Beauty First Look: ఇప్పుడొస్తున్న సినిమాలలో లిప్ లాక్‌లు కామన్ అయిపోయాయి. చిన్న, పెద్ద అనే తేడా లేకుండా హీరోలందరూ హీరోయిన్లతో లిప్‌లాక్స్ చేస్తున్నారు. అందుకు హీరోయిన్లు కూడా కోపరేట్ చేస్తున్నారు. గతంలో ఈ మోతాదు చాలా తక్కువ ఉండేది. కానీ ఇప్పుడు యూత్‌ని టార్గెట్ చేస్తూ.. ఒకటి కాదు రెండు మూడు సన్నివేశాల్లో లిప్ లాక్స్ మిస్ కాకుండా దర్శకనిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. స్టార్ హీరోలు సైతం ఈ లిప్ లాక్స్‌కి ఓకే చెబుతుండటంతో.. చిన్న, కుర్ర హీరోలు కూడా వారిని ఫాలో అవుతున్నారు. ఇటీవల వచ్చిన ‘ఆయ్’, ‘మారుతి నగర్ సుబ్రహ్మణ్యం’ సినిమాలలో కనిపించిన కుర్ర హీరో అంకిత్ కూడా ఇప్పుడు లిప్ లాక్స్ బాట పట్టాడు. వాలెంటైన్స్ డే ని పురస్కరించుకుని ఆయన నటిస్తోన్న సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌ని మేకర్స్ వదిలారు.
Also Read- Samantha: ఎట్టకేలకు విడాకులకు కారణం చెప్పిన సమంత!
ఈ పోస్టర్‌లో హీరోయిన్ నీలఖి పత్రతో డీప్ లిప్ లాక్ చేస్తున్నట్లుగా ఫస్ట్ లుక్‌ని రెడీ చేసి వదిలారు. ఈ లుక్ చూసిన వారంతా ఈ కుర్ర హీరో కూడా లిప్ లాక్ చేశాడంటూ ఒకటే కామెంట్స్. వాలెంటైన్స్ డేకి పర్ఫెక్ట్ ట్రీట్ అనేలా వచ్చిన ఈ ఫస్ట్ లుక్ ప్రస్తుతం సోషల్ మాధ్యమాలలో వైరల్ అవుతోంది. ఈ సినిమాను ‘త్రిబాణదారి బార్బరిక్’ అనే మైథలాజికల్ థ్రిల్లర్ చిత్రాన్ని నిర్మిస్తున్న వానరా సెల్యులాయిడ్స్ అనే సంస్థ నిర్మిస్తోంది. ఈ సంస్థతో పాటు మారుతీ టీం ప్రొడక్ట్, జీ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇంతకీ ఈ సినిమా పేరు ఏంటని అనుకుంటున్నారు? ‘బ్యూటీ’. ‘భలే ఉన్నాడే’ ఫేమ్ వర్ధన్ దర్శకత్వంలో అడిదాల విజయపాల్ రెడ్డి, ఉమేష్ కె ఆర్ బన్సాల్ ఈ ‘బ్యూటీ’ని నిర్మిస్తున్నారు.
ఇక ఈ ఫస్ట్ లుక్‌ని పరిచయం చేస్తూ విడుదల చేసిన మోషన్ పోస్టర్ కూడా వావ్ అనేలా ఉంది. సముద్రం, బీచ్, రోడ్డు, ఇళ్లు.. ఇలా చూపిస్తూ, ఒక్కసారిగా హీరోహీరోయిన్లు లిప్ లాక్ చేస్తున్నట్లుగా రొమాంటిక్ టచ్‌తో ఈ ఫస్ట్ లుక్‌ని డిజైన్ చేశారు. ఈ మోషన్ పోస్టర్ విజువల్స్, ఆర్ఆర్ కూడా మూడ్‌కి తగినట్లుగా ఉండటం విశేషం. వాలెంటైన్స్ డే రోజున యూత్ ఆడియన్స్‌కు కిక్ ఇచ్చేలా వచ్చిన ఈ పోస్టర్ సినిమాపై కూడా క్రేజ్ ఏర్పడేలా చేస్తుంది. కుర్ర హీరో అంకిత్ కొయ్య ఈ సినిమా సోలో హీరోగా నటిస్తున్నాడని, ఈ ఏడాది విడుదలయ్యే సినిమాలలో ఇది కూడా ఓ క్రేజీ ప్రాజెక్ట్ అవుతుందని మేకర్స్ చెబుతున్నారు. విజయ్ బుల్గానిన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.
ఇవి కూడా చదవండి: