Bapatla Beach (image credit:twitter)
అమరావతి

Bapatla Beach: సూర్యలంక బీచ్ కు మంచి రోజులు.. అసలేం ప్లాన్ చేశారంటే?

అమరావతి స్వేచ్ఛ: Bapatla Beach: బాపట్లలోని సూర్యలంక బీచ్ రూపురేఖలు మారిపోనున్నాయి. పర్యాటకంగా కొత్త సొబగులు సంతరించుకోబోతుంది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం శుభవార్తం చెప్పింది. స్వదేశీ దర్శన్ స్కీమ్ 2.O లో భాగంగా సూర్యలంక బీచ్ అభివృద్ధికి రూ.97.52 కోట్ల నిధులను విడుదల చేసింది. ఈ విషయాన్ని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ గురువారం వెల్లడించారు. కేంద్ర నిధులతో త్వరలోనే అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో సూర్యలంక బీచ్ రూపురేఖల్ని మార్చివేస్తామని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు.

జాతీయస్థాయి పర్యాటక కేంద్రంగా బీచ్‌ను తీర్చిదిద్దేందుకు జిల్లా అధికారులు ప్లాన్స్ సిద్ధం చేస్తున్నారని వివరించారు. ఈ మధ్యే న్యూఢిల్లీ పర్యటనలో కేంద్ర టూరిజం శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్‌ను కలిసి సూర్యలంక బీచ్‌కు అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని కోరినట్టు మంత్రి గుర్తుచేసుకున్నారు.

బ్లూప్లాగ్ తీసుకొచ్చేందుకు కృషి 

సూర్యలంక బీచ్‌ను అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ధి చేసి బ్లూఫ్లాగ్ ట్యాగ్‌ను తీసుకొచ్చేందుకు కృషి చేస్తామని మంkandhulaత్రి కందుల దుర్గేష్ చెప్పారు. ఇప్పటికే సూర్యలంక బీచ్ అభివృద్ధి, పర్యాటకులను ఆకర్షించేందుకు అవసరమైన ప్రణాళికలతో కూడిన ప్రతిపాదనలు కేంద్ర ప్రభుత్వానికి పంపించామని చెప్పారు. సూర్యలంక ప్రాజెక్టు త్వరలోనే పట్టాలెక్కబోతోందని, సరికొత్త హంగులతో పర్యాటకులకు దర్శనమివ్వనుందని ఆయన అన్నారు. సూర్యలంక బీచ్‌లో అన్ని రకాల మౌలిక వసతులు కల్పించి పరిశుభ్రమైన బీచ్‌గా తీర్చిదిద్దుతామని ఆశాభావం వ్యక్తం చేశారు.

Also Read: Sharmila on Pastor Praveen: పాస్టర్ ప్రవీణ్ మృతిపై.. వైఎస్ షర్మిల సంచలన ఆరోపణ

ఇచ్చిన మాట ప్రకారం బీచ్ అభివృద్ధికి నిధులు మంజూరు చేసిన కేంద్రమంత్రి గజేంద్రసింగ్ షెకావత్‌కు ఆయన ధన్యవాదాలు తెలియజేశారు. రాష్ట్రంలో పర్యాటక అభివృద్ధిని అన్ని విధాలా ప్రోత్సహిస్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌లకు ప్రత్యేక కృతజ్ఞతలు చెబుతున్నానని అన్నారు. రాష్ట్ర పర్యాటకాభివృద్ధికి పాటుపడుతున్న చేస్తున్న పర్యాటక శాఖ కార్యదర్శి అజయ్ జైన్, ఎండీ ఆమ్రపాలి, పర్యాటకశాఖ అధికారులను మంత్రి కందుల దుర్గేష్ ప్రశంసించారు.

స్పీడ్ బోటింగ్.. వినోద క్రీడలు

సూర్యలంక బీచ్ అభివృద్ధిలో భాగంగా అన్ని విధాలా ఆకర్షణీయంగా అభివృద్ధి చేయనున్నట్టు తెలుస్తోంది. స్పీడ్‌ బోటింగ్, స్కూబీ డ్రైవింగ్‌తో పాటు ఇతర వినోద క్రీడలను ఇక్కడ ఆరంభించనున్నట్టు తెలుస్తోంది. పిల్లలు ఆడుకోవడానికి వినోద పార్కును కూడా డెవలప్‌ చేయనున్నారు. వాహనాల పార్కింగ్‌కు ప్రత్యేక స్థలాలు, ఇతర మౌలిక సదుపాయాలు కల్పించనున్నారు. ఇక బీచ్‌ నుంచి 4 కిలోమీటర్ల దూరంలోని పొగురు ప్రాంతంలో మడ అడవుల అందాలను వీక్షించేందుకు కూడా పర్యాటకులు ఆసక్తి చూపుతారని భావిస్తున్నారు. అంతేకాదు, విదేశీ,స్వదేశీ పక్షులు, ప్రకృతి దృశ్యాలు వీక్షించేలా అన్ని విధాలా ప్రణాళికలు సిద్ధం చేయనున్నట్టు సమాచారం.

Also Read: Digital Arrest Scam: బిగ్ అలెర్ట్.. ఆ అరెస్టులు చెల్లవ్.. అజాగ్రత్త ఉన్నారో ఇక అంతే!

Just In

01

Coolie: ‘కూలీ’ మూవీ ‘చికిటు’ ఫుల్ వీడియో సాంగ్.. యూట్యూబ్‌లో రచ్చ రచ్చ!

JD Chakravarthy: ‘జాతస్య మరణం ధ్రువం’ టైటిల్ క్రెడిట్ నాదే..

Malkaajgiri Excise: డిఫెన్స్ మద్యం స్వాధీనం.. వ్యక్తి అరెస్ట్

Chiranjeevi Team: ‘స్పిరిట్’, ‘ది ప్యారడైజ్‌’ చిత్రాలలో చిరు.. క్లారిటీ ఇచ్చిన టీమ్!

GHMC: ఎంటమాలజీలో ఇష్టారాజ్యంగా జీతాల చెల్లింపులు.. చార్మినార్ జోన్ లో వెలుగు చూసిన అక్రమం