Realme 16 5G: ప్రముఖ చైనీస్ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ రియల్ మీ నుంచి మరో అడ్వాన్స్డ్ మెుబైల్ మార్కెట్ లో విడుదలైంది. తన లేటెస్ట్ మెుబైల్ ‘రియల్ మీ 16 5జీ’ (Realme 16 5G)ను వియాత్నం మార్కెట్ లో రిలీజ్ చేసింది. అయితే మెుబైల్ ప్రియుల నుంచి ఈ ఫోన్ కు విశేష ఆదరణ లభిస్తోంది. ఫీచర్లు అదిరిపోయాయంటూ నెట్టింట ప్రచారం జరుగుతోంది. ఇదే ఫోన్ త్వరలో భారత్ లోనూ విడుదల కానున్న నేపథ్యంలో.. ‘రియల్ మీ 16 5జీ’ మెుబైల్ ఫీచర్లు, కెమెరా క్వాలిటీ, మెుబైల్ ధర ఎంత ఉండొచ్చు వంటి అంశాలను ఇప్పుడు పరిశీలిద్దాం.
అడ్వాన్స్డ్ ప్రొసెసర్..
Realme 16 5G మెుబైల్ ను 6.57 అంగుళాల పుల్ HD+ AMOLED డిస్ ప్లే (1,080 x 2,372 పిక్సెల్స్)తో తీసుకొచ్చారు. 120Hz రిఫ్రెష్ రేట్, 240Hz వరకు టచ్ శాంప్లింగ్ రేటు, 4,200 nits పీక్ బ్రైట్‌నెస్, DT స్టార్ D+ గ్లాస్ ప్రొటెక్షన్ ను ఈ ఫోన్ కలిగి ఉంది. ఈ ఫోన్ ఆక్టా కోర్ MediaTek Dimensity 6400, ఆండ్రాయిడ్ 16 ఆధారిత Realme UI 7.0 ఆపరేటింగ్ సిస్టమ్ తో వర్క్ చేయనుంది.
కెమెరా, బ్యాటరీ..
Realme 16 5G మెుబైల్ ను 7,000mAh బ్యాటరీతో తీసుకొచ్చారు. దీనికి 60W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్, రివర్స్ ఛార్జింగ్ సపోర్టును అందించారు. కెమెరా విషయానికి వస్తే ఫోన్ వెనుక భాగంలో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. 50 MP వైడ్ యాంగిల్ సెన్సార్, 2MP మోనోక్రోమ్ సెన్సార్ ను ఫిక్స్ చేశారు. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 50MP సెన్సార్ ను ముందు భాగంలో అమర్చారు.
కనెక్టివిటీ ఫీచర్లు..
Realme 16 5G ఫోన్ లో Wi-Fi 6, బ్లూటూత్ 5.3, 5G, 4G LTE, BeiDou, GPS, GLONASS, గెలీలియో, QZSS, USB టైప్-C పోర్ట్ వంటి కనెక్టివిటీ ఫీచర్లు ఉన్నాయి. అలాగే ఇన్-డిస్ ప్లే అల్ట్రాసోనిక్ ఫింగర్ ప్రింట్ సెన్సార్, ప్రాక్సిమిటీ సెన్సార్, యాంబియంట్ లైట్ సెన్సార్, యాక్సిలెరోమీటర్, గైరోస్కోప్, హాల్ సెన్సార్, లేజర్ ఆటోఫోకస్ సెన్సార్, స్పెక్ట్రోఫోటోమీటర్ తదితర సెన్సార్లు యూజర్లకు ఉపయోగపడనున్నాయి.
Also Read: Sonu Sood: సోషల్ మీడియా విషయంలో.. ప్రధానికి సోనూసూద్ సంచలన విన్నపం
ధర ఎంత ఉండొచ్చు!
భారత మార్కెట్ లో Realme 16 5G మెుబైల్ ధర, విడుదల తేదీ వంటి వాటిపై అధికారిక ప్రకటన రాలేదు. ప్రస్తుతం ఈ ఫోన్ రెండు వేరియంట్లలో వియాత్నం మార్కెట్ లో సేల్ అవుతుంది. అక్కడ నిర్ణయించిన ధరను బట్టి చూస్తే.. బేసిక్ వేరియంట్ (8GB + 256GB) ధర భారత్ లో రూ. 40,000గా ఉండొచ్చని టెక్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అలాగే ప్రీమియం వేరియంట్( 12GB + 256GB) రూ.44,000 వరకూ పలకొచ్చని అభిప్రాయపడ్డాయి.

