Lady Boss Bad Touch: ముంబయిలోని ఓ ప్రైవేటు కంపెనీలో పనిచేస్తున్న 29 ఏళ్ల వ్యక్తికి ఊహించని సమస్య ఎదురైంది. లేడీ బాస్ నుంచి తనకు ఎదురైన ఛేదు అనుభవాలను ఆ వ్యక్తి రెడ్డిట్ లో పంచుకున్నారు. ఆఫీసులో తను చూస్తున్న నరకం గురించి ఒక్కొక్కొటిగా తన పోస్టులో వివరించారు. ఈ క్రమంలో మహిళా ఉద్యోగినిపై అతడు చేసిన ఆరోపణలు నెట్టింట హాట్ టాపిక్ గా మారాయి. పురుషుల కోసం కూడా ప్రత్యేక వేధింపుల చట్టం తీసుకురావాలన్న డిమాండ్ పెద్ద ఎత్తున వినిపిస్తోంది.
అసలేం జరిగిందంటే?
29 ఏళ్ల బాధితుడు చేసిన రెడ్డిట్ పోస్టు ప్రకారం.. అతడు 6 నెలల క్రితమే కంపెనీలో చేరాడు. మహిళా ఉద్యోగిని ఫైళ్లను పరిశీలిస్తున్న పేరుతో పదే పదే తనను అసభ్యకరంగా తాకడం చేస్తోందని అతడు తెలిపాడు. మెుదట్లో అది అనుకోకుండా జరిగిందని భావించానని.. కానీ ఆమె ఉద్దేశపూర్వంగానే అలా చేస్తున్నట్లు కొద్ది రోజులకే గ్రహించానని అన్నారు. ‘ఆమె నాకు దగ్గరగా కుర్చొని నడుము, తొడలు, చేతులను అసభ్యకరంగా తాకేది. తర్వాత ఒక నవ్వు నవ్వేది. లేదంటే జోకులు వేసేది’ అని బాధిత ఉద్యోగి రెడ్డిట్ లో రాసుకొచ్చారు.
ఆమెకు పెళ్లై పిల్లలు కూడా..
లేడీ బాస్ కు అప్పటికే వివాహమైందని, ఆమెకు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారని యువ ఉద్యోగి పేర్కొన్నారు. ఉద్యోగంలో చేరి 6 నెలలే అవుతుండటం, బయట పెద్దగా ప్లేస్ మెంట్స్ లేకపోవడంతో జాబ్ మారాడానికి ధైర్యం చేయడం లేదని అతడు పేర్కొన్నాడు. ఒకవేళ ఈ విషయాన్ని బయటపెడితే ఉద్యోగ పరంగా ఒత్తిళ్లు మెుదలవుతాయన్న ఆందోళన తనకు ఉందని రెడ్డిట్ లో అభిప్రాయపడ్డాడు.
Also Read: Shocking Crime: దేశంలో ఘోరం.. భార్యను కసితీరా చంపి.. డెడ్ బాడీతో సెల్ఫీ దిగాడు
భరించ లేకపోతున్నా..
అయితే లేడీ బాస్ వేధింపులను భరించే స్థితిలో తాను లేనట్లు సదరు ఉద్యోగి వాపోయాడు. ఇప్పుడు తానేం చేయాలో సలహా ఇవ్వాలని యూజర్లను కోరాడు. లేడీ బాస్ గురించి తన ఫ్రెండ్ కు చెబితే ‘ఆనందించు’ అంటూ నవ్విసి ఊరుకున్నాడని బాధిత యువకుడు పేర్కొన్నాడు. కాగా, ఉద్యోగి సమస్యపై రెడ్డిట్ యూజర్లు స్పందించారు. ఆఫీసులో ఎదురయ్యే వేధింపుల గురించి మహిళల కోసం ‘పీఓఎస్‌హెచ్ చట్టం – 2013’ అనే ప్రత్యేక చట్టం ఉందని ఓ యూజర్ గుర్తుచేశారు. కానీ పురుషుల కోసం అలాంటి చట్టమేది లేకపోవడం బాధాకరమని అన్నారు. కెరీర్ ప్రారంభ దశలో ఉన్నందున లేడీ బాస్ వేధింపులపై ఆచితూచి అడుగు వేస్తే మంచిదని మరో యూజర్ సూచించారు.
