18 People Died in Desperate Gaza For Food : ఇజ్రాయెల్ హమాస్ యుద్ధంతో భయానక పరిస్థితులతో పాటుగా, పాలస్తీనాలోని గాజా స్ట్రిప్‌లో విషాదఛాయలు నెలకొన్నాయి. ఓ వైపు పౌరుల మరణాలు, మరోవైపు ఆకలి కేకలతో గాజాలో పరిస్థితి దయనీయంగా మారింది. తినేందుకు తిండిలేక, తాగేందుకు నీళ్లు లేక, తలదాచుకునేందుకు గూడు లేక అక్కడి ప్రజలు బిక్కుబిక్కుమంటూ కాలాన్ని రోజుకో గండంలా ఎల్లదీస్తూ తిండికోసం అల్లాడిపోతున్నారు. మానవతా సాయం కోసం ప్రజలు వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. తాజాగా ఎయిర్‌డ్రాప్ట్ ద్వారా జారవిడిచిన ఆహారాన్ని చేజిక్కించుకునేందుకు తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా నానా తిప్పలు పడుతూ..సముద్ర అలలకు ప్రయత్నించి 18 మంది ప్రాణాలు కోల్పోయారు.
యుద్ధంతో తీవ్రంగా నష్టపోయిన గాజా ప్రజలను ఆదుకునేందుకు ప్రపంచ దేశాలు మానవతా సాయం చేసేందుకు ముందుకొచ్చాయి. రోడ్డు, వాయు, సముద్ర అన్ని మార్గాల ద్వారా నిరాశ్రయులైన వారికోసం ఆహారాన్ని అందజేస్తున్నాయి.ఈ నేపథ్యంలో అమెరికా విమానాలు జారవిడిచిన ఆహారం డబ్బాలను చేజిక్కించుకునేందుకు సముద్రంలోకి వెళ్లి 18 మంది తమ నిండు ప్రాణాలను కోల్పోయారు. అందులో 12 మంది ఆహార డబ్బాలు మీద పడి మరణించగా, మరో ఆరుగురు నీటి ఉధృతికి కొట్టుకుపోయి తమ ప్రాణాలను కోల్పోయారు.ఈ విషాదకరమైన ఘటన ఉత్తర గాజాలోని బీచ్ లాహియా బీచ్‌లో చోటు చేసుకుంది.ఈ విషయాన్ని పాలస్తీనా ఆరోగ్యశాఖ అధికారులు వెల్లడించారు.
Read Also : రష్యా దాడిలో ఉక్రెయిన్ ప్రమేయంపై అమెరికా క్లారిటీ
ఇక ఇదే ఘటనపై పెంటగాన్ స్పందించింది. మానవతాసాయం కింద పంపిన 18 బండిల్స్‌లో మూడు పారాచూట్‌లు పనిచేయలేదని తెలిపింది. దీంతో అవి నీటిలో పడిపోయాయని, వాటిని చేజిక్కించుకునేందుకు వెళ్లి తమ ప్రాణాలను కోల్పోయినట్లు తెలిపింది. అయితే మరణాలకు సంబంధించి ఎలాంటి సమాచారం లేదని పేర్కొంది. గాజా బీచ్‌లో సాయంకోసం ఆహారాన్ని జారవిడవడం, మృతులను సముద్ర తీరానికి చేరుస్తున్న విషాద ఘటనకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.
Dropping aid on the beach in North Gaza resulted in the drowning and death of 18 Gazans, 12 due to drowning and 6 due to overcrowding. Some still deny the famine in Gaza, while people sacrifice their lives to get some food.
— Ihab Hassan (@IhabHassane) March 26, 2024