CM Chandrababu: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అందుబాటులోకి వచ్చింది. దీనికి స్త్రీ శక్తి పథకం అని పేరు పెట్టారు. ఈ పథకం ముఖ్య అద్దేశం రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలు, బాల బాలికలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచింతగా ప్రయాణం చేయడం కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టింది. అయితే ఫ్రీ బస్సు పథకం పై సీఎం చద్రబాబు నాయుడు మహిళలను ఉద్దేశించి కొన్ని వ్యాక్యలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న స్త్రీ శక్తి ఫ్రీ బస్సు పథకం పై కీలక వ్యాఖ్యలు చేశారు.
అనవసరంగా తిరగ వద్దు..
రాష్ట్రంలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సదుపాయం కలిగించినప్పటికి, దీనిని అనవసర ప్రయాణాలకు ఉపయోగించవద్దు అని సీఎం చంద్రబాబు అన్నారు. మోన్న నేను చూశాను ఆర్టీసీ బస్సుల్లో పురుషులకంటే మహిళలే ఎక్కువగా ఉన్నారని సీఎం అన్నారు. మహిళలకు ఫ్రీ బస్సు సదుపాయం ఉన్నందున మహిళలు అనవసరంగా తిరగొద్దని సూచించారు. మీకు అవసరమైనప్పుడు మాత్రమే బస్సుల్లో ప్రయాణం చేయండని, మీ పుట్టింటికి లేదంటే అత్తగారిటికి వాడండని అన్నారు. ఫ్రీ బస్సు పథకం మీ సౌకర్యం కోసం, సమాజ అభివృద్ధి కోసం ప్రవేశపెట్టామని సీఎం అన్నారు.
స్త్రీ శక్తి పథకం సూపర్ సక్సెస్..
రాష్ట్రంలో స్త్రీ శక్తి పథకం సూపర్ సక్సెస్ అయ్యింది. ఊహించని స్థాయిలో ఆ పథకానికి స్పందన వచ్చిందని అన్నారు. నేటి వరకు అసాధ్యంగా అనిపించిన పనిని మన ప్రభుత్వం సుసాధ్యం చేశామని చంద్రబాబు అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ బస్సుల్లో మహిళలు పెద్ద సంఖ్యలో ప్రయాణిస్తున్నారని అన్నారు. దీని వలన రాష్ట్రంలో విద్య, ఉద్యోగం, ఆరోగ్యం, వ్యాపారం వంటి అనేక రంగాల్లో మహిళలకు లబ్ధి కలుగుతోందని సీఎం కోనియాడారు. ఈ పథకం అమలులోకి వచ్చిన తర్వాత బస్సుల్లో ప్రయాణించే మహిళల సంఖ్య రెట్టింపు అయ్యిందని, ముఖ్యంగా రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో చదువుకోడానికి, ఉద్యోగాలకు వెళ్లే మహిళలు ఈ పథకాన్నిచాలా ఉపయోగించుకుంటున్నారని సీఎం అన్నారు.
అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తున్నాం..
మహిళల శక్తే సమాజానికి బలం అని, వారికి రవాణా భారాన్ని తగ్గించడం ద్వారా చదువు, ఉద్యోగం, వ్యాపారం, ఆరోగ్యం వివిధ రంగాల్లో ముందుకు తీసుకెళ్లడమే మా లక్ష్యం అని సీఎం చంద్రబాబు అన్నారు. ఫ్రీ బస్సు పథకం ద్వారా అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తున్నామని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. ఫ్రీ బస్సు పథకం వచ్చాక రాష్ట్రంలో మహిళలకు కొంత సౌకర్యం కల్పించినప్పటికీ, సీఎం చంద్రబాబు చేసిన సూచనల ప్రకారం దీనిని అవసరమైనప్పుడు మాత్రమే వినియోగించడం ద్వారా సమాజానికి కొంత మేలు చేస్తుందని, రద్దీని తగ్గించడానికి కొన్ని సూచనలుగా పరిగనించవచ్చు.
Also Read: Kantara Chapter 1: ‘కాంతార: చాప్టర్ 1’కు టికెట్ రేట్లు పెంచిన ఏపీ ప్రభుత్వం.. ఎంత పెంచారంటే..?