Realme P4x 5G: రియల్‌మీ P4x 5G ధరలు ఇవే..
Realme ( Image Source: Twitter)
Technology News

Realme P4x 5G: భారత లాంచ్ ముందే రియల్‌మీ P4x 5G డీటెయిల్స్ లీక్

Realme P4x 5G: రియల్‌మీ తన కొత్త స్మార్ట్‌ఫోన్ P4x 5Gను భారత్‌లో 4 డిసెంబర్‌కి ఆఫీషియల్‌గా విడుదల చేయడానికి సిద్ధమవుతోంది. తాజాగా బయటకు వచ్చిన లీక్‌ల ప్రకారం, ఫోన్ ధరలు కూడా ముందే అంచనా వేయవచ్చునని తెలుస్తోంది. ఇప్పటికే రియల్‌మీ ప్రాసెసర్, బ్యాటరీ సామర్థ్యం, కలర్ ఆప్షన్లు వంటి ముఖ్య ఫీచర్లను ప్రకటించింది.

భారతీయ మార్కెట్లో ఈ ఫోన్ ప్రారంభ ధర రూ. 15,999 నుంచి ఉండే అవకాశం ఉంది. ఈ ఎంట్రీ-లెవెల్ వేరియంట్ 6GB RAM, 128GB స్టోరేజ్‌తో వస్తుంది. 8GB RAM + 128GB స్టోరేజ్ వేరియంట్ రూ.17,499లో, టాప్-ఎండ్ 8GB RAM + 256GB స్టోరేజ్ మోడల్ రూ. 19,499లో లభించే అవకాశం ఉంది. ఈ ఈవెంట్‌లో Realme Watch 5ను కూడా ప్రకటించవచ్చని అంచనాలు ఉన్నాయి. ఫ్లిప్‌కార్ట్, రియల్‌మీ ఇప్పటికే ఫోన్ కోసం టీజర్ పేజీలు ప్రారంభించాయి.

Also Read: Samantha Wedding: మళ్లీ తెరపైకి సమంత పెళ్లి వ్యవహారం.. నేడు పెళ్లి అంటూ వార్త వైరల్.. రాజ్‌ మాజీ భార్య షేర్ చేసింది ఇదే..

స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్లు

P4x 5G MediaTek Dimensity 7400 Ultra చిప్‌ సెట్ తో వస్తుంది. డైనమిక్ RAM 18GB వరకు సపోర్ట్ చేస్తుంది. 7,000 mAh బ్యాటరీతో 45W వైర్డ్ చార్జింగ్ కూడా కలిపి వస్తుంది. ఫోన్ గ్రీన్, పింక్, వైట్ కలర్ ఆప్షన్‌లలో లభిస్తుంది. 50MP ప్రధాన కెమెరా AI-ఫీచర్లతో వస్తుంది. హీట్ డిసిపేషన్ కోసం 5,300 sq mm వేపర్ చాంబర్ ఉంది, ఇది హార్డ్ యూజ్ సమయంలో పనితీరును మెరుగుపరుస్తుంది. డిస్‌ప్లే 144Hz రిఫ్రెష్ రేట్, 1,000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌ను అందిస్తుంది.

Also Read: Marries Dead Lover: ప్రియుడి మృతదేహాన్ని పెళ్లాడిన యువతి.. చంపింది ఆమె కుటుంబ సభ్యులే.. కన్నీటి విషాద ప్రేమగాథ

గత లీక్‌ల ప్రకారం, P4x 5G 6.72 అంగుళాల ఫుల్ HD+ స్క్రీన్ కలిగి ఉండవచ్చు. రియర్‌లో 2MP సెకండరీ కెమెరా, ఫ్రంట్‌లో 8MP కెమెరా ఫీచర్లు ఉండే అవకాశం ఉంది. డిసెంబర్ 4న జరుగనున్న ఆఫీషియల్ లాంచ్ ఈవెంట్ లో స్పెసిఫికేషన్లు, ఫీచర్లు, ధరలను అధికారికంగా వెల్లడించనుంది. మొత్తంగా, రియల్‌మీ P4x 5G భారత మార్కెట్లో బడ్జెట్ ఫ్రెండ్లీ 5G స్మార్ట్‌ఫోన్‌గా వినియోగదారులను  ఆకర్షించనుంది.

Just In

01

Mobile Phone Addiction: ఇదో విచిత్రమైన ఆఫర్.. సెల్ ఫోన్ చూడకపోతే ప్రైజ్ మీ సొంతం..!

Potatoes: బంగాళదుంపలు ఇష్టమని అతిగా లాగిస్తున్నారా.. అయితే, డేంజర్లో ప‌డ్డట్టే?

Delhi Hospital: ఆస్పత్రిలో అమానుషం.. చనిపోయిన పేషెంట్ నగలు మాయం.. సీసీటీవీలో షాకింగ్ దృశ్యాలు

Naga Chaitanya: సమంతతో విడాకులపై నాగ చైతన్య షాకింగ్ కామెంట్స్.. ఇప్పుడిదే టాక్!

Realme P4x 5G: భారత లాంచ్ ముందే రియల్‌మీ P4x 5G డీటెయిల్స్ లీక్