Sharmila on Pastor Praveen: పాస్టర్ ప్రవీణ్ పగడాల అనుమానస్పద మృతి ఏపీలో సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. తొలుత ప్రవీణ్ ది యాక్సిడెంట్ గా భావించగా.. శరీరంపై పెద్ద ఎత్తున గాయాలు కనిపించడంతో అనుచరులు హత్యగా అనుమానిస్తున్నారు. మరోవైపు ప్రవీణ్ బంధువులతో పాటు క్రైస్తవ మతసంఘాలు రంగంలోకి దిగి పెద్ద ఎత్తున ఆందోళన చేస్తుండటంతో ఈ వ్యవహారం ఏపీలో తీవ్ర దుమారం రేపింది. మాజీ సీఎం జగన్ సైతం ఈ వ్యవహారంపై స్పందించడంతో పాస్టర్ ప్రవీణ్ మృతి వ్యవహారం రాజకీయ రంగు పలుముకుంది. ఈ క్రమంలోనే ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల (Sharmila on Pastor Praveen) పాస్టర్ మృతికి సంబంధించి తాజాగా సంచలన ఆరోపణలు చేశారు.
షర్మిల ఏమన్నారంటే
పాస్టర్ ప్రవీణ్ పగడాల (Pastor Praveen Pagadala) అనుమానస్పద మృతిపై ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల (YS Sharmila) తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు సీఎం చంద్రబాబు (CM Chandrababu)ను ట్యాగ్ చేస్తూ ఎక్స్ లో సుదీర్ఘ పోస్టు పెట్టారు. పాస్టర్ ప్రవీణ్ ది హత్య కాదన్న షర్మిల.. హత్య అనడానికి చాలా ఉన్న రుజువులు ఉన్నట్లు ఎక్స్ వేదికగా అన్నారు. ప్రవీణ్ మృతి కుటుంబ సభ్యులతో సహా అందరికీ అనుమానాలు ఉన్నాయని పేర్కొన్నారు. ప్రవీణ్ ఘటన తెలుగు రాష్ట్రాల్లోని క్రైస్తవుల మనోభావాలను తీవ్రంగా దెబ్బతీసిందని చెప్పుకొచ్చారు. ప్రవీణ్ మృతిపై రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఫాస్ట్ ట్రాక్ విచారణ జరిపించాలని ఆమె డిమాండ్ చేశారు. తద్వారా నిజాలు నిగ్గు తేల్చాలని పట్టుబట్టారు. ఈ సందర్భంగా ప్రవీణ్ మృతికి ఆమె ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.
పాస్టర్ ప్రవీణ్ పగడాల గారిది రోడ్డు ప్రమాదం కాదని.. సంఘటన స్థలంలో ఇది హత్య అనడానికి చాలా రుజువులు ఉన్నాయని .. ఇది పక్కా ప్రణాళికతో చేసిన హత్యే అని వారి కుటుంబ సభ్యులతో పాటు అందరికీ అనుమానాలు ఉన్నాయి. ఈ దారుణ ఘటన రెండు తెలుగు రాష్ట్రాల్లోని క్రైస్తవుల మనోభావాలను తీవ్రంగా…
— YS Sharmila (@realyssharmila) March 27, 2025
జగన్ దిగ్భ్రాంతి
ఏపీలో రచ్చ రేపుతున్న పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతిపై వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy) స్పందించారు. ఎక్స్ వేదికగా బుధవారం దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పాస్టర్ మృతి పట్ల విచారం వ్యక్తం చేసిన ఆయన.. బంధువులు, కుటుంబసభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో నిస్పక్షపాత దర్యాప్తు జరిపించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పాస్టర్ మరణం వెనకున్న నిజా నిజాలను వెలుగులోకి తీసుకొని రావాలని కోరారు.
Also Read: CID Inquiry on Lady Aghori: లేడీ అఘోరీ లక్ష్యమేంటి? రంగంలోకి సీబీ సీఐడీ?
సిట్ ఏర్పాటు: ఎస్పీ
పాస్టర్ ప్రవీణ్ మృతిపై రాజమండ్రి ఎస్పీ నరసింహ కిషోర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. కొవ్వూరు డీఎస్పీ ఆధ్వర్యంలో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (SIT) ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా ప్రెస్ మీట్ నిర్వహించిన ఆయన.. ప్రవీణ్ మృతికి సంబంధించిన రెండు సీసీటీవీ ఫుటేజీలు లభించినట్లు చెప్పారు. సోమవారం అర్ధరాత్రి 11.31 నుంచి 11.42 మధ్య సమయం అత్యంత కీలకంగా మారిందని అన్నారు. రాత్రి 11 గంటల 42 నిమిషాలకు ఒక కారుతో పాటు 5 వాహనాలు ప్రవీణ్ బుల్లెట్ బైక్ ను దాటుకొని వెళ్లాయని ఎస్పీ అన్నారు. అందులో రెడ్ కలర్ కారు, ప్రవీణ్ బైక్ ఒకేసారి వెళ్లాయని అన్నారు. టెక్నాలజీని ఉపయోగించుకొని ఆ కారు కోసం విచారణ చేస్తున్నట్లు తెలిపారు.