USA Youtuber Fear Maloof Kidnapped In Haiti
అంతర్జాతీయం

Youtuber Kidnap : యూట్యూబర్‌ కిడ్నాప్, 6 లక్షల డాలర్ల డిమాండ్

USA Youtuber Fear Maloof Kidnapped In Haiti: కరీబియన్ దేశం ఇక్కడ హైతీలో పేరుకే గవర్నమెంట్ ఉంటుంది. కానీ అక్కడంతా కిడ్నాపర్లదే రాజ్యం నడుస్తుంటుంది. దేశంలోని చాలా ప్రాంతాల్లో నిత్యం గ్యాంగ్‌వార్లు జరుగుతుంటాయి. కిడ్నాప్‌లు ఇక్కడ సర్వసాధారణం. అలాంటి పరిస్థితి ఉన్న చోటుకి ఓ యూట్యూబర్ సాహసించి వెళ్లాడు. అక్కడి టూరిస్టు ప్రాంతాలను చూసి వాటన్నింటిని తన కెమెరాలో బంధించాడు. అంతటితో తిరిగి రాకుండా హైతీలోనే అత్యంత పవర్ ఫుల్ గ్యాంగ్ లీడర్‌ను తన ఛానల్ కోసం ఇంటర్వ్యూ చేయాలనుకున్నాడు. అందుకోసం తెగ ట్రై చేశాడు. ఇంకేముంది తనకు ఊహించని షాక్ తగిలింది. గ్యాంగ్‌స్టర్‌లు గ్యాంగ్‌ అంతా తనని చుట్టుముట్టి కిడ్నాప్ చేశారు. ఇంకేముంది ఏదో అనుకుంటే ఇంకేదో జరిగింది. ఇంటర్వ్యూ కాస్త తన ప్రాణాల మీదకి తెచ్చిపెట్టింది.

దీంతో సదరు గ్యాంగ్ స్టర్లు ఈ యూట్యూబర్ ను ఎత్తుకెళ్లారు. ఇప్పుడు ఆరు లక్షల డాలర్లు ఇస్తే కానీ తనని వదిలేది లేదంటూ ఫోటోలు, ఫోన్ నెంబర్‌ను సోషల్ మీడియాలో రిలీజ్ చేశారు. గ్యాంగ్ స్టర్ల చెరలో ఉన్న ఆ యూట్యూబర్ పేరు పియర్ మలూఫ్..అమెరికాకు చెందిన మలూఫ్ తన ఛానల్ పేరు ‘యువర్ ఫెల్లో అరబ్’తోనే ఎక్కువగా పాప్యులర్ అయ్యాడు.హైతీలో అడుగుపెట్టిన 24 గంటల్లోనే మలూఫ్ ను, ఆయన హైతీ మిత్రుడిని మవోజో గ్యాంగ్ కు చెందిన 400 మంది గ్యాంగ్ స్టర్లు కిడ్నాప్ చేశారు. ఈ నెల 14న ఈ ఘటన చోటుచేసుకుంది. మలూఫ్ కుటుంబసభ్యులు ఇప్పటికే 40 వేల డాలర్లు కిడ్నాపర్లకు చెల్లించినట్లు సమాచారం. కాగా, తోటి యూట్యూబర్లు కూడా మలూఫ్‌ను విడుదల చేయించేందుకు నానా ఇబ్బందులు పడుతూ, తెగ ప్రయత్నిస్తున్నట్లు చెబుతున్నారు.

Read Also : ఘోర బస్సు ప్రమాదం 45 మంది దుర్మరణం, 8 ఏళ్ల బాలిక సజీవం

ఇక హైతీలో మలూఫ్ కు సాయంగా ఉన్న స్థానికుడు సియాన్ రూబెన్స్ జీన్ సాక్రాను కూడా గ్యాంగ్ స్టర్లు కిడ్నాప్ చేశారు. అయితే, గ్యాంగ్ స్టర్లు వదిలేసినా సరే మలూఫ్ తో పాటే సియాన్ ఉంటున్నాడని మరో యూట్యూబర్ చెప్పారు. మలూఫ్ క్షేమంగా తిరిగి రావాలని ఆయన యూట్యూబ్‌ ఫాలోవర్లు, శ్రేయోభిలాషులు కోరుకుంటున్నారు. అయితే, ఈ విషయంలో అమెరికా ప్రభుత్వం కలుగజేసుకునే అవకాశం లేదని అధికార వర్గాలు తేల్చి చెప్పాయి. మలూఫ్ పంపిన చివరి వీడియోను ఆయన ఎడిటర్ సోషల్ మీడియాలో పెట్టారు. ఓ పెద్ద హోటల్ లో తానొక్కడినే ఉన్నానంటూ మలూఫ్ చెప్పడం ఈ వీడియోలో మనకు కనిపిస్తోంది. అనంతరం కిడ్నాపర్ల ఆధీనంలోకి వెళ్లిపోయి బిక్కుబిక్కుమంటూ దిక్కుతోచని స్థితిలో అచేతనంగా పడి ఉన్నాడు. ఇక ఈ వార్త చూసిన చాలామంది నెటిజన్లు సదరు యూట్యూబర్ మీద మండిపడుతున్నారు. ఉన్నదేదో వీడియో తీసుకొని రాక, ఎందుకురా నీకు ఇవన్నీ అంటూ ఫైర్ అవుతున్నారు. మరికొందరు అయితే గాలికి పోయే కంపను ఎక్కడో తాకిచ్చుకున్నట్టు ఉందా అంటూ రకరకాల పోస్ట్‌లు పెడుతున్నారు. ఇంకొందరేమో.. అసలే కిడ్నాప్ అయిన బాధలో తానుంటే పాపం అనేది పోయి మీరేంటి భయ్యా ఇలా మాట్లాడుతున్నారు అంటూ తమ సంఘీభావాన్ని వ్యక్తం చేస్తున్నారు.

Just In

01

Turakapalem Village: ఎవరూ వంట చేసుకోవద్దు.. కనీసం నీళ్లూ తాగొద్దు.. ప్రభుత్వం ఆదేశాలు

Ponguleti Srinivasa Reddy: త్వరలో సాదాబైనామాలకు మోక్షం.. మంత్రి కీలక వ్యాఖ్యలు

Su From So OTT release: ‘ఓటీటీలోకి వచ్చేస్తున్న కామెడీ థ్రిల్లర్.. ఎక్కడంటే?

BRS Party: గులాబీ పార్టీకి డ్యామేజ్.. కంట్రోల్ చేసేందుకు ప్రయత్నం?.. సాధ్యపడేనా..?

Ganesh Nimajjanam 2025: అయ్యో గణపయ్య ఎంత ఘోరం.. నిమజ్జనం చేస్తుండగా.. కింద పడ్డ విగ్రహాలు