Telangana Cabinet: సీఎం సంచలనం.. 5 మంత్రుల తొలగింపు!
Telangana Cabinet (Image Source: Twitter)
Telangana News

Telangana Cabinet: సీఎం రేవంత్ సంచలనం.. ఆ ఐదుగురు మంత్రుల తొలగింపు.. కొత్తవారికి ఛాన్స్..!

Telangana Cabinet: తెలంగాణలో మంత్రివర్గ పునః వ్యవస్థీకరణకు రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది. ప్రస్తుతం కేబినేట్ లో కొనసాగుతున్న కొందరిని తొలగించి.. వారి స్థానంలో కొత్త వారికి ఛాన్స్ ఇచ్చే యోచనలో సీఎం రేవంత్ రెడ్డితో పాటు కాంగ్రెస్ హైకమాండ్ ఉన్నట్లు సమాచారం. మరో వారం, పది రోజుల్లో కేబినేట్ లో మార్పులు జరగడం ఖాయమన్న ప్రచారం ఊపందుకుంది. అంతేకాదు మంత్రి వర్గంలో ఎవరిని తీయాలి? వారి స్థానంలో ఎవరికి అవకాశం ఇవ్వాలి? అన్న దానిపై కూడా సీఎం రేవంత్ ఒక క్లారిటీకి వచ్చినట్లు తెలుస్తోంది.

ఆ ఐదుగురు ఔట్..!

ప్రస్తుతం మంత్రివర్గంలో ఉన్న నలుగురు లేదా ఐదుగురిని తొలగించి వారి స్థానంలో కొత్తవారిని తీసుకునే అవకాశమున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతుంది. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని తొలగించి ఆయన స్థానంలో అతడి సోదరుడు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి ఛాన్స్ ఇవ్వాలని హైకమాండ్ భావిస్తున్నట్లు సమాచారం. అలాగే పొన్నం ప్రభాకర్ ను ఏఐసీసీకి పంపించి ఆయన స్థానంలో టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ను మంత్రివర్గంలోకి తీసుకునే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. అలా ఖాళీ అయిన టీపీసీసీ చీఫ్ బాధ్యతలను మంత్రి శ్రీధర్ బాబుకు అప్పగించాలని కాంగ్రెస్ యోచిస్తున్నట్లు టాక్.

విజయ శాంతికి ఛాన్స్..

మరోవైపు వివాదాలకు కేంద్ర బిందువుగా మారుతున్న మంత్రి కొండా సురేఖను సైతం పదవి నుంచి తప్పించే ఛాన్స్ అధికంగా ఉన్నట్లు సమాచారం. ఆమె ప్లేసులోకి ఉత్తమ్  కుమార్ రెడ్డి భార్య పద్మావతిని లేదా విజయశాంతిని తీసుకొనే అవకాశాలు మెండుగా ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే జూపల్లి కృష్ణారావు స్థానంలో మల్ రెడ్డి రంగారెడ్డికి అవకాశం లభించనున్నట్లు టాక్. మరోవైపు ఆది శ్రీనివాస్ ను కూడా కేబినేట్ లోకి తీసుకోవాలన్న ఆలోచనలో హైకమాండ్ ఉన్నట్లు సమాచారం. మెుత్తంగా సీఎం రేవంత్ రెడ్డి, హైకమాండ్ ఈ మార్పులు చేర్పులపై పూర్తిస్థాయిలో చర్చించి.. 10 రోజులలో కేబినేట్ పునః వ్యవస్థీకరణను పూర్తి చేసే అవకాశమున్నట్లు తెలుస్తోంది.

Also Read: Deeksha Divas: కేసీఆర్ నిరాహార దీక్షకు నేటితో 16 ఏళ్లు.. కేటీఆర్, హరీశ్, కవిత ఆసక్తికర వ్యాఖ్యలు

రెండుసార్లు కేబినేట్ విస్తరణ

ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డితో పాటు 16 మంది కేబినేట్ లో ఉన్నారు. ఇటీవల రెండుసార్లు మంత్రివర్గ విస్తరించారు. మెుదటిగా అడ్లూరి లక్ష్మణ్, వాకిటి శ్రీహరిని కేబినేట్ లోకి తీసుకున్నారు. ఇటీవల జూబ్లీహిల్స్ ఉపఎన్నికల సందర్భంగా అజారుద్దీన్ ను మంత్రివర్గంలోకి తీసుకున్నారు. అయితే త్వరలో చేయబోయే మంత్రివర్గ పునఃవ్యవస్థీకరణ వెనుక రాజకీయ వ్యూహాలు ఉన్నట్లు తెలుస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికలు, హైదరాబాద్ జీహెచ్ఎంసీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని ఈ మార్పులు చేర్పులు చేయబోతున్నట్లు సమాచారం.

Also Read: SEC Warning: గ్రామాల్లో జోరుగా ఏకగ్రీవాలు.. సర్పంచ్ సీటుకి వేలం పాటలు.. ఈసీ స్ట్రాంగ్ వార్నింగ్

Just In

01

Boora Narsaiah Goud: ఢిల్లీలో మాకో చిత్రగుప్తుడు ఉన్నాడు.. మాజీ ఎంపీ ఆసక్తికర వ్యాఖ్యలు

Rajiv Swagruha Plots: రాజీవ్ స్వగృహ ప్లాట్ల వేలానికి దరఖాస్తుల ఆహ్వానం… అప్లికేషన్ ఎలా పెట్టుకోవాలంటే

VK Naresh: ఫస్ట్ టైమ్.. నా సినిమాకు నాకే టికెట్స్ దొరకలేదు

Bhatti Vikramarka: రాబందులను దరిదాపుల్లోకి రానివ్వం.. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కీలక వ్యాఖ్యలు

Bigg Boss 9 Tamil Winner: ‘బిగ్ బాస్ తమిళ్ సీజన్ 9’ విన్నర్.. మన తెలుగు వాళ్లకీ పరిచయమే!