Bigg Boss Telugu 9: బిగ్ బాస్ తెలుగు సీజన్ (Bigg Boss Telugu Season 9) 13వ వారానికి చేరుకుంది. 13వ వారానికి సంబంధించి హౌస్‌లో నామినేషన్స్ (Bigg Boss Nominations) మొదలయ్యాయి. మండే అంటేనే నామినేషన్స్ హీట్ ఉంటుందని అందరికీ తెలిసిందే. కానీ, ఇప్పటి వరకు ఒక లెక్క, ఇప్పటి నుంచి మరో లెక్క అన్నట్లుగా హౌస్‌లో పరిస్థితి మారిపోయింది. ఎవరి స్ట్రాటజీని వారు ఆచరణలో పెట్టేస్తున్నారు. ఆదివారం దివ్య ఎలిమినేషన్ తర్వాత హౌస్‌లో మొత్తం 8 మంది మాత్రమే ఉన్నారు. ఇందులో ఈ సీజన్ గ్రాండ్ ఫినాలే చేరే టైమ్‌కి కేవలం 5గురు మాత్రమే హౌస్‌లో ఉంటారు. అంటే ముగ్గురు కంటెస్టెంట్స్ ఇంకా ఎలిమినేషన్ కావాల్సి ఉంది. దీనిని బట్టి చూస్తే ఈ వారం నామినేషన్స్ ఎంత ప్రాముఖ్యతను సంతరించుకుని ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. ఇక ఈ నామినేషన్స్‌కు సంబంధించి ఇప్పటికే బిగ్ బాస్ కొన్ని ప్రోమోలను వదిలారు.
Also Read- Jailer 2: ‘జైలర్ 2’లో గెస్ట్ రెల్ చేసేది బాలయ్య కాదట.. ఎవరంటే?
టికెట్ టు ఫినాలే కొట్టేది నేనే
ఈ ప్రోమోలలో ఒక్కొక్కరి నామినేషన్స్ చూస్తుంటే.. పైరింగ్ కనిపిస్తోంది. ఈ ఫైరింగ్ అందరూ ఊహించినదే. ‘ఇప్పటి నుంచి మీరు ఆడే ఆట, పలికే మాట.. మిమ్మల్ని ఫైనల్‌కు చేరువ అవ్వాలా? లేదా.. ఈ ఇంటి నుంచి వెనుదిరగాలా? అనేది నిర్ణయించబోతున్నాయి’ అని బిగ్ బాస్ చెప్పిన అనంతరం ఇమ్మానుయేల్ వచ్చేసి రీతూని నామినేట్ చేసి, ఆమె తలపై సీసా పగలకొట్టారు. సంజనని భరణి నామినేట్ చేస్తున్నారు. సుమన్ శెట్టిని రీతూ, పవన్‌ని భరణి నామినేట్ చేస్తున్నట్లుగా ఇప్పటికే ఒక ప్రోమో వచ్చేసింది. ఇందులో పవన్ అందరికీ ఛాలెంజ్ కూడా విసిరాడు. ఈ వారం టికెట్ టు ఫినాలే కొట్టేది కూడా నేనే అంటూ ఆయన విసిరిన ఛాలెంజ్‌తో.. ఈ వారం ఆట ఓ రేంజ్‌లో ఉండబోతుందనే హింట్ ఇచ్చినట్లయింది.
Also Read- Harshaali Malhotra: తెలుగులో ఇష్టమైన హీరోలు ఎవరంటే..? ‘బజరంగీ భాయిజాన్’ ఫేమ్ చెప్పిన పేర్లు ఇవే!
జోకూ, గీకూ బిగ్ బాస్ చెబుతారు
నామినేషన్స్ మోడ్ అంటూ వచ్చిన తాజా ప్రోమోలో.. రీతూ (Rithu) వచ్చేసి సంజనని నామినేట్ చేస్తూ.. ‘నేను గిల్లాను.. నన్ను గిల్లితే వందసార్లు గిల్లుతాను’ అంటూ నామినేట్ చేస్తుంటే.. ‘నీకు నాకు ఈ గేమ్ ముందు ఏమైనా పరిచయం ఉందా? నాకు, నీకు ఏమైనా వంశ వృక్షం దుష్మనీ ఉందా?’ అంటూ సంజన కూడా పాయింట్స్‌తో కొడుతోంది. తనూజ (Tanuja) వచ్చి ఇమ్మానుయేల్‌ను నామినేట్ చేయడానికి చూస్తూ.. కొన్ని పాయింట్స్ చెబుతూ ఎమోషనలైంది. ఆమె పాయింట్స్‌కు ఇమ్ము కూడా అంతే ఎమోషనల్ అవుతూ మాట్లాడాడు. దీంతో తనూజ తన మనసు మార్చుకుని.. ‘నా ఫస్ట్ నామినేషన్ డిమోన్ పవన్’ అని చెప్పింది. దీంతో షాకయిన పవన్.. ‘ఇప్పటి వరకు జోక్ చేశారా?’ అంటూ సీరియస్‌గా అడిగాడు. జోకూ, గీకూ బిగ్ బాస్ చెబుతారు పవన్.. నువ్వు చెప్పక్కరలేదు.. అని తనూజ అనగానే ‘నాకు జోక్ అనిపించింది’ అని పవన్ ఫైర్ అయ్యాడు. ‘అయితే నవ్వు’ అని తనూజ కూడా కౌంటర్ ఇచ్చింది. తర్వాత ఓ గేమ్ గురించి మాట్లాడుతూ.. ఆ గేమ్‌లో పవన్ తప్పేంటో చెప్పింది. అది పవన్ కూడా ఒప్పుకుంటున్నాడు. దీంతో.. రీతూ కూడా కలగజేసుకుని ఫైర్ అవుతోంది. ‘నేను టీమ్ అంటే టీమ్ కోసమే ఆడతాను’ అని పవన్ అంటుంటే.. ‘నీకోసం నువ్వు ఆడు’ అని అతని తలపై సీసా పగలకొట్టింది తనూజ. మొత్తంగా అయితే ఈ వారం నామినేషన్స్ హీట్ మాములుగా లేదనేది మాత్రం ఈ ప్రోమోలు తెలియజేస్తున్నాయి.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు
