Naga Chaitanya: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు (Samantha Ruth Prabhu).. దర్శకుడు రాజ్ నిడిమోరు (Raj Nidimoru)ను కోయంబత్తూరులోని ఇషా యోగా సెంటర్, లింగ భైరవి ఆలయంలో సన్నిహితుల మధ్య నిరాడంబరంగా వివాహం చేసుకున్నారనే వార్త.. అలా బయటికి వచ్చిందో లేదో.. సెన్సేషనల్‌గా మారింది. భూత శుద్ధి ప్రక్రియలో జరిగిన ఈ వివాహ వేడుకకు కేవలం 30 మంది అతిథులు మాత్రమే హాజరైనట్లుగా తెలుస్తోంది. ఈ ప్రైవేట్ వేడుకలో సమంత ఎరుపు రంగు చీరలో మెరిసిపోతున్నారు. సమంత సెకండ్ మ్యారేజ్ వార్త అభిమానుల్లో ఆసక్తిని పెంచడంతో పాటు, ఆమె మాజీ భర్త నాగ చైతన్య (Naga Chaitanya)తో విడాకులకు సంబంధించి మరోసారి చర్చలు మొదలయ్యాయి. ఇంతకు ముందు నాగ చైతన్య రెండో పెళ్లి చేసుకున్నప్పుడు కూడా.. సమంత విషయంలో ఇలాగే వార్తలు వైరల్ అయ్యాయి. ఇప్పుడు సమంత రెండో పెళ్లి చేసుకోవడంతో.. నాగ చైతన్య గతంలో విడాకులకు సంబంధించి మాట్లాడిన వీడియోలు వైరల్ అవుతున్నాయి.
Also Read- Bigg Boss Telugu 9: తనూజ, ఇమ్ము ఏడిపించారు కదయ్యా.. జోక్ అంటారేంటి? ఫైరింగ్ నామినేషన్స్
విడాకులపై నాగ చైతన్య ఏమన్నారంటే?
సమంత వివాహ నేపథ్యంలో, నాగ చైతన్య గతంలో ఓ పాడ్‌క్యాస్ట్‌లో చేసిన వ్యాఖ్యలు మళ్ళీ వార్తల్లోకి వచ్చాయి. ‘తండేల్’ చిత్ర ప్రమోషన్స్ సమయంలో ఆయన సమంతో విడాకుల గురించి స్పందించారు. ‘‘మా ఇద్దరికీ జీవితంలో ఎవరికి ఇష్టమైన దారిలో వాళ్ళు వెళ్లాలని అనిపించింది. దాని కారణంగానే విడాకుల నిర్ణయం తీసుకున్నాం. మేము ఒకరిపై ఒకరం గౌరవంతో జీవిస్తున్నాము. దీనికి మించిన వివరణ అవసరమని నేను అనుకోవడం లేదు. మేమిద్దరం మా జీవితాలలో మేము ఎన్నుకున్న మార్గంలో ముందుకు వెళ్తున్నాం. నేను మళ్లీ ప్రేమను పొంది సంతోషంగా ఉన్నాను, సమంత కూడా తన జీవితంలో ముందుకు వెళ్లింది. మేమిద్దరం ఒకరినొకరు గౌరవించుకుంటున్నాం. ఇది నా వ్యక్తిగత జీవితంలో జరిగిన విషయం. నన్ను ఏదో నేరం చేసినట్లుగా చూడవద్దు’’ అని మీడియా, అభిమానులను నాగ చైతన్య ఈ ఇంటర్వ్యూలో అభ్యర్థించారు. ఇప్పుడా మాటలు బాగా వైరల్ అవుతున్నాయి.
Also Read- Tollywood: రషా తడానీ, హర్షాలి.. నెక్ట్స్ టాలీవుడ్‌ను ఊపేసే భామలు వీరేనా?
ఇద్దరి మంచి కోసమే ఆ నిర్ణయం
విడాకులు హఠాత్తుగా తీసుకున్న నిర్ణయం కాదని, ఆలోచించి తీసుకున్నట్టు చైతన్య అప్పట్లోనే స్పష్టం చేశారు. ‘‘నేను ఆల్రెడీ విడిపోయిన కుటుంబంలో పుట్టాను. అందుకే బంధం విడిపోతే ఎదురయ్యే పరిణామాలు నాకు తెలుసు. ఇద్దరి మంచి కోసమే ఈ నిర్ణయం తీసుకున్నాం. కాబట్టి బాధపడాల్సిన అవసరం లేదు. ప్రతిదీ ఒక కారణం కోసమే జరుగుతుంది. జీవితంలో ముందుకు సాగితే సరైన దారి దొరుకుతుంది. నా విషయంలో అదే జరిగిందని నేను భావిస్తున్నాను’’ అని ఆయన తన భావాలను పంచుకున్నారు. ‘ఏ మాయ చేశావే’ (2010) సినిమాతో మొదలైన నాగ చైతన్య-సమంత ప్రేమాయణానికి.. 2017లో హిందూ, క్రైస్తవ సంప్రదాయాల్లో జరిగిన పెళ్లిళ్లతో తెరపడి ఇద్దరూ వివాహబంధంలోకి అడుగు పెట్టారు. దాదాపు నాలుగు సంవత్సరాలు పాటు కలిసున్న ఈ జంట.. 2021లో విడిపోతున్నట్లు ప్రకటించి అభిమానులకే కాదు.. అందరికీ షాక్ ఇచ్చారు. ఆ తర్వాత శోభిత ధూళిపాలను చైతన్య వివాహం చేసుకోగా, సమంత ఇప్పుడు ‘ది ఫ్యామిలీ మ్యాన్’ దర్శకుడు రాజ్ నిడిమోరును వివాహమాడారు.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు
