Kurnool Crime: కర్నూలు జిల్లాలో క్షుద్రపూజలు కలకలం
Kurnool Crime (Image Source: Freepic)
ఆంధ్రప్రదేశ్

Kurnool Crime: క్షుద్ర పూజలతో భయపెట్టి.. ఏకంగా రూ.3 కోట్లు దోచేసిన బురిడి బాబా.. వీడు జగత్ కంత్రీ!

Kurnool Crime: క్షుద్రపూజల నేపథ్యంలో జరిగిన మోసం ఘటన ఏపీలో తీవ్ర కలకలం రేపింది. కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలో ఓ బురిడి బాబా.. పూజల పేరుతో ఓ జంట నుంచి ఏకంగా రూ.3 కోట్ల మేర దోచుకున్నాడు. కొన్నాళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్న భార్య, భర్తలు.. సమస్యల నుంచి గట్టేక్కిస్తాడని భావించి ఫేక్ బాబాను ఆశ్రయించారు. లంకె బిందెలు, అమ్మవారి విగ్రహం, క్షుద్ర పూజలు ఇలా ఏవేవో మాయ మాటలు చెప్పి దంపతులను నిలువునా దోచేశాడు.

వివరాల్లోకి వెళ్తే..

తెలంగాణలోని పెచ్చేరు ప్రాంతానికి చెందిన వెంకటయ్య, పద్మ దంపతులను ఆరోగ్య సమస్యలు వెంటాడుతున్నాయి దీంతో. కర్నూలు జిల్లా ఆదోని మండలం బైలిగేరి ప్రాంతానికి చెందిన దుర్గా సింగ్ ను ఆశ్రయించారు. అతడికి దేవుడు కనిపిస్తాడని స్థానికంగా ప్రచారం ఉండటంతో దుర్గాసింగ్ ను కలిసి తమ బాధను వెళ్లబుచ్చుకున్నారు. ఈ సందర్భంగా తనకు దివ్య దృష్టి ఉందని.. మీ పొలంలో లంకె బిందెలు ఉన్నాయని దుర్గా సింగ్ వారితో చెప్పాడు. అది తీయకపోతే మీ కుటుంబానికి ప్రాణహాని ఉంటుందని భయపెట్టాడు. అలా వారి నుంచి రూ.80 లక్షల వరకూ వసూలు చేసినట్లు సమాచారం.

పొలంలో క్షుద్రపూజలు

ఈ క్రమంలోనే ఒక రోజు ఉండవల్లి గ్రామ శివారులోని వెంకటయ్య పొలంలో దుర్గా సింగ్ క్షుద్రపూజలు నిర్వహించాడు. అక్కడ మాయ చేసి పొలం నుంచి 3 అడుగుల అమ్మవారి విగ్రహాన్ని బయటకు తీశాడు. ఆ విగ్రహాన్ని విక్రయిస్తే రూ. కోట్ల రూపాయలు వస్తాయని బాధితులను నమ్మించాడు. అంతే కాకుండా విగ్రహాన్ని కొనుగోలు చేసేందుకు విదేశాల నుంచి కొందరు దిల్లీకి వచ్చారని చెప్పి.. బాధితులను పలుమార్లు దేశరాజధానికి తీసుకెళ్లాడు. మెుత్తం ఐదు సార్లు తమను దిల్లీ చుట్టూ తిప్పాడని, విడతల వారిగా రూ.2.20 కోట్ల వరకు వసూలు చేశాడని బాధిత జంట ఆరోపించింది.

Also Read: Cyclone Ditwah: ఏపీకి దిత్వా ముప్పు.. డేంజర్‌లో ఆ జిల్లాలు.. అకస్మిక వరదలు పక్కా!

‘చంపేస్తామని బెదిరిస్తున్నారు’

చివరికీ దుర్గా సింగ్ చేతిలో మోసపోయామని గ్రహించిన వెంకటయ్య దంపతులు.. తమ డబ్బు ఇవ్వాలని అతడ్ని పట్టుబట్టాడు. దీంతో తమను చంపేస్తామని దుర్గాసింగ్ బెదిరించాడని అదోని ఎమ్మెల్యే డా. పార్థసారథి నిర్వహించిన ప్రజా దర్బార్ లో బాధితులు ఫిర్యాదు చేశారు. పోలీసులను ఆశ్రయించినా ఫలితం లేకుండా పోయిందని వాపోయారు. ఇల్లు, పొలం తాకట్టు పెట్టి మరీ డబ్బును అతడికి ఇచ్చామని పేర్కొన్నారు. దీంతో రంగంలోకి దిగిన ఎమ్మెల్యే పార్థసారథి డీఎస్పీకి ఫోన్ చేసి.. జరిగినదంతా చెప్పారు. వారం రోజుల్లో బాధితుల సమస్య పరిష్కరించాలని ఆదేశించారు.

Also Read: Renigunta Airport: రేణిగుంట ఎయిర్‌పోర్టులో ఆగిపోయిన విమానం.. ఆందోళనకు గురైన ప్యాసింజర్లు

Just In

01

Maoists surrender: వనం నుంచి జనంలోకి.. నలుగురు మావోయిస్టులు లొంగుబాటు!

Allu Arjun: తమిళ దర్శకులు అల్లు అర్జున్ కోసం ఎందుకు క్యూ కడుతున్నారు?.. రీజన్ ఇదే..

Medaram Jatara 2026: మేడారంలో భారీగా ట్రాఫిక్ జామ్.. కట్టలు తెంచుకుంటున్న భక్తుల ఆగ్రహం!

Municipal Elections: కాంగ్రెస్‌కు మున్సిపల్ ఎన్నికలు టెన్షన్ .. ఈ ఫలితాలే రాజకీయ దిశను నిర్ణయిస్తాయా?

BRS Party: మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఒంటరి పోరు.. పొత్తులు లేకుండా గెలుపు సాధ్యమా?