Bank of baroda Jobs 2025: డిగ్రీ చదివి ఖాళీగా ఉంటున్నారా.. అయితే, వెంటనే ఈ ఉద్యోగాలకు అప్లై చేయండి. నిరుద్యోగులకు బ్యాంక్ ఆఫ్ బరోడా గుడ్ న్యూస్ చెప్పింది. ఈ రిక్రూట్‌మెంట్ లో భాగంగా డిప్యూటీ డిఫెన్స్ బ్యాంకింగ్ అడ్వైజర్, ప్రైవేట్ బ్యాంకర్ – రేడియన్స్ ప్రైవేట్, గ్రూప్ హెడ్, టెరిటరీ హెడ్, సీనియర్ రిలేషన్షిప్ మేనేజర్, వెల్త్ స్ట్రాటజిస్ట్ (ఇన్వెస్ట్మెంట్ & ఇన్సూరెన్స్), ప్రొడక్ట్ హెడ్ – ప్రైవేట్ బ్యాంకింగ్, పోర్ట్‌ఫోలియో రీసెర్చ్ అనలిస్ట్ పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ చేసిన అభ్యర్థులు ఆన్లైన్ లో అప్లై చేసుకోవచ్చు. ఆన్‌లైన్ దరఖాస్తు 26-03-2025న ప్రారంభమై 15-04-2025న ముగుస్తుంది. అభ్యర్థి బ్యాంక్ ఆఫ్ బరోడా వెబ్‌సైట్ పై bankofbaroda.in లింక్ పై క్లిక్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు.
బ్యాంక్ ఆఫ్ బరోడా రిక్రూట్‌మెంట్ 2025 నోటిఫికేషన్ PDF 26-03-2025న bankofbaroda.in లో విడుదల చేయబడింది. పూర్తి ఉద్యోగ వివరాలు, ఖాళీల పోస్టులు, వయోపరిమితి, దరఖాస్తు రుసుము, ఎంపిక ప్రక్రియ, ఎలా అప్లై చేయాలో ఇక్కడ తెలుసుకుందాం..
నియామక ప్రక్రియ, అర్హత , దరఖాస్తు విధానం గురించి అన్ని వివరాల కోసం, అధికారిక నోటిఫికేషన్‌ను చూడండి. అర్హత గల అభ్యర్థులు ఈ bankofbaroda.in లింక్ నుండి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
ముఖ్యమైన సమాచారం
దరఖాస్తు రుసుము:
జనరల్, EWS & OBC అభ్యర్థులకు రూ.600/- + వర్తించే పన్నులు + చెల్లింపు గేట్‌వే ఛార్జీలు
SC, ST, PWD & మహిళలకు రూ.100/- + వర్తించే పన్నులు + చెల్లింపు గేట్‌వే ఛార్జీలు
బ్యాంక్ ఆఫ్ బరోడా రిక్రూట్‌మెంట్ 2025 వయోపరిమితి:
కనీస వయోపరిమితి: 22 సంవత్సరాలు
గరిష్ట వయోపరిమితి: 57 సంవత్సరాలు
నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
RC 16: మాస్ టైటిల్ తో వచ్చేసిన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్
అర్హత:
అభ్యర్థులు ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ కలిగి ఉండాలి.
ఖాళీల పోస్టులు
డిప్యూటీ డిఫెన్స్ బ్యాంకింగ్ అడ్వైజర్ (DDBA) – 01
ప్రైవేట్ బ్యాంకర్ – రేడియన్స్ ప్రైవేట్ – 03
గ్రూప్ హెడ్ – 04
టెరిటరీ హెడ్ – 17
సీనియర్ రిలేషన్షిప్ మేనేజర్ – 101
వెల్త్ స్ట్రాటజిస్ట్ (ఇన్వెస్ట్మెంట్ & ఇన్సూరెన్స్) – 18
ప్రొడక్ట్ హెడ్ – ప్రైవేట్ బ్యాంకింగ్ – 01
పోర్ట్‌ఫోలియో రీసెర్చ్ అనలిస్ట్ – 01
ముఖ్యమైన తేదీలు:
బ్యాంక్ ఆఫ్ బరోడా రిక్రూట్‌మెంట్ 2025 ముఖ్యమైన తేదీలు:
ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి ప్రారంభ తేదీ: 26-03-2025
ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి ముగింపు తేదీ: 15-04-2025