్థితి దారుణం.. మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు!
అనారోగ్య సమస్యలు
ఇ పురుగు కుట్టినప్పుడు ఓంటిపై చిన్న దురదగా ఎర్పడి తరువాత ఓల్లంతా పాకుతుందని తెలిపారు. ప్రధానంగా ఇది కుట్టినప్పుడు తలనొప్పి, జ్వరం, కండరాల నొప్పులు లాంటి అనారోగ్య సమస్యలు ఉంటాయని జ్వరం వచ్చిన వెంటనే ఆలస్యం చేయకుండా దగ్గరలోని డాక్టర్‌ను సంప్రదించాలని డీఎంహెచ్ఓ సుధారాణి తెలిపారు. సాధారణంగా ఇది కుట్టినప్పుడు చిన్న చిన్న అనారోగ్యసమస్యలు వచ్చినప్పుడే నిర్లక్ష్యం చేయకుండా వైద్యుడిని సంప్రదిస్తే చిన్నపాటి యాంటిబయాటిక్స్ తో నయం చేయవచ్చని తెలిపింది. నిర్లక్ష్యంచేస్తే ఆ రెస్పరేటరీ ఓల్లంతా స్పెడ్ అయిపోయి ప్రాణాంతకంగా మారే అవకాశం ఉందని తెలిపారు.
Also Read: Apple Phones: ఐఫోన్ యూజర్స్‌కి గుడ్‌న్యూస్.. చాట్‌జీపీటీని ఒక్క టచ్‌తో స్టార్ట్ చేయండి!
స్క్రబ్ టైఫస్ గురించి చిత్తూరు డీఎంహెచ్ఓ సుధారాణి వివరణ
స్క్రబ్ టైఫస్ కేసులో ఇప్పటివరకు జిల్లాలో 149 నమోదయ్యాయని వెల్లడి
చిన్న నల్లిలాంటి ప్రాణి కుట్టడం వల్ల ఈ వ్యాధి సంక్రమిస్తుందిని స్పష్టం
ప్రధానంగా తలనొప్పి, జ్వరం, కండరాల నొప్పులు లాంటి అనారోగ్య సమస్యలు ఉంటాయని
జ్వరం… https://t.co/FhE7UEj7HK pic.twitter.com/8qMLnFelpW
— BIG TV Breaking News (@bigtvtelugu) December 1, 2025
