Liquor Business War: ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి వర్సెస్ ఎక్సైజ్ శాఖ
నల్గొండ, స్వేచ్ఛ: మునుగోడు నియోజకవర్గంలో లిక్కర్ బిజినెస్ వార్ మరింత (Liquor Business War) ముదురుతోంది. నియోజకవర్గ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి (Rajagopal Reddy) వైన్స్‌లను మధ్యాహ్నం 1 గంటకు తెరవాలని, పర్మిట్ రూములను 6 గంటలకు ఓపెన్ చేయాలని వైన్స్ వ్యాపారులకు చెబుతూ వస్తున్న సంగతి తెలిసిందే. అయితే, మునుగోడు, చండూరు మండలాలలో మినహా నాంపల్లి, మర్రిగూడ, చౌటుప్పల్, దండు మల్కాపురం, కొయ్యలగూడెం, లింగోజిగూడెం, నేలపట్లలో 10 గంటలకే తెరుస్తున్నారు. దీంతో, నారాయణపూర్ మండలంలోనూ అదే టైమింగ్స్‌ను అమలు చేశారు. కాగా, నారాయణపూర్ లోకల్ లీడర్లు, కార్యకర్తలు, ఇటీవల ఎన్నికైన సర్పంచ్ శుక్రవారం ఎమ్మెల్యే చెప్పిన రూల్స్ ప్రకారం వైన్స్‌లను టైమింగ్స్‌ను పాటించాలని, 10 గంటలకు తెరవకూడదని వైన్స్‌ల మూసివేతకు ప్రయత్నించారు. దీంతో వైన్స్ వ్యాపారులకు, లోకల్ లీడర్లకు మధ్య ఘర్షణ రాష్ట్రవ్యాప్తంగా చర్చ నీయాశంగా మారింది.
Read Also- Bandi Sanjay On KTR: ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కేటీఆర్‌పై మరోసారి బండి సంజయ్ ఆరోపణలు
దాడులకు దిగుతున్నారని ఫిర్యాదు
ఎక్సైజ్ శాఖ రూల్స్ ప్రకారం, వైన్స్‌లను ఓపెన్ చేస్తున్నామని, అయితే ఎమ్మెల్యే అనుచరులుగా ఉన్న లోకల్ లీడర్లు షాపులను తెరిచిన విషయమై దాడులకు దిగుతున్నారని ఎక్సైజ్ శాఖ కమిషనర్‌కు వ్యాపారులు ఫిర్యాదు చేశారు. దీంతో, కమిషనర్ ఆదేశాల మేరకు రంగంలోకి దిగిన రామన్నపేట ఎక్సైజ్ పోలీసులు శుక్రవారం ఉదయం 10 గంటలకు నారాయణపూర్ చేరుకొని షాపుల వద్ద పహారా కాశారు. దీంతో, వ్యాపారులు వైన్ షాపులను ఓపెన్ చేసి నిర్వహించారు. దీంతో సర్పంచ్‌తో పాటు మరి కొంతమంది లీడర్లు ఏకమై గొడవ దిగారు. వైన్ షాప్‌లను బంద్ చేయకపోతే మహిళలతో ధర్నాలు చేస్తామని హెచ్చరించారు. నారాయణపూర్‌లో గొడవ జరుగుతున్న విషయమై సమాచారం అందుకున్న చౌటుప్పల్, సర్వేలోని వ్యాపారులు షాపులను వెంటనే క్లోజ్ చేశారు. మొత్తానికి వైన్ షాపుల నిర్వహణ వ్యవహారం ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి, ఎక్సైజ్ శాఖ, వైన్స్ వ్యాపారుల మధ్య వైరంగా మారింది. మునుగోడు, చండూరు మండలాల్లో ఎమ్మెల్యే ఆదేశాల మేరకు వైన్ షాపులో నిర్వహణ టైమింగ్స్ అమలవుతుండగా మిగిలిన చోట్ల సైతం పాటించాలని లోకల్ లీడర్లు, వైన్స్ వ్యాపారుల మధ్య వార్ ఎంత వరకు దారితీస్తుంది అనేది వేచి చూడాల్సి ఉంది.
Read Also- Medaram Jatara: మేడారం జాతర ఏర్పాట్లలో కలెక్టర్, ఎస్పీ ఫుల్ బిజీ.. ఎక్కడికక్కడ తనిఖీలు

