AM Rathnam: ఏపీ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) అటు పాలిటిక్స్, ఇటు సినిమా షూటింగ్‌లతో బిజీబిజీగా గడుపుతున్నారు. పాలిటిక్స్ పరంగా ఆయన ఏం చేస్తుందీ అందరికీ ఎప్పటికప్పుడు తెలుస్తూనే ఉంది. సినిమా పరంగా మాత్రం ఆయన ఏం చేస్తున్నారో, ఎప్పుడు షూట్‌లో పాల్గొంటున్నారనే విషయంలో మాత్రం సరైన క్లారిటీ అయితే రావడం లేదు. ఆయన చేస్తున్న సినిమాలలో ‘హరి హర వీరమల్లు పార్ట్-1 స్వార్డ్ వర్సెస్ స్పిరిట్’ సినిమా దాదాపు షూటింగ్ పూర్తి కావచ్చింది. ‘ఓజీ’ (OG) సినిమా 60 శాతం షూటింగ్ పూర్తయిందని తెలుస్తుంది. హరీష్ శంకర్‌తో చేయాల్సిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ (Ustaad Bhagath Singh) షూట్‌లో పవన్ కళ్యాణ్ ఎప్పుడు పాల్గొంటారో, ఆ సినిమా ఎప్పుడు షూటింగ్ పూర్తి చేసుకుంటుందో ఇప్పుడప్పుడే చెప్పడం చాలా కష్టం. ఎందుకంటే, పవన్ కళ్యాణ్ ఉన్న బిజీకి ‘ఉస్తాద్ భగత్ సింగ్’ తిరిగి సెట్స్‌పైకి వెళ్లడానికి చాలా కాలం పట్టొచ్చు.
Also Read- Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌కు ఆ ఫోబియా పోలేదా!
ప్రస్తుతం పవన్ కళ్యాణ్ గ్యాప్ దొరికినప్పుడల్లా ‘హరిహర వీరమల్లు’ (Hari Hara Veeramallu) సినిమా షూట్‌లో పాల్గొంటున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు ఒకవైపు షూటింగ్ జరుపుతూనే మరో వైపు ప్రమోషన్స్ కూడా మొదలు పెట్టారు. రీసెంట్‌గా పవన్ కళ్యాణ్ స్వయంగా పాడిన ‘మాట వినాలి’ అంటూ విడుదలైన సాంగ్ ట్రెమండస్ రెస్పాన్స్‌ని రాబట్టుకోగా, ఫిబ్రవరి 24న సెకండ్ సింగిల్ ‘కొల్లగొట్టిందిరో’ అనే సాంగ్ విడుదల కాబోతున్నట్లుగా అధికారిక ప్రకటన వచ్చేసింది. ఇన్ని అప్డేట్స్ వచ్చినా, సినిమా విడుదల విషయంలో మాత్రం ఇంకా అనుమానాలు నెలకొనే ఉన్నాయి. ఎందుకంటే, ఈ సినిమా ఎన్నో అడ్డంకులను దాటుకుని ఈ మధ్యనే సక్రమంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. పవన్ కళ్యాణ్‌తో ఓ భారీ యాక్షన్ ఎపిసోడ్ బ్యాలెన్స్ ఉందనేలా వార్తలు వినిపిస్తున్నాయి. కానీ, పవన్ కళ్యాణ్ హెల్త్ పరంగా వచ్చిన వార్తలు మళ్లీ ‘వీరమల్లు’ విడుదలపై అనుమానాలు వ్యక్తమయ్యేలా చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో నిర్మాత ఏఎమ్ రత్నం అభిమానులకు ఓ గుడ్ న్యూస్ చెప్పి, ఖుషి చేశారు.
ఆందోళన వద్దు.. చెప్పిన డేట్‌కే!
‘హరిహర వీరమల్లు’ సినిమాపై చిత్ర నిర్మాత ఏఎం రత్నం తాజాగా ఓ బిగ్ అప్‌డేట్ ఇచ్చారు. ఈ చిత్రాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ చెప్పిన టైమ్‌కే, అంటే మార్చి 28కే థియేటర్లలోకి తీసుకువస్తామని ప్రకటించారు. మార్చి 28న విడుదల ఉంటుందా? ఉండదా? అనేలా ఎటువంటి అనుమానాలు, ఆందోళనలు పెట్టుకోవద్దు. మేము చెప్పిన తేదీకి విడుదలయ్యే దిశగా పనులు జరుగుతున్నాయి. పవన్ కళ్యాణ్‌కు సంబంధించి మిగిలి ఉన్న షూటింగ్‌ను పూర్తి చేసి, అనుకున్న సమయానికి సినిమాను విడుదల చేస్తామని నిర్మాత ఏఎమ్ రత్నం క్లారిటీ ఇచ్చేశారు. నిర్మాత ఏఎమ్ రత్నం ఇచ్చిన ఈ అప్‌డేట్‌తో మెగాభిమానులు ఖుషీ అవుతున్నారు.
ఇవి కూడా చదవండి:
Laila Movie: డామిట్.. ‘లైలా’ బట్టలు, మేకప్ ఖర్చు కూడా రాలేదా?
Harish Shankar Leaks: ఆశలు పెట్టుకోకు.. ‘ఉస్తాద్ భగత్ సింగ్’లో ఆ సీన్ వాడేశా!