Miryalaguda Municipality: మిర్యాలగూడ కాంగ్రెస్ పార్టీలో రాజకీయం హీట్ ఎక్కింది. కాంగ్రెస్ పార్టీలో రసవత్తర రాజకీయం నడుస్తోంది. మున్సిపల్ చైర్ పర్సన్ లక్ష్యంగా రాజకీయాలు ఊపందుకున్నాయి. కాంగ్రెస్ పార్టీలో ఎంతో రాజకీయ అనుభవం కలిగిన నేతలు చైర్ పర్సన్ పీఠం దక్కించుకునేందుకు పావులు కదుపుతున్నారు. ఆర్థిక రాజకీయ బలాలు కలిగి ఉండటంతో మున్సిపల్ చైర్ పర్సన్ పీఠం ఎవరిని వరించనుంది అనేది చర్చగా మారింది. మిర్యాలగూడ మున్సిపాలిటీలో మొత్తం 48 వార్డులు ఉన్నాయి. కాగా ఈ మున్సిపాలిటీ పరిధిలో కాంగ్రెస్ పార్టీ నుంచి అభ్యర్థుల ఎంపిక సంక్లిష్టంగా మారగా కాంగ్రెస్ పార్టీలో ఇప్పటికే కొన్ని వార్డుల్లో ఖరారైన అభ్యర్థులతో పాటు ఆశావాహులు నామినేషన్స్ దాఖలు చేశారు. 48 వార్డులలో ఇద్దరు, ముగ్గురు కాంగ్రెస్ పార్టీ నుంచి నామినేషన్లు దాఖలు చేయటం గమనార్హం.
మున్సిపల్ చైర్ పర్సన్ పదవికి ఆసక్తికర పోరు
మిర్యాలగూడ మున్సిపాలిటీ జనరల్ మహిళకు రిజర్వ్ కాగా ఎమ్మెల్యే సతీమణి సహా మాజీ మున్సిపల్ చైర్ పర్సన్, మాజీ మహిళ కౌన్సిలర్లు మున్సిపల్ చైర్ పర్సన్ పదవిని టార్గెట్ చేసి ఎన్నికల బరిలో దిగటంతో మున్సిపల్ పోరు ఆసక్తికరంగా మారింది. ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి సతీమణి బత్తుల మాధవి 39వ వార్డు (అశోక్ నగర్) జనరల్ స్థానం నుంచి, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు నూకల వేణుగోపాల్ రెడ్డి సతీమణి తన ప్రభుత్వ ఉద్యోగానికి రిజైన్ చేసి 17వార్డు(విద్యానగర్.హౌసింగ్ బోర్డ్) జనరల్ మహిళా స్థానం నుంచి నూకల కవిత, 27వ వార్డు శాంతినగర్ జనరల్ మహిళ, 14వ వార్డు షాబునగర్ జనరల్ స్థానం నుంచి మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ తిరు నగర్ నాగలక్ష్మీ భార్గవ్, 2వ వార్డు (తాళ్లగడ్డ చైతన్య నగర్) జనరల్ మహిళ స్థానం నుంచి శాగ జయలక్ష్మి జలంధర్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. 31వ వార్డు (బంగారుగడ్డ) నుంచి చిలుకూరి సుధ బాలకృష్ణ, 4వ వార్డు రాంనగర్, 39, 41 వ వార్డు నుంచి ప్రముఖ పారిశ్రామికవేత్త గుడిపాటి నవీన్ సతీమణి శిరీష, యువజన కాంగ్రెస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు మిట్టపల్లి వెంకటేష్ మాతృమూర్తి మిట్టపల్లి శ్రీదేవి 40 వ వార్డు శాంతినగర్ నుంచి నామినేషన్ దాఖలు చేశారు.
Also Read: Illegal Steroid Sale: సిక్స్ ప్యాక్ కోసం స్టెరాయిడ్లు.. మృత్యు ముఖానికి చేరుతున్న యువకులు
పదవిని దక్కించుకునేందుకు..
ప్రధానంగా మిర్యాలగూడ మున్సిపాలిటీ(Miryalaguda Municipality) జనరల్ మహిళకు రిజర్వు కాగా ఆ పదవిని దక్కించుకునేందుకు అధికార పార్టీ నుంచి గట్టి పోటీ ఉంది. అభ్యర్థులకు రాజకీయ వ్యూహంతో పాటు ఆర్థికంగా ఖర్చు పెట్టేందుకు సిద్ధంగా ఉండటంతో చైర్మన్ పీఠంపై అధికార పార్టీలో హాట్ టాపిక్ నడుస్తోంది. కాగా ఈ మున్సిపల్ ఎన్నికల్లో ఎమ్మెల్యే సతీమణి బత్తుల మాధవి 39వ వార్డు అశోక్ నగర్, ఎమ్మెల్యే పెద్ద కుమారుడు బత్తుల సాయి ప్రసన్నకుమార్ 40 వ వార్డు శాంతినగర్, చిన్న కుమారుడు బత్తుల ఈశ్వర్ గణేష్ కుమార్ 28 వార్డు సీతారాంపురం నుంచి నామినేషన్లు దాఖలు చేశారు. మిర్యాలగూడ మున్సిపాలిటీ పరిధిలో 48 వార్డుల్లో 93020 వేల ఓట్లు ఉండగా ఓటర్లు ఎవరి ఆశీర్వదిస్తారనేది వచ్చే నెల 13న తేలనుంది.
Also Read: Karimnagar Politics: కరీంనగర్లో బీఆర్ఎస్కు మరో షాక్

