Thummala Nageswara Rao (image CREDIT: TWITTER)
తెలంగాణ

Thummala Nageswara Rao: అక్టోబర్ నుంచి పత్తికొనుగోళ్లు చేపట్టాలి.. కేంద్రానికి మంత్రి తుమ్మల లేఖ.. ఏం చెప్పారంటే?

Thummala Nageswara Rao: రాష్ట్రంలో అక్టోబర్ 1 నుంచి పత్తి కొనుగోళ్లు చేయాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు  (Thummala Nageswara Rao) కేంద్రాన్ని కోరారు. కేంద్ర జౌళిశాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ కు లేఖ రాశారు. తెలంగాణలో సీసీఐ పత్తి కొనుగోళ్లు చేసేలా చర్యలు తీసుకోవాలని లేఖలో కోరారు. రాష్ట్రంలో ఈ సీజన్‌లో 43.29 లక్షల ఎకరాల్లో పత్తి సాగైందని, సుమారు 24.70 లక్షల మెట్రిక్ టన్నుల పత్తి ఉత్పత్తి అయ్యే అవకాశం ఉందన్నారు. పత్తి సాగు చేసేవారిలో ఎక్కువ శాతం చిన్న, సన్నకారు రైతులే ఉన్నారని, వీరి జీవనోపాధి ఎంఎస్పీ కొనుగోళ్లపైనే ఆధారపడి ఉందని వివరించారు. ప్రస్తుత సీజన్‌లో సీసీఐ రెండు సార్లు టెండర్లు పిలిచినా, కొత్త మార్గదర్శకాలలో ఉన్న కొత్త నిబంధనలు కారణంగా జిన్నింగ్ మిల్లర్లు పాల్గొనడం లేదని, దాంతో పత్తి కొనుగోలు నిలిచిపోయని, రైతులు నష్టపోతున్నారని కేంద్రాన్ని కోరారు.

 Also Read: OTT Movie: విడిపోయిన ప్రేమ జంట అనూహ్యంగా అలా పట్టుబడితే.. ఏం చేశారంటే?

రైతులు డిస్ట్రెస్ సేల్స్‌కి గురయ్యే ప్రమాదం

గతేడాది 2024-25 విజయవంతంగా అమలైన విధానాన్నే కొనసాగించాలని తెలంగాణ కాటన్ మిల్లర్స్ అండ్ ట్రేడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కోరుతోందని, ముఖ్యంగా ఎల్-1, ఎల్-2 అలాట్మెంట్లు, లింట్ రికవరీ శాతం, ఫోర్ట్‌నైట్ వారీగా జోన్లవారీ లింట్ శాతం నిర్ణయం, రైతుల స్లాట్ బుకింగ్, ఏరియా మ్యాపింగ్ అంశాలపై అభ్యంతరాలు వ్యక్తం చేశారని వివరించారు. ప్రస్తుతం రాష్ట్రంలో పత్తి ధర క్వింటాల్‌కు మార్కెట్ లో ₹6,700 మాత్రమే ఉందని, ఇదిఎంఎస్పీ అయిన ₹8,110 కంటే ₹1,410 తక్కువగా ఉందని, ఇలాంటి పరిస్థితుల్లో రైతులు డిస్ట్రెస్ సేల్స్‌కి గురయ్యే ప్రమాదం ఉందని మంత్రి ఆ లేఖలో ఆందోళన వ్యక్తం చేశారు.

మానిటరింగ్ కమిటీలు ఏర్పాటు చేయాలి

రైతుల పత్తి కొనుగోళ్లు సక్రమంగా జరిగేందుకు ప్రతి కొనుగోలు కేంద్రంలో స్థానిక మానిటరింగ్ కమిటీలు ఏర్పాటు చేయాలని రాష్ట్ర మార్కెటింగ్ శాఖ అధికారులను మంత్రి ఆదేశించారు. ఈ కమిటీలు తేమ శాతం, నాణ్యత, తూకం, ధరల విషయంలో రైతులకు ఎలాంటి అన్యాయం జరగకుండా పర్యవేక్షించాలన్నారు. రైతుల సమస్యల పరిష్కారం కోసం టోల్ ఫ్రీ నంబర్ 1800 599 5779, వాట్సాప్ హెల్ప్‌లైన్ 88972 81111 కొనసాగుతాయని తెలిపారు.

కమాండ్ కంట్రోల్ రూం సెంటర్ ఏర్పాటు చేయాలి

ప్రతి కొనుగోలు కేంద్రం , జిన్నింగ్ అండ్ ప్రాసెసింగ్ మిల్లులలో సీసీ కెమెరాలు తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని, రోజువారి క్రయ విక్రయాలను పరిశీలించేందుకు డైరెక్టరేట్ లో కమాండ్ కంట్రోల్ రూం సెంటర్ ఏర్పాటు చేయాలన్నారు. గోదాముల నుంచి మిల్లులకు పత్తి రవాణాలో ఎలాంటి ఆటంకాలు రాకుండా చర్యలు తీసుకోవాలన్నారు. రైతులకు ఎంఎస్పీ హామీగా అందించడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యం అని , పత్తి రైతులు ఎటువంటి ఇబ్బందులు పడకుండా, పారదర్శకంగా మరియు వేగంగా కొనుగోళ్లు జరిగేలా అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. సీసీఐ, మార్కెటింగ్ శాఖ, జిల్లా కలెక్టర్లు, రైతు సంఘాలు సమన్వయంతో పనిచేస్తే ఈ సీజన్ విజయవంతమవుతుందన్నారు.

 Also Read: OG collections: ‘ఓజీ’ నాలుగో రోజు గ్రాస్ ఎంతో తెలిస్తే ఫ్యాన్స్‌కు పూనకాలే.. ఆ రికార్డులు బ్రేక్..

Just In

01

Guvvala Balaraju: జన గర్జనతో గర్జించిందేంటి?.. కేటీఆర్ పై గువ్వల బాలరాజు ఫైర్!

India vs Pakistan: టీమిండియా తొండి చేసింది.. ఎవరూ ఆ జట్టుతో ఆడొద్దు.. పాక్ మాజీ ఆటగాడి పిలుపు

Kavitha: స్థానికంలో జాగృతి పోటీ?.. క్షేత్రస్థాయిలో కేడర్‌ను సిద్ధం చేయాలనే యోచన

Jupally Krishna Rao: అబద్దాలపై బతకడం కేటీఆర్‌కు అలవాటు.. మంత్రి జూపల్లి కీలక వ్యాఖ్యలు!

Non Veg Shops Closed: మాంసం ప్రియులకు షాక్.. చికెన్, మటన్ షాపులు బంద్.. జీహెచ్ఎంసీ అధికారిక ప్రకటన