45 dead after bus plunges from bridge into ravine in south africa
అంతర్జాతీయం

Bus Accident : ఘోర బస్సు ప్రమాదం 45 మంది దుర్మరణం, 8 ఏళ్ల బాలిక సజీవం

South Africa Road Accident: ప్రపంచంలో ఏదో ఒక మూలనా రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా దక్షిణాఫ్రికాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బోట్స్‌వానా నుంచి మోరియా వెళ్తున్న బస్సు వంతెనపై నుంచి అదుపుతప్పి లోయలో పడింది. జోహన్నెస్‌ బర్గ్‌కు ఉత్తరాన 300 కి.మీ దూరంలో ఉన్న లింపోపో ప్రావిన్స్‌లోని మమట్లకాల సమీపంలో రెండు కొండలను కలిపే వంతెనపై నుంచి బస్సు పడిపోయింది. ఈ ఘటనలో 45 మంది ప్రాణాలను కోల్పోయారు. ఈస్టర్‌ పండుగ కోసం జియాన్ చర్చికి వెళుతుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. బస్సు లోయలో పడిన టైంలో బస్సులో నుండి భారీగా మంటలు చెలరేగడంతో బస్సు స్వల్పంగా దగ్దమైనట్లు అధికారులు వెల్లడించారు. ఈ ప్రమాదంలో అనూహ్యంగా 8 ఏళ్ల చిన్నారి ప్రాణాలతో బయటపడింది. ఈ బాలికను స్థానిక దవాఖానకు తరలించినట్లు అధికారులు పేర్కొన్నారు.

ఈ ప్రమాదంలో పూర్తిగా బస్ దగ్దం అయ్యింది. ఈ ప్రమాదం జరిగే సమయానికి 46 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఈ ప్రమాదం జరిగినప్పుడు 46 మంది ఉండగా అందులో ఒక చిన్నారి మాత్రమే ప్రాణాలతో బయటపడినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఈ ప్రమాదానికి కారణం. బస్ డ్రైవర్ తన కంట్రోల్‌ పవర్‌ని తప్పడం వల్లనే ఈ ఘటన చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. చనిపోయిన వారంతా శిథిలాల కింద చిక్కుకోవడంతో వారిని బయటకి తీయడానికి కష్టతరంగా మారింది.

Read Also : బిక్కుబిక్కుమంటున్న గాజా, ఆహారం కోసం వెళ్లి 18 మంది మృతి

ఇక బస్సు ప్రమాదం వంతెనపై డివైడర్లను ఢీకొట్టడంతో లోయలోకి పడిపోయినట్లు అక్కడి ప్రభుత్వం తెలిపింది. దీంతో అక్కడ మంటలు భారీగా వ్యాపించినట్టు ఈ ప్రమాదంలో బస్సు పూర్తిగా దగ్ధమైందని వెల్లడించారు. ఈ ఘటనాస్దలానికి రవాణా శాఖ మంత్రి సింధిసివే చికుంగా చేరుకొని అక్కడి ప్రమాదానికి గల కారణాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ కష్టకాలంలో మృతదేహాలను బాధిత కుటుంబసభ్యులకు అప్పగించేందుకు దక్షిణాప్రికా ప్రభుత్వం అన్నిరకాల చర్యలు తీసుకుంటుందని భరోసాని కల్పించారు. ఈస్టర్ వారంతంలో ఎక్కువమంది ప్రజలు రోడ్లపైకి ప్రయాణిస్తున్నారని.. డ్రైవింగ్ చాలా అప్రమత్తంగా చేయాలని సూచిస్తున్నట్టు కూడా గుర్తుచేశారు.

గతంలోనూ ఈస్టర్ సందేశంలో ఆ దేశ అధ్యక్షుడు సిరిల్ రమాఫోసా పౌరులను ఉద్దేశించి మాట్లాడుతూ.. సురక్షితమైన ఈస్టర్‌గా మార్చడానికి ప్రజలు తమ వంతు కృషి చేయాలని కోరారు. మన రోడ్లపై విషాదాలు, గాయాలకు సంబంధించిన గణాంకాలను చూసేందుకు వేచి ఉండే సమయం ఉండకూడదని అన్నారు. ఈస్టర్ వారంలో ప్రయాణించేటప్పుడు తగిన జాగ్రత్తలను వహించాలని కోరారు. ఆయన ఈ మాటలు చెప్పిన కొన్ని గంటలకే ఈ రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాద విషయం తెలుసుకున్న సిరిల్.. బాధిత కుటుంబసభ్యులకు తమ సంతాపం తెలిపారు.

Just In

01

Gopichand33: యాక్షన్ మోడ్‌లో గోపీచంద్.. తాజా అప్డేట్ ఇదే..

Premaledhani: ‘ప్రేమ లేదని’ గ్లింప్స్ విడుదల.. ఎలా ఉందంటే?

Taapsee Pannu: ముంబైలోనే ఉన్నా.. ఆ ప్రచారాలు ఆపండి

Jubilee Hills Bypoll: ఆ రెండు పార్టీల మధ్యే పోటీ!.. జూబ్లీహిల్స్ క్షేత్రస్థాయి పరిస్థితి ఇదే!

OG Movie: ఓటీటీలోనూ ఊచకోత మొదలెట్టిన ‘ఓజీ’.. 8 దేశాల్లో టాప్ 1 ప్లేస్‌లో!