Rekha Gupta Delhi CM
జాతీయం

Delhi CM Rekha Gupta: ఢిల్లీ సీఎంగా రేఖా గుప్తా ప్రమాణస్వీకారం

న్యూఢిల్లీ, స్వేచ్ఛ: ఢిల్లీ ముఖ్యమంత్రి పీఠంపై బీజేపీ సీనియర్ మహిళా నేత రేఖా గుప్తా ఆసీనులయ్యారు. గురువారం మధ్యాహ్నం ఢిల్లీ నగరంలోని రామ్‌లీలా మైదానంలో అట్టహాసంగా జరిగిన ప్రమాణస్వీకారోత్సవంలో ఆమె ప్రమాణం చేశారు. ఢిల్లీకి నాలుగవ మహిళా ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఆమెతో పాటు పర్వేష్ సాహిబ్ సింగ్, అశీష్ సూద్, మంజీందర్ సింగ్ సిర్సా, రవీందర్ ఇంద్రజ్ సింగ్, కపిల్ మిశ్రా, పంకజ్ కుమార్ సింగ్ ఆరుగురు కేబినెట్ మంత్రులుగా ప్రమాణ చేసి బాధ్యతలు స్వీకరించారు. సుమారు 50 వేల బీజేపీ కార్యకర్తలు పాల్గొన్న ఈ కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, పార్టీ అగ్రనాయకత్వంతో పాటు ఎన్డీయే పార్టీలకు చెందిన పలువురు ముఖ్యనేతలు హాజరయ్యారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, రాజస్థాన్ ముఖ్యమంత్రి భజన్ లాల్ శర్మ, మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్, గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్, బీహార్ డిప్యూటీ సీఎం విజయ్ కుమార్ సిన్హా, రాజస్థాన్ డిప్యూటీ సీఎం ప్రేమ్ చంద్, బైర్వా, కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌తో పాటు పలువురు ముఖ్యనాయకులు పాల్గొన్నారు. మరోవైపు, ఢిల్లీ అసెంబ్లీ స్పీకర్‌గా పార్టీ సీనియర్ నేత విజేందర్ గుప్తా పేరుని బీజేపీ ఖరారు చేసింది. ఆప్ ప్రభుత్వ హయాంలో విజేందర్ గుప్తా భౌతిక దాడికి గురయ్యారు. మార్షల్ నిర్దాక్షిణ్యంగా ఎత్తుకెళ్లి బయట వదిలేసిన వ్యక్తే నేడు స్పీకర్‌గా సభను నడిపించనుండడం ఆసక్తికరంగా మారింది. నాడు సభ నుంచి మార్షల్ బలవంతంగా ఎత్తుకెళుతున్న ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. విపక్షంలో ఉన్నప్పుడు తమ గొంతును అణచివేశారని, కానీ, తాము అలా వ్యవహరించబోమని విజేందర్ గుప్తా చెప్పారు. స్పీకర్‌గా అవకాశం కల్పించిన పార్టీ నేతలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

Also Read- AM Rathnam: ‘వీరమల్లు’ ఫ్యాన్స్‌ని ఖుషి చేసే న్యూస్

మార్చి 8లోగా మహిళల ఖాతాల్లో నగదు: సీఎం రేఖ
ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకుంటామని, వాగ్దానాలను కచ్చితంగా అమలు చేసి తీరుతామని ఢిల్లీ నూతన సీఎం రేఖా గుప్తా గురువారం ప్రకటించారు. హామీ మేరకు మహిళలకు ప్రతినెలా రూ.2,500 ఆర్థిక సాయం అందిస్తామని, తొలి దఫా నగదును అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురష్కరించుకొని మార్చి 8లోగా అబలల ఖాతాల్లో జమ చేస్తామని ఆమె వెల్లడించారు. ఎన్నికల్లో తమ పార్టీ ఇచ్చిన అన్ని వాగ్దానాలను నెరవేర్చడమే తన ప్రభుత్వ ప్రథమ ప్రాధాన్యత అని రేఖా గుప్తా వివరించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కలలను సాకారం చేయాల్సిన బాధ్యత 48 మంది బీజేపీ ఎమ్మెల్యేలపై ఉందని ఆమె వ్యాఖ్యానించారు. కచ్చితంగా వాగ్దానాలను నెరవేర్చుతామని ఆమె ధీమా వ్యక్తం చేశారు. ఈ మేరకు ప్రమాణస్వీకారానికి ముందు గురువారం ఆమె మీడియాతో మాట్లాడారు. మరోవైపు, యమునా నది పరిశుభ్రతను పరిశీలించేందుకు సీఎం రేఖా గుప్తా, కేబినెట్ మంత్రులు వెళ్లనున్నారు. తొలి కేబినెట్ భేటీ అనంతరం నదిని పరిశీలించనున్నట్టు ప్రకటించారు. ‘క్లీన్‌నెస్ డ్రైవ్’ చేపడతామని వెల్లడించారు. బీజేపీ అధికారంలోకి వస్తే యమునా నదిని కాలుష్యం కోరల నుంచి కాపాడుతామని ఎన్నికల సమయంలో కమలనాథులు వాగ్దానం చేసిన విషయం తెలిసిందే.

ఇవి కూడా చదవండి: 

Laila Movie: డామిట్.. ‘లైలా’ బట్టలు, మేకప్ ఖర్చు కూడా రాలేదా?

Harish Shankar Leaks: ఆశలు పెట్టుకోకు.. ‘ఉస్తాద్ భగత్ సింగ్‌’లో ఆ సీన్ వాడేశా!

Just In

01

Director Krish: ‘హరి హర వీరమల్లు’ విషయంలో చాలా బాధగా ఉంది

Kalvakuntla Kavitha: దూకుడు పెంచిన కవిత.. జాగృతిలో భారీగా చేరికలు.. నెక్ట్స్ టార్గెట్ బీసీ రిజర్వేషన్లు!

CV Anand: ప్రతీ పెద్ద పండుగ పోలీసులకు సవాలే .. హైదరాబాద్ సీపీ ఆనంద్ కీలక వ్యాఖ్యలు

Viral Video: యూనివర్శిటీలో దారుణం.. విద్యార్థి చెంపపై 50-60 సార్లు దాడి.. వీడియో వైరల్

Ponguleti Srinivasa Reddy: పేద ప్రజల అభ్యున్నతే సీఎం కల.. మంత్రి కీలక వ్యాఖ్యలు