CM Revanth Reddy (imagecredit:twitter)
తెలంగాణ, హైదరాబాద్

Revanth Reddy: జూబ్లీహిల్స్‌లో గెలుపు స్ట్రాటజీ.. ప్రణాళిక ప్రతిపాదనలకు సీఎం గ్రీన్ సిగ్నల్!

CM Revanth Reddy: గ్రేటర్ హైదరాబాద్ లో కీలక నియోజకవర్గంగా పేరొందిన జూబ్లీహిల్స్ లో తన సత్తా చాటేందుకు కాంగ్రెస్(Congress) వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తున్నది. డివిజన్ ల వారీగా డెవలప్ మెంట్ లపై ఇటీవల స్థానిక నేతలు ఇచ్చిన ప్రణాళిక, ప్రతిపాదనలకు సీఎం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. ఇప్పటికే సుమారు రూ. 200 కోట్లతో నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం, ఎన్నికల తర్వాత దాదాపు మరో రూ.300 కోట్లను నియోజకవర్గం అభివృద్ధికి వినియోగించేలా కాంగ్రెస్ నేతలు సర్కార్ ముందు ప్రపోజల్ పెట్టారు. దీనిపై సర్కార్ సానుకూలంగా ఉన్నట్లు స్థానిక నేతలు వివరించారు. ఏళ్ల తరబడి నుంచి నెలకొన్న పెండింగ్ సమస్యలు, కొత్త ప్రోగ్రామ్స్ తో పాటు ఉద్యోగ, ఉపాధి వంటి అంశాలకు ప్రాధాన్యత ఇవ్వనున్నారు. ప్రధానంగా బస్తీలు, కాలనీల డెవలప్ మెంట్ తో పాటు ఉమెన్ సెప్టీ వంటి అంశాల్లో ప్రయారిటీ ఇస్తూ కొత్త కార్యక్రమాలకు ప్రభుత్వం శ్రీకారం చుట్టనున్నది. ఇప్పటికే జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో మూడు సర్వేలు నిర్వహించిన కాంగ్రెస్, సర్వే టు సర్వే తన గ్రాప్ ను పెంచుకుంటూ ముందుకు సాగింది. దీంతో ఈ ఉప ఎన్నికల్లోనూ హస్తం తన సత్తా చాటుతుందని కాంగ్రెస్ లీడర్లు ధీమాను వ్యక్తం చేస్తున్నారు. ఒక‌వైపు డివిజన్ల వారీగా జ‌రుగుతున్న అభివృద్ధి ప‌నులు, మ‌రోవైపు అర్హుల

సీఎం స్పెషల్ ఫోకస్…

ఇటీవ‌ల కురిసిన భారీ వ‌ర్షాల‌కు జూబ్లీహిల్స్ ప‌రిస‌ప‌రాలు జ‌ల‌మ‌యం కాగా, సీఎం రేవంత్ రెడ్డి ఆక‌స్మికంగా పర్యటించి స్థానికుల సమస్యలను ద‌గ్గరుండి తెలుసుకున్నారు. జూబ్లీహిల్స్ నియోజ‌క‌వ‌ర్గాన్ని ప‌ట్టిపీడిస్తున్న డ్రైనేజీ, నీటికొర‌త‌, రోడ్లు, గ్రేవ్‌యార్డ్ వంటి సమస్యలకు శాశ్వత ప‌రిష్కారం చూపేలా ఇంచార్జ్ మంత్రుల‌ను ఆదేశించారు. దీంతో ముగ్గురు మంత్రులు నిత్యం క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ అభివృద్ధి ప‌నులు ప్రారంభం, శంకుస్థాప‌న‌లు చేస్తున్నారు. 20 మంది కార్పొరేషన్ చైర్మన్లు నిత్యం క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ జెండాను ఎగురవేసేందుకు ప్రయత్నిస్తున్నారు. సీఎం కూడా ప్రత్యేకంగా ఫోకస్ పెట్టి, ఆ నియోజకవర్గాన్ని ప్రభావితం చేయగలిగిన వ్యక్తులు, వ్యాపారవేత్తలు, చిత్రపరిశ్రమలోని ముఖ్యులతో టచ్ లో ఉన్నారు. సమస్యలు, డెవలప్ మెంట్ కు తానే భరోసా అంటూ హమీ ఇవ్వడం గమనార్హం.

Also Read: OTT Movie: ఒంటరితనానికి గురైన చిన్నారి.. ఆ రహస్యం కోసం ఏం చేశాడంటే?

ఇటీవల వరుసగా శంకుస్థాపనలు..

యూసుఫ్‌గూడ, వెంగ‌ళ‌రావు న‌గ‌ర్‌ డివిజన్‌లో రూ.11 కోట్ల వ్యయంతో అభివృద్ధి ప‌నులు ప్రారంభించారు. ఎర్రగడ్డ డివిజన్‌లో రూ.2.94 కోట్ల వ్యయంతో భరత్ నగర్, నేతాజీ నగర్, సుల్తాన్ నగర్, ప్రేమ్ నగర్‌ల‌లో సీసీ రోడ్ల పనులకు శంకుస్థాపన చేశారు. ఇంజినీర్స్ కాలనీ, నవోదయ కాలనీ, కమలాపురి కాలనీ, మారుతి నగర్‌లో రూ.1.78 కోట్ల వ్యయంతో సీసీ రోడ్ల పనులు ప్రారంభించారు. అలాగే, వినాయ‌క న‌గ‌ర్‌, లేబర్ అడ్డా రోడ్డులోని యూసుఫ్‌గూడ బస్తీ, ఎల్ఎన్ నగర్, కృష్ణ నగర్, హైలం కాలనీలలో రూ.2 కోట్లతో 20 పనులకు శంకుస్థాపన,నిత్యం వ‌ర‌ద ముంపున‌కు గుర‌య్యే కృష్ణానగర్‌కు మోక్షం కల్పించేలా డ్రైనేజీ పనులను ప్రారంభించారు. వెంక‌ట‌గిరి, పూర్ణా టిఫెన్ సెంట‌ర్ ప‌రిస‌రాల‌ ముంపు ప్రాంతాల్లో ఇటీవ‌ల హైడ్రా క‌మిష‌న‌ర్ రంగ‌నాథ్ పర్య టించి స‌మ‌స్య పరిష్కారానికి ప్రణాళికలు రూపొందిస్తున్నారు. మైనారిటీల గ్రేవ్‌యార్డ్ స‌మ‌స్య ప‌రిష్కారానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలతో వ‌క్ఫ్ బోర్డ్ ఛైర్మెన్‌ అజ్మతుల్లా మూడు ప్రత్యామ్నాయ ప్రాంతాల‌ను ప‌రిశీలించారు. మైనారిటీల మ‌నోభావాల‌కు అనుగుణంగా స‌మ‌స్య ప‌రిష్కారానికి కృషి చేస్తున్నారు. ఇవికాకుండా కొన్ని ప్రాంతాల్లో సీసీ రోడ్ల నిర్

సంక్షేమం, సాధికారతకు ప్రాధాన్యం:

అభివృద్ధి పనులతో పాటు, కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాల ద్వారా కూడా జూబ్లీహిల్స్‌ ప్రజలకు మ‌రింత చేరువ అయ్యే ప్రయత్నం చేస్తుంది. కొత్త రేష‌న్‌కార్డుల పంపిణీకి శ్రీకారం చుట్టింది. త‌ద్వారా ప్రజలకు సన్న బియ్యం, 200 యూనిట్ల ఉచిత క‌రెంటు, స‌బ్సీడీ గ్యాస్‌, ఆరోగ్య శ్రీ కార్డుల మంజూరును వేగవంతం చేసింది. చిత్ర ప‌రిశ్రమలో ప‌నిచేసే కార్మికులు ఈ నియోజ‌క‌వ‌ర్గంలో అధికంగా ఉండ‌డంతో ప్రభుత్వ సంక్షేమ ప‌థ‌కాల‌కు స్థానికంగా పెద్దఎత్తున స్పంద‌న ల‌భిస్తోంది. సినీ పరిశ్రమలో వేత‌నాల పెంపున‌కు కార్మికులు స‌మ్మెకు దిగిన‌ప్పుడు ప్రభుత్వం పెద్దన్న పాత్ర పోషించి వారి వేత‌నాలు పెరిగేలా కృషి చేసింది. దీంతో కాంగ్రెస్ ప్రభుత్వం వారంద‌రి మ‌న్ననలు పొందింది. ఈ ర‌కంగా కాంగ్రెస్ ప్రభుత్వం జూబ్లీహిల్స్‌లో అన్ని సామాజిక – శ్రామిక వ‌ర్గాలకు అండ‌గా నిలుస్తూ వారి అభ్యున్నతికి కృషి చేస్తోంది.

గతంలో సమస్యల కుప్పు…

గతంలో బీఆర్ఎస్ చేసిన ద్రోహంపై జూబ్లీహిల్స్‌ ప్రజలు ఆగ్రహంతో ఉన్నట్లు కాంగ్రెస్ నేతలు చెప్తున్నారు. కృష్ణాన‌గ‌ర్‌లో అస్తవ్యస్తమైన డ్రైనేజీ వ్యవస్థ, రహ‌మ‌త్‌న‌గ‌ర్ డివిజ‌న్‌లో ధ్వంస‌మైన‌ రోడ్లు, ట్రాఫిక్ సమస్య లు, ర‌హ‌మ‌త్‌న‌గ‌ర్‌లో మైనారిటీల గ్రేవ్‌యార్డ్ స‌మ‌స్యలను బీఆర్ఎస్ ప‌దేళ్ల పాటు ప‌ట్టించుకోలేదనే విమర్శలు కాంగ్రెస్ నుంచి వినిపిస్తుంది. చిన్నపాటి వ‌ర్షానికే రోడ్లు జ‌ల‌మ‌యం అవడం, నాళాలు పొంగిపొర్లడం ఈ నియోజ‌క‌వ‌ర్గంలో నిత్యం క‌నిపించే దృష్యాలుగా క్షేత్రస్థాయి నేతలు వివరిస్తున్నారు. ముఖ్యంగా రోజువారీ ప‌నులు చేసుకొనే పేద‌లు అధికంగా ఉన్న ఈ నియోజ‌క‌వ‌ర్గంలో గ‌త ప్రభుత్వం క‌నీసం రేష‌న్‌కార్డులు కూడా ఇవ్వలేదని స్థానిక కాంగ్రస్ నేతలు మండిపడుతున్నారు. కానీ ఇక్కడి సమస్యలను సీఎం కు విన్నపించగానే పరిష్కారాలకు మార్గం చూపడంతో పాటు నిధులు కూడా భారీగా కేటాయిస్తున్నట్లు స్థానిక లీడర్లు చెబుతున్నారు.

Also Read; Tariff on Movies: సినీ ఇండస్ట్రీకి ట్రంప్ షాక్.. సినిమాలపై 100 శాతం టారిఫ్ విధింపు

Just In

01

OG New Updates: పవన్ కళ్యాణ్ ‘ఓజీ’ న్యూ అప్డేట్స్.. మళ్లీ థియేటర్లకు క్యూ కట్టాల్సిందే!

Wedding tragedy: 35 ఏళ్ల మహిళను పెళ్లాడిన 75 ఏళ్ల తాత.. తెల్లారేసరికి కన్నుమూత

Local Body Elections: నోటిఫికేషన్ వచ్చేలోగా.. రిజర్వేషన్ల ప్రక్రియలో మార్పులు చేర్పులు?

Aaryan Teaser: విష్ణు విశాల్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ ‘ఆర్యన్’ టీజర్ ఎలా ఉందంటే..

Localbody Elections: స్థానిక ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపికకు బీజేపీ వ్యూహం ఇదేనా?