CID Inquiry on Lady Aghori: గత కొన్ని రోజులుగా లేడీ అఘోరి (Lady Aghori) వ్యవహారం తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర సంచలనం రేపుతున్న సంగతి తెలిసిందే. సనాతన ధర్మంపై పేరుతో ఆలయాల వద్ద నానా హంగామా సృష్టించి ఒక్కసారిగా సంచలనంగా మారింది. వాస్తవానికి లేడీ అఘోరీ పూర్తి పేరు అల్లూరి శ్రీనివాస్ (Alluri Srinivas) . ఏదోక రూపంలో వార్తల్లో నిలుస్తూ మీడియాలో చర్చకు తావిస్తూనే ఉంది. ఈ క్రమంలో తాజాగా బీటెక్ చదివిన శ్రీవర్షిణిని చేరదీసిన మరోమారు అందరి దృష్టిని ఆకర్షించింది. ఓవైపు ఆలయాల సందర్శన పేరుతో రచ్చ చేస్తూనే తాజాగా ఓ యువతిని మైండ్ వాష్ చేసిందన్న ఆరోపణల నేపథ్యంలో అసలు అఘోరి లక్ష్యమేంటన్న చర్చ మెుదలైంది. ఆమె ఇదంతా ఎందుకు చేస్తోందన్న ప్రశ్న ప్రతీ ఒక్కరిలోనూ మెుదలైంది. ఈ క్రమంలోనే ఆమెపై సీబీ-సీఐడీ సైతం నిఘా పెట్టింది.
నిఘా నీడలో అఘోరీ
తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న లేడీ అఘోరీ.. తనపై సీబీ సీఐడీ విచారణ జరుగుతున్నట్లు స్వయంగా ప్రకటించింది. తాను ఎక్కడకి వెళ్తున్నా, ఏం చేస్తున్నా ఓ కంట కనిపెడుతూనే ఉన్నారని అఘోరీ తెలిపింది. అటు శ్రీవర్షిణిని దురుద్దేశ్యంతో లొంగదీసుకుందన్న కుటుంబ సభ్యుల ఆరోపణలపైనా అఘోరీ స్పందించింది. సర్వం పరమేశ్వరుడు అనుకొని శరీరంతో సహా శివయ్యకు త్యాగం చేసిన వ్యక్తికి అలాంటి దురాలోచనలు ఎలా వస్తాయని ప్రశ్నించింది.
నాగసాధువులు ఇలా ఉంటారా?
లేడీ అఘోరీ అలియాస్ అల్లూరి శ్రీనివాస్ తనను తాను నాగ సాధువుగా ప్రకటించుకుంటోంది. అయితే సాధారణంగా నాగ సాగధువులు ప్రజల్లో అసలు తిరగరు. వారు జనసంచారం లేని పర్వత ప్రాంతాల్లో వారు తపస్సులు చేస్తుంటారు. కుంభమేళా సమయంలో మాత్రమే జన సమూహంలోకి వస్తారు. అలా వచ్చినా కూడా ఎవరితోనూ మాట్లాడరు. పుణ్య స్నానాలు ఆచరించి తిరిగి తమ ప్రదేశాలకు వారు వెళ్లిపోతుంటారు. అయితే గత కొంతకాలంగా లేడీ అఘోరీ వైఖరి చూస్తే ఇందుకు పూర్తి భిన్నంగా ఉందని చెప్పవచ్చు. పేరుకు నాగసాధువని చెప్పుకుంటున్నా ఆమె వ్యవహారశైలి అఘోరీలాగానే లేదంటూ విమర్శలు వస్తున్నాయి.
అఘోరీ లక్ష్యమేంటి?
ఇటీవల తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ ఆలయాలను సందర్శించిన అఘోరీ అక్కడ రచ్చ రచ్చ చేసింది. పోలీసులతో వాగ్వాదానికి దిగడమే కాకుండా తీవ్ర పదజాలంతో దూషించిన దృశ్యాలు నెట్టింట వైరల్ గా మారాయి. సనాతన ధర్మం పరిరక్షణకు పాటు పడుతున్నట్లు చెప్పుకుంటున్న అఘోరీ.. ఇలా వ్యవహరించడమేంటన్న ప్రశ్న సమాజంలో ఉత్పన్నమవుతోంది. ఆమె నిజంగానే హిందూ ధర్మ పరిరక్షణకు పాటుపడుతుందా? అని సందేహం వ్యక్తం చేస్తున్నారు. లేదంటే పబ్లిసిటీ కోసమే లేడీ అఘోరీ ఇలా చేస్తోందన్న అభిప్రాయాన్ని సైతం వ్యక్తం చేస్తున్నారు. నిత్యం ఏదోక వివాదం మీద వేసుకొని వార్తల్లో నిలిచేందుకు ఆమె ఇలా ప్లాన్ చేస్తున్నట్లు కొందరు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
Also Read: Bank of baroda Jobs 2025: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. అదిరిపోయే ఉద్యోగాలు.. వేలల్లో జీతం!
బిటెక్ యువతి విషయంలోనూ..
బిటెక్ చదివిన శ్రీవర్షిణితో పరిచయం పెంచుకొని ఆమెకు లేడీ ఆఘోరీ మాయమాటలు చెప్పిందన్న ఆరోపణలు గట్టిగా వినిపిస్తున్నాయి. దీనిపై శ్రీవర్షిణి తల్లిదండ్రులు మంగళగిరి పోలీసులకు ఫిర్యాదు సైతం చేశారు. అయితే తాను మేజర్ అని, ఇష్టపూర్వకంగానే అఘోరీ వద్దకు వచ్చేసినట్లు యువతి శ్రీవర్షిణి పోలీసుకు తేల్చి చెప్పింది. దీంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరు అవుతున్నారు. అయితే ఎంత మేజర్ అయినా, స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకునే హక్కు ఉన్నా.. తల్లిదండ్రుల బాధను అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రస్తుత కాలంలో యువత ఆధ్యాత్మికత వైపు వెళ్తున్న ఘటనలు మనం చూస్తూనే ఉన్నాం. స్వయంగా మఠాలకు వెళ్లి సనాతన దీక్షను చేపడుతున్నారు. అయితే నిత్యం వివాదాల మాటున జీవిస్తున్న అఘోరీ చెంతకు యువతి చేరడంపై మాత్రం సమాజం నుంచి విమర్శలు వస్తున్నాయి.