OG collections: తెలుగు సినిమా పరిశ్రమలో ‘పవర్ స్టార్’ పవన్ కల్యాణ్ అభిమానులకు ఓజీ సినిమాతో మరో ఫీస్ట్ వచ్చింది. ఈ సినిమా కలెక్షన్ల పరంగా బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతుంది. దీనికి సంబంధించిన పోస్టర్ ను నిర్మాతలు విడుదల చేశారు. ఈ సినిమా నాలుగో రోజులుకు ప్రపంచ వ్యాప్తంగా రూ.252 కోట్లు వసూలు చేసింది. దీనిని చూసిన అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. సుజీత్ డైరెక్షన్‌లో తెరకెక్కిన ‘ది కాల్ హిమ్ ఓజీ’ (OG) సినిమా విడుదలైన రోజు నుంచే భారీ కలెక్షన్లతో బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బాస్టర్ టాక్ తో దూసుకుపోతుంది. సెప్టెంబర్ 25న విడుదలైన ఈ సినిమా, నాలుగో రోజుకు (సెప్టెంబర్ 29) రూ.252 కోట్ల రూపాయల గ్రాస్ వసూలు చేసి, 2025లోనే అత్యంత వేగవంతమైన బ్లాక్‌బస్టర్‌గా మారింది. ఇది పవన్ కల్యాణ్ కెరీర్‌లోనే అత్యధిక ఓపెనింగ్ వీకెండ్ కలెక్షన్‌గా చరిత్ర సృష్టించింది.
Read also-Movie Piracy Racket: దేశంలోనే అతిపెద్ద పైరసీ రాకెట్ గుట్టు రట్టు.. వెలుగులోకి సంచలన నిజాలు
రోజువారీ కలెక్షన్స్
సినిమా విడుదలైన మొదటి రోజు నుంచే ‘ఓజీ’ బాక్సాఫీస్‌ను కుమ్మెస్తుంది. ప్రీమియర్ షోలతో పాటు ఓపెనింగ్ డేలో ఇండియా నెట్ 63.75 కోట్లు, వరల్డ్‌వైడ్ గ్రాస్ రూ.154 కోట్లు వసూలు చేసింది. ఇది రజనీకాంత్, లోకేష్ కనగరాజ్ కాంబినేషన్ ‘కూలీ’ సినిమా ఓపెనింగ్‌ను దాటి, 2025లో ఇండియన్ సినిమాల్లో అత్యధిక డే-1 కలెక్షన్ వచ్చిన సినిమాగా రికార్డును సృష్టించింది. రెండో రోజు కొంచెం డిప్ వచ్చినా, రూ.18.45 కోట్లు ఇండియా నెట్ సాధించింది. వీకెండ్‌లో స్థిరంగా రూ.18.5, రూ.18.4 కోట్లు వసూలు చేసి, ఓపెనింగ్ వీకెండ్‌లో మొత్తం 140 కోట్లకు పైగా ఇండియా నెట్ చేసింది. నాలుగో రోజు కూడా మంచి ట్రెండ్ కొనసాగుతూ, మొత్తం వరల్డ్‌వైడ్ గ్రాస్‌ను రూ.252 కోట్లకు చేర్చేసింది. ఇండియాలో దాదాపు 168 కోట్ల గ్రాస్, ఓవర్సీస్ మార్కెట్ల నుంచి 84 కోట్లు వచ్చాయి. ఇది సినిమా గ్యాంగ్‌స్టర్ యాక్షన్ డ్రామాగా ఆకట్టుకుని, పవన్ కల్యాణ్ మాస్ ఇమేజ్‌ను మరింత పెంచింది.
When cyclone strikes…
Bow down to the tide…
When #OG comes you run and hide!!252Cr+ Worldwide Gross in 4 days 🔥#BoxOfficeDestructorOG #TheyCallHimOG pic.twitter.com/HGo96vPES4
— DVV Entertainment (@DVVMovies) September 29, 2025
Read also-Asia Cup 2025: పాక్‌పై సూపర్ విక్టరీ.. ట్రోఫీ తీసుకునే వేళ హైడ్రామా.. ఇది కదా టీమిండియా అంటే!
సినిమా గురించి
సుజిత్ డైరెక్షన్‌లో ఈ సినిమా, పవన్ కల్యాణ్‌ను గ్యాంగ్‌స్టర్ ‘ఓజీ’ క్యారెక్టర్‌లో చూపించింది. ఇమ్రాన్ హష్మీ, ప్రియాంక మోహన్, అర్జున్ దాస్ వంటి తారలు కీలక పాత్రల్లో సత్తా చూపారు. బాంబ్ బ్లాస్ట్ సీన్స్, ఎమోషనల్ ట్విస్ట్‌లు, పవన్ స్టైలిష్ డైలాగ్స్‌తో పాటు, థమన్ అందించిన సంగీతం సినిమాను మరింత ఎలివేట్ చేసింది. మంగళవారం నుంచి కలెక్షన్లు మళ్లీ పెరిగే అవకాశం ఉందని ట్రేడ్ అనాలిస్టులు అంచనా. ‘ఓజీ’ రూ.300 కోట్ల మార్క్‌ను సులభంగా దాటనుందని, 2025లో అతిపెద్ద హిట్‌గా నిలవబోతుందని ట్రేడ్ సర్కిల్స్‌లో చర్చ. పవన్ అభిమానులు సోషల్ మీడియాలో ‘ఓజీ’ ట్రెండింగ్‌గా మార్చి, సినిమా విజయాన్ని జరుపుకుంటున్నారు. ఈ సినిమా తెలుగు సినిమా పరిశ్రమకు మరో మైలురాయి.